Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 24 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియాలో మినీ కంట్రీమ్యాన్ ప్రొడక్షన్ ప్రారంభం
మినీ ఇండియా తమ సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ ఉత్పత్తిని దేశీయంగా మొదలుపెట్టినట్లు ప్రకటించింది. బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన చిన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియన్ మార్కెట్లో పలు ఉత్పత్తులను విక్రయిస్తోంది. అయితే తాజాగా చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ ప్రొడక్షన్ ప్లాంటులో మినీ కంట్రీమ్యాన్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

విదేశీ లగ్జరీ కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వలన, అధిక మొత్తంలో దేశీయ నగదు విదేశీ కరెన్సీలోకి మారిపోతోంది. అంతే కాకుండా, వీటి మీద ప్రభుత్వం విధించే దిగుమతి సుంకం భారం కస్టమర్ల మీద ఎక్కువగా పడుతోంది.

ఇలాంటి ఎన్నో సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు పలు పాపులర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు దేశీయంగా ఉత్పత్తిని చేపట్టాయి. అందులో, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా, వీటి సరసన బిఎమ్‌డబ్ల్యూకి చెంది మినీ కూడా వచ్చి చేరింది.

మినీ ఇండియా ఇటీవల విపణిలోకి విడుదల చేసిన కంట్రీమ్యాన్ ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ ఎస్ మరియు జెసిడబ్ల్యూ మోడళ్లలో అదే విధంగా డీజల్ వేరియంట్ ఎస్‌డి మోడల్‌లో లభిస్తోంది.

సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ ప్రారంభ ధర రూ. 34.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఫ్లాట్‌ఫామ్ మీదనే మినీ కంట్రీమ్యాన్ కారును అభివృద్ది చేశారు. ఏదేమైనప్పటికీ, పలు మార్పులు చేర్పులతో పాటు ఎన్నో అప్‌డేట్స్ జరిగాయి.

2018 మినీ కంట్రీమ్యాన్ మునుపటి తరానికి చెందిన కారుతో పోల్చుకుంటే 200ఎమ్ఎమ్ వరకు పొడవు మరియు 30ఎమ్ఎమ్ వరకు వెడల్పు పెరిగింది. అంతే కాకుండా, వీల్ బేస్ కూడా 75ఎమ్ఎమ్ వరకు పెరిగింది.

సాంకేతికంగా పెట్రోల్ వేరియంట్ మినీ కంట్రీమ్యాన్ కారులో 190బిహెచ్‍పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు, అదే విధంగా డీజల్ వేరియంట్ కంట్రీమ్యాన్ 180బిహెచ్‍పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. అన్ని వేరియంట్లలోని రెండు ఇంజన్ ఆప్షన్‌లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది.

సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ ఎక్ట్సీరియర్‌లో ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన బంపర్లు, అధునాతన సిగ్నేచర్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ పైపులు ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, 8.8-అంగుళాల పరిమాణంలో ఉన్న స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఐడ్రైవ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ముందు వైపున స్పోర్ట్ సీట్లు మరియు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త 2018 మినీ కంట్రీమ్యాన్ ఇండియన్ మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మరియు ఆడి క్యూ3 వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.