2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

Written By:
Recommended Video - Watch Now!
Ducati 959 Panigale Crashes Into Buffalo - DriveSpark

మారుతి సుజుకి కొత్త 2018 స్విఫ్ట్ కారును విడుదల సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో పాత తరం స్విఫ్ట్ విక్రయాలు పూర్తిగా నిలిపివేసింది. సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ స్థానంలోకి థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ అతి త్వరలో విడుదలవ్వనుంది.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

భారీ మార్పులు చేర్పులకు గురయ్యి, ఇప్పటికే అంతర్జాతీయ విపణిలో విక్రయాల్లో ఉన్న కొత్త తరం స్విప్ట్‌లో పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే భారీ మార్పులు సంతరించుకున్నాయి. ఇవాళ్టి కథనంలో డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, మరియు సేఫ్టీ పరంగా పాత మరియు కొత్త స్విఫ్ట్ కార్ల మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం రండి....

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

డిజైన్

పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే కొత్త తరం స్విఫ్ట్ డిజైన్ పరంగా భారీ మార్పులకు గురయ్యింది. అత్యాధునిక అప్‌డేట్స్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ శైలిని గుర్తించవచ్చు. ఫ్రంట్ డిజైన్‌లో ప్రత్యేకించి అధునాతన హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ క్లాసిక్ స్విఫ్ట్ డిజైన్ కలిగి ఉంది. బానెట్ క్రింద మరియు బంపర్‌లో రెండు ఫ్రంట్ గ్రిల్స్ ఉన్నాయి. రెండు స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్‌ మధ్యలో హనీకాంబ్ ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్‌లో ఉన్న ఎయిర్ ఇంటేకర్‌కు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, స్విఫ్ట్ ఓవరాల్ డిజైన్ అలాగే ఉన్నప్పటికీ కాస్త ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, విండో ఫ్రేమ్ మీద అందించి డోర్ హ్యాండిల్ ఉన్నాయి. కొత్త తరం స్విఫ్ట్‌లో సరికొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

న్యూ స్విఫ్ట్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, గుర్తించదగిన మార్పులు సంభవించాయి. ఆల్ న్యూ ఎల్ఇడి టెయిల్ లైట్ క్లస్టర్, డిక్కీ డోర్‌ను కూడా పెద్దగా విస్తరించడం జరిగింది. పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే నెంబర్ ప్లేట్ పొజిషన్ కూడా మార్చడం జరిగింది. ఢిక్కీ డోర్ మీద నుండి బంపర్ మీదకు వచ్చిన నెంబర్ ప్లేట్ గమనించవచ్చు.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

సరికొత్త థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ పాత తరం స్విఫ్ట్‌లోని అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లో లభిస్తోంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 81.8బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ తరహా కాకుండా 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కూడా లభిస్తోంది. మారుతి సుజుకి తొలిసారి తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ పరిచయం చేసింది. న్యూ స్విఫ్ట్‌లోని జడ్ఎక్స్ మరియు జడ్‌డిఐ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ అందిస్తోంది.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి సుజుకి తమ అధునాతన హార్టెక్ ఫ్లాట‌్‌ఫామ్ ఆధారంగా నిర్మించింది. అధిక తన్యత గల స్టీల్‌తో ఎక్కువ ధృడత్వం కలిగి ఉండే బాడీని హార్టెక్ ఫ్లాట్‌‌ఫామ్ ఆధారంగా నిర్మించడం జరిగింది. నూతన ఫ్లాట్‌ఫామ్‌ మీద నిర్మించడంతో పెట్రోల్ వేరియంట్ బరువు 85కిలోలు మరియు డీజల్ వేరియంట్ బరువు 75కిలోల వరకు తగ్గాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

ఇంటీరియర్

సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుతో పోల్చుకుంటే కొత్త తరం స్విఫ్ట్‌ ఇంటీరియర్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆల్ న్యూ బ్లాక్ థీమ్ ఇంటీరియర్. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఏ/సి వెంట్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు న్యూ స్విఫ్ట్ ఇంటీరియర్‌కు లగ్జరీ ఫీల్ తీసుకొచ్చాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

కొత్త తరం స్విఫ్ట్ ఇంటీరియర్‌లో అతి ముఖ్యమైన ఫీచర్లలో సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇగ్నిస్ క్రాసోవర్ కారు నుండి సేకరించిన 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డ్ మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానల్ వంటివి అర్బన్ క్రోమ్ శాటిన్ ఫినిషింగ్‌లో ఉన్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

ఫీచర్లు

2018 మారుతి స్విఫ్ట్‌లో ఇదివరకెన్నడూ పరిచయం కాని ఫీచర్లను అందిందించి. అందులో 7-అంగుళాల టచ్ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్ బిల్ట్ న్యావిగేషన్ సిస్టమ్, యుఎస్‍‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటి ఉన్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

వీటితో పాటు ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ ద్వారా కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ మరియు ఆటోమేటిక్ ఏ/సి ఉన్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

భద్రత

మారుతి సుజుకి ఈ కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఇంటీరియర్ ఫీచర్లు మరియు భద్రత పరంగా అద్భుతం చేసిందని చెప్పాలి. స్విఫ్ట్ లభించే అన్ని వేరియంట్లలో కనీసం సేఫ్టీ ఫీచర్లను అందించింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా, స్పీడ్ సెన్సిటివ్ ఆటోమేటిక్ డోర్ లాక్, పగలు మరియు రాత్రికి అనుగుణంగా దానంతట అదే అడ్జెస్ట్ అయ్యే ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ మరియు నూతన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన ఈ కొత్త తరం స్విఫ్ట్ ప్రయాణికుల భద్రతను కూడా మరింత మెరుగుపరించింది.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

కొలతలు

అంతే బాగుంది. పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే కొత్త తరం స్విఫ్ట్ కొలతలు పెరిగాయా... లేక తగ్గాయా...? విశాలమైన క్యాబిన్ అందించేందుకు హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన స్విఫ్ట్ కొలతలను పెంచింది. పాత స్విఫ్ట్ కంటే ఇది 40ఎమ్ఎమ్ వరకు వెడల్పు, 20ఎమ్ఎమ్ వరకు వీల్ బేస్ పెంచింది. దీంతో డిక్కీ స్పేస్ 58 లీటర్ల వరకు పెరిగి మొత్తం 268లీటర్ల లగేజ్ స్పేస్ ఉంది.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

ధర

మారుతి సుజుకి ఇది వరకు మార్కెట్లో అందుబాటులో ఉంచిన సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.80 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.47 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండేవి.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

పూర్తి స్థాయిలో కొత్త ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్, అధునాతన విసృత శ్రేణి ఫీచర్లు, నూతన డిజైన్ ఫిలాసఫీ మరియు అన్ని వేరియంట్లలో అతి ముఖ్యమైన ఫీచర్లతో వస్తున్న కొత్త తరం 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8 లక్షల మధ్య ఎక్స్‌-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త మారుతి స్విఫ్ట్ పూర్తి స్థాయిలో కొత్త రూపాన్ని కలిగి ఉంది. పాత మరియు కొత్త స్విఫ్ట్ కార్లను ఒకదాని ప్రక్కన ఒకటి ఉంచి చూస్తే, ఖచ్చితంగా కొత్త తరం స్విఫ్ట్ కారును ఇష్టపడతారు. డిజైన్ పరంగానే కాకుండా ఇంటీరియర్ ఫీచర్లు మరియు భద్రత పరంగా మారుతి అద్భుతం చేసింది.

మారుతి ఈ నూతన స్విఫ్ట్ విడుదలతో ప్యాసిజంర్ కార్ల పరిశ్రమలో అత్యధిక వాటా సొంతం చేసుకోనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: New Maruti Swift 2018 vs Old Swift: What Is The Difference?

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark