2018 మారుతి స్విఫ్ట్ అంచనా విడుదల మరియు ధరల వివరాలు

Written By:
Recommended Video - Watch Now!
Ducati 959 Panigale Crashes Into Buffalo - DriveSpark

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కొత్త తరం 2018 మారుతి స్విఫ్ట్(2018 Maruti Swift) కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. 2018 స్విఫ్ట్ కార్లు డీలర్లను చేరుతున్నాయి అని మరియు దేశవ్యాప్తంగా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఓ కథనాన్ని ఇది వరకే ప్రచురించాము.

అయితే, ఇప్పుడు సరికొత్త స్విఫ్ట్ విడుదల మరియు అంచనా ధరల వివరాలను ఈ కథనంలో మీ కోసం తీసుకొచ్చాం...

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

2018 మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌‌ను మారుతి సుజుకి తమ ఇండియా వెబ్‌సైట్లోకి చేర్చింది. ఇంజన్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు మరియు వేరియంట్లతో సహా అన్ని వివరాలను పొందుపరిచింది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

ఫస్ట్ జనరేషన్ స్విఫ్ట్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. ఇప్పుడు, డిజైన్, అధునాతన ప్రీమియమ్ ఫీచర్లు మరియు ఇంత వరకు స్విఫ్ట్ కారులో రానటువంటి ఎన్నో కొత్త ఫీచర్లతో మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ విడుదలకు సిద్దమైంది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

ఇప్పటికే విపణిలో భారీ అంచనాలను క్రియేట్ చేసి, ఇండియన్ కస్టమర్లలో తీవ్ర ఆసక్తిరేపిన స్విఫ్ట్ ఖచ్చితంగా ఎప్పుడు విడుదలవుతోంది? కొత్త తరం స్విఫ్ట్ ప్రారంభ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధరలు ఎలా ఉండనున్నాయి....? వంటి ప్రశ్నలకు సమాధానం చూద్దాం రండి...

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

సరికొత్త మారుతి స్విఫ్ట్ విడుదల తేది

ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఫిబ్రవరి 8 లేదా 9,2018 తేదీలలో స్విఫ్ట్ విడుదల ఉండనుంది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

2018 మారుతి స్విఫ్ట్ అంచనా ధర

మారుతి సుజుకి ఇది వరకు విపణిలో విక్రయించిన సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.80 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.47 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉండేవి.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

రెండవ తరం స్విఫ్ట్ స్థానంలోకి వస్తున్న థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ భారీ అప్‌డేట్స్ మరియు ఎన్నో కొత్త ఫీచర్లతో వస్తుండటంతో 2018 స్విఫ్ట్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 5 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8 లక్షలు(అంచనా)గా ఉండే అవకాశం ఉంది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

2018 సుజుకి స్విఫ్ట్ డిజైన్

2018 స్విఫ్ట్‌ను చూడగానే ముందుగా ఆకట్టుకునేది డిజైన్. నిజమే, పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఆ వ్యత్యాసం ఏంటో తెలుస్తుంది. ప్రత్యేకించి ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న సరికొత్త హెక్సా గోనల్ సింగల్ పీస్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న ఆకర్షణీయమైన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

కొత్త తరం స్విఫ్ట్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడటానికి సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ శైలిలోనే ఉంటుంది. అయితే, ఈ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, విండో ఫ్రేమ్ మీద ఉన్న డోర్ హ్యాండిల్‌ ఉండటంతో సైడ్ డిజైన్ చాలా క్లీన్‌గా ఉంటంది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

రియర్ డిజైన్‌లో కూడా స్పష్టంగా గుర్తించదగిన మార్పులు సంభవించాయి. న్యూ మారుతి స్విఫ్ట్ రియర్ ప్రొఫైల్‌లో రీడిజైన్ చేయబడిన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, కొత్తగా రూపొందించిన టెయిల్‌గేట్ మరియు సరికొత్త బంపర్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న స్విప్ట్‌లో వచ్చే మారుతి సుజుకి లోగో కాకుండా కేవలం సుజుకి లోగోను మాత్రమే అందించారు. మరియు నెంబర్ ప్లేట్ పొజిషన్ కూడా బంపర్‌లో ఇముడింపజేశారు.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

సోలియో 7-సీటర్‌ను సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

2018 మారుతి స్విఫ్ట్ ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో సాంకేతికంగా సెకండ్ జనరేషన్ స్విఫ్ట్‌లోని అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను మారుతి తీసుకొచ్చింది. కొత్త తరం స్విఫ్ట్‌లో 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

స్విఫ్ట్‌లోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే విధంగా డీజల్ ఇంజన్ గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

ట్రాన్స్‌మిషన్

మారుతి ఇప్పటి వరకు విక్రయించిన మొదటి మరియు రెండవ తరం స్విఫ్ట్ కార్లలో కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండేది. అయితే, ఈ మూడవ తరం స్విఫ్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా వచ్చింది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

సరికొత్త హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన మారుతి

మారుతి సుజుకి 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సుజుకి వారి నూతన హార్టెక్(HEARTECT) ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. గతంలో విడుదలైన న్యూ డిజైర్ మరియు బాలెనో కార్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది. అందుకే, ఆ రెండు కార్ల పోలికలను కొద్దిగా న్యూ స్విఫ్ట్‌లో గుర్తించవచ్చు.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

నూతన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించడంతో, తక్కువ బరువుతో విశాలమైన క్యాబిన్ సాధ్యమైంది. అంతే కాకుండా తేలికపాటి ఛాసిస్ మీద రూపొందించడం జరిగింది. దీంతో అత్యుత్తమ హ్యాండ్లింగ్ మరియు బెస్ట్ మైలేజ్ సాధ్యమైందని మారుతి బృందం పేర్కొంది. స్విఫ్ట్‌ బరువు సుమారుగా 85కిలోల వరకు తగ్గింది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

2018 మారుతి స్విఫ్ట్ ఇంటీరియర్

సరికొత్త 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో అధునాతన ఆల్ న్యూ బ్లాక్ ఇంటీరియర్, న్యూ డిజైర్ తరహాలో పూర్తిగా రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ ఉన్నాయి. స్విఫ్ట్ ఇంటీరియర్‌లో ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఎయిర్ వెంట్స్, సర్క్యులర్ ఏ/సి కంట్రోల్స్ మరియు అతి ముఖ్యమైన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

2018 మారుతి స్విఫ్ట్ ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, మారుతి స్విఫ్ట్ ఇందులో కొత్తగా పరిచయం చేసిన 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ మరియు క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

2018 మారుతి స్విఫ్ట్ సేఫ్టీ

భద్రత పరంగా 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ లాక్ మరియు నైట్ అడ్జస్టబుల్ ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటివి ఉన్నాయి.

న్యూ మారుతి స్విఫ్ట్: విడుదల మరియు ధరలు

మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఫిబ్రవరి 7 నుండి 4, 2018 మధ్య ఢిల్లీలో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్‌లో విడుదల చేయనుంది. తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

English summary
Read In Telugu: New Maruti Swift 2018: Launch Date And Expected Price

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark