ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో సేల్స్ పెంచుకుని, దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో తమ స్థానాన్ని పటిష్టపరుచుకోవడానికి నాలుగు కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని నిర్ణయించకుంది. అందులో ఇటీవల మహీంద్ర

By Anil Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో సేల్స్ పెంచుకుని, దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో తమ స్థానాన్ని పటిష్టపరుచుకోవడానికి నాలుగు కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని నిర్ణయించకుంది. అందులో ఇటీవల మహీంద్రా టియువి300 ప్లస్ 9-సీటర్ మోడల్‌ను విడుదల చేసింది.

ఇప్పుడు, వరుసగా మరో మూడు కొత్త మోడళ్లను ఈ ఏడాదిలోనే లాంచ్ చేయాలని భావిస్తోంది. మహీంద్రా అప్‌కమింగ్ మోడళ్ల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో....

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

ఎస్‌యూవీల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా ఇప్పటి వరకు ఎమ్‌పీవీ కార్ల విభాగం ఒక్క మోడల్ కూడా ప్రవేశపెట్టలేకపోయింది. అందు కోసం విపణిలో ఉన్న మారుతి ఎర్టిగా మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీల మధ్య స్థానాన్ని భర్తీ చేసేందుకు యు321 పేరుతో సరికొత్త ఎమ్‌పీవీని రూపొందించింది.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

మహీంద్రా నార్త్ అమెరికా టెక్నికల్ సెంటర్ యు321 పేరుతో అంతర్జాతీయ మోడల్‌గా అభివృద్ది చేసింది. విశాలమైన క్యాబిన్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మోనోకోక్యూ ఛాసిస్ మీద దీనిని నిర్మించారు.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

ప్రత్యేకించి దీని కోసం 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా డెవలప్ చేసినట్లు సమాచారం. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది 7 మరియు 8 మంది ప్రయాణించే సీటింగ్ లేఔట్లో లభ్యం కానుంది.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

ఎస్201 - సబ్‌-4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఇండియన్ ఎస్‌యూవీ విభాగంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అత్యంత ప్రాచుర్యం పొందింది. నాలుగు-మీటర్లు పొడవు ఉన్న విభాగంలో గల ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉంది. వితారా బ్రిజా మరియు టాటా నెక్సాన్ మోడళ్ల మీద వస్తున్న విపరీతమైన ఆదరణ ఇందుకొక ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

మహీంద్రా తమ కొరియా దిగ్గజం శాంగ్‌యాంగ్ కంపెనీకి చెందిన టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆధారంగా ఎస్201 కోడ్ పేరుతో ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం ఒక కొత్త ఎస్‌యూవీని అభివృద్ది చేసింది.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

ఎస్201 మహీంద్రా యొక్క తొలి సబ్-4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది మరియు ఇవి వరుసగా 140బిహెచ్‌పి మరియు 125బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. తొలుతు 5-సీటింగ్ సామర్థ్యంతో వస్తోన్న ఎస్201, కాస్త ఆలస్యంగా 7-సీటింగ్ లేఔట్లో కూడా రానున్నట్లు సమాచారం.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

కెయువి100 ఆటోమేటిక్

దేశీయంగా ఆటోమేటిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా తమ కెయువి100 ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని ఆటోమేటిక్ లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది చివరిలో కెయువి100 ఆటోమేటిక్ వేరియంట్లు విడుదల కానున్నట్లు సమాచారం.

ఈ ఏడాది వరుసగా విడుదలకు సిద్దమైన మూడు మహీంద్రా కార్లు

మహీంద్రా కెయువి100 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన ఆప్షన్‌లలో లభ్యం కానుంది. వీటి ధరలు మ్యాన్యువల్ వేరియంట్ల ధరలతో సమానంగా లేదంటే రూ. 50,000 వరకు తక్కువ ధరతో పరిచయం అయ్యే అవకాశం ఉంది.

Mahindra S201 Image: Vikatan

Most Read Articles

English summary
Read In Telugu: new mahindra cars for india launching in 2018
Story first published: Saturday, June 23, 2018, 12:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X