రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడిన కొత్త తరం మారుతి ఎర్టిగా

Written By:

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీని ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తోంది. రెండవ తరానికి చెందిన 7-సీటర్ ఎర్టిగా ఎమ్‌పీవీని వచ్చే ఆగష్టు 2018న విడుదల చేయాలని భావిస్తోంది.

2018 మారుతి ఎర్టిగా

ప్రస్తుతం ఉన్న ఎర్టిగా ఎమ్‌పీవీతో పోల్చుకుంటే కొత్త తరం ఎర్టిగా అధిక పొడవు, వెడల్పు మరియు ఎక్కువ ఎత్తులో ఉంది. పాత తరం ఎర్టిగా కంటే విశాలమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్ దీని సొంతం.

A post shared by AutonetMagz (@autonetmagz) on Apr 4, 2018 at 8:31pm PDT

టెస్టింగ్ నిర్వహిస్తున్న మారుతి ఎర్టిగా వీడియోను చూస్తే, డిజైన్ పరంగా భారీ మార్పులు చేర్పులు చేసుకున్నట్లు తెలుస్తుంది. సరికొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు అప్‌డేటెడ్ ఫ్రంట్ బంపర్ అంతే కాకుండా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ గమనించవచ్చు.

2018 మారుతి ఎర్టిగా

రియర్ డిజైన్‌లో ఎక్కువ బరువుతో వ్రేళాడే ఓవర్‌హ్యాంగింగ్ డిజైన్, పైభాగంలో చిన్నగా ఉన్న రియర్ స్పాయిల్ మరియు నూతన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ వంటివి పరీక్షించబడుతున్న మోడల్ సెకండ్ జనరేషన్ ఎర్టిగా ఎమ్‌పీవీ అని చెప్పకనేచెబుతున్నాయి.

2018 మారుతి ఎర్టిగా

మారుతి సుజుకి వారి నూతన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఎర్టిగా ఎమ్‌పీవీని అభివృద్ది చేస్తున్నారు. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డిజైర్ మరియు బాలెనో, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లను కూడా నిర్మించారు.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
2018 మారుతి ఎర్టిగా

2018 మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీ సాంకేతికంగా అవే మునుపటి ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. ఇందులోని 1.3-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 88బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా, 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ 90బిహెచ్‌పి పవర్ మరియు 130ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించనున్నాయి.

2018 మారుతి ఎర్టిగా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త తరం మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీ మునుపటి తరం ఎర్టిగాతో పోల్చుకుంటే రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ డిజైన్ మరియు అత్యాధునిక ఇంటీరియర్‌ను కలిగి ఉంది. మారుతి సుజుకి ఇండియన్ ఎమ్‌పీవీ సగ్మెంట్లో రాణించడానికి ఎర్టిగా కీలకపాత్ర పోషించనుంది.

మారుతి ఎర్టిగా

1. రాయలసీమలో ఖచ్చితంగా వెళ్లాల్సిన 15 రోడ్ ట్రిప్స్

2.ఆర్మీ ఎడిషన్‌లో టాటా సఫారీ: అసలు తిరకాసు ఇక్కడే ఉంది!!

3.మార్కెట్ నుండి పల్సర్ ఎల్ఎస్ 135 బైకును తొలగించిన బజాజ్

4.5 మరియు 7 సీటింగ్ ఎస్‌యూవీలకు రహదారి పరీక్షలు నిర్వహించిన టాటా

5.ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లు

Video Courtesy: autonetmagz

English summary
Read In Telugu: New Maruti Ertiga 2018 Spotted Testing; Expected Launch Date, Price, Specs, Features & Images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark