విడుదలకు సర్వం సిద్దం చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

Written By:

దేశీయ దిగ్గజ ఎస్‌‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే, సరికొత్త 2018 ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు లీకయ్యాయి.

మీరు కనుక మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉన్నట్లయితే, పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్‌యూవీ500 మీద ఓ లుక్కేసుకోండి...

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌తో లభించనుంది. ఇది గరిష్టంగా 155బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మునుపటి ఎక్స్‌యూవీ500తో పోల్చుకుంటే ఇది 15బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్ అధికంగా ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, 2-లీటర్ డీజల్ ఇంజన్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ఐదు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి, W5, W7, W9, W11 and W11(ఆప్షనల్). ఎంట్రీ లెవల్ వేరియంట్ W5 మినహా మిగతా అన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభించనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

అన్ని చక్రాలకు ఇంజన్ పవర్ సరఫరా అయ్యే ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండూ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్ W11లో మాత్రమే లభ్యమవుతోంది.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఏడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, వైట్, సిల్వర్, బ్రౌన్, పర్పుల్, బ్లాక్, రెడ్ మరియు కాపర్. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ W5లో బ్లాక్ మరియు గ్రే కలర్ ఇంటీరియర్, ఆరు మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల సీటు, రిమోట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ మరియు ఫాలో-మి-హోమ్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ W7 వేరియంట్లో టాన్ మరియు బ్లాక్ ఇంటీరియర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ సొబగులు వంటి ప్రదానంగా గుర్తించదగిన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

అదే విధంగా W9 వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో 17-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, డైనమిక్ అసిస్ట్, ఎనిమిది రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న డ్రైవర్ సీటు ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

విపరీతమైన ఫీచర్లతో నిండిన మహీంద్రా ఎక్స్‌యూవీ W11 వేరియంట్లో లెథర్ ఫినిషింగ్ గల డ్యాష్ బోర్డ్ మరియు డోర్ ట్రిమ్స్, క్రోమ్ టెయిల్‌గేట్ మరియు 18-అంగుళాల పరిమాణంలో ఉన్న డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అప్షనల్‌8గా లభిస్తున్నాయి. ఎక్ట్సీరియర్‌లో ముందు మరియు వెనుక వైపున డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో ఓవరాల్‌గా అధునాతన ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ లైట్ల జోడింపుతో ఉన్న రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, త్రిభుజాకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రీడిజైన్ చేసిన రియర్ బంపర్ వంటివి మునుపటి ఎక్స్‌యూవీతో పోల్చితే వ్యత్యాసాన్ని కనబరుస్తాయి.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్‌యూవీ500 ఎక్ట్సీరియర్‌ డిజైన్‌లో ప్రధానంగా గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంది.

ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ ధరల శ్రేణి అంచనాగా రూ. 13 లక్షల నుండి రూ. 18 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు. ఇది విపణిలో ఉన్న రెనో క్యాప్చర్, హ్యుందాయ్ క్రెటా మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవూవీ500 ఫేస్‌లిఫ్ట్

1. రహస్యంగా పరీక్షిస్తూ దొరికిపోయిన మారుతి ఎర్టిగా

2.క్రెటా, ఎక్స్‌యూవీ500 లకు మారుతి నుండి పొంచి ఉన్న ముప్పు ఇదే

3.ఒకేసారి 9 మోడళ్లతో మారుతికి షాకిచ్చిన టాటా మోటార్స్

4.దిగ్గజాలను వణికిస్తోన్న టాటా కొత్త ఎస్‌యూవీలు

5. టాటా సఫారీ ఆర్మీ ఎడిషన్

Source: Team BHP

English summary
Read In Telugu: 2018 Mahindra XUV500 Specifications Revealed; Variants, Features, Expected Price And More
Story first published: Saturday, April 7, 2018, 12:47 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark