హ్యుందాయ్ ఆటకట్టించేందుకు వోక్స్‌వ్యాగన్ భారీ ప్లాన్

వోక్స్‌వ్యాగన్ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ టి-క్రాస్ టీజర్ ఫోటోను రివీల్ చేసింది. సరిగ్గా చెప్పాలంటే హ్యుందాయ్ క్రెటా పోటీ. వోక్స్‌వ్యాన్ టి-క్రాస్ ఎస్‌యూవీని తొలుత 2016 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించి

By Anil Kumar

వోక్స్‌వ్యాగన్ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ టి-క్రాస్ టీజర్ ఫోటోను రివీల్ చేసింది. సరిగ్గా చెప్పాలంటే హ్యుందాయ్ క్రెటా పోటీ. వోక్స్‌వ్యాన్ టి-క్రాస్ ఎస్‌యూవీని తొలుత 2016 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. ఇప్పుడు దీనిని ఇండియన్ మార్కెట్లోకి అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా ప్రవేశపెట్టేందుకు వోక్స్‌వ్యాగన్ సిద్దమవుతోంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

చిత్రీకరించిన టి-క్రాస్ ఎస్‌యూవీ ఫోటోలను పరిశీలిస్తే వోక్స్‌వ్యాగన్ నూతన డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అని స్పష్టంగా తెలుస్తోంది. హెడ్ ల్యాంప్స్ క్రోమ్ హారిజంటల్ స్లాట్ గ్రిల్‌లోకి కలిసిపోయాయి. అంతే కాకుండా ఫాగ్ ల్యాంప్స్ జోడింపు గల ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ ఉంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇతర వోక్స్‌వ్యాగన్ ఎస్‌యూవీల తరహాలోనే పదునైన గీతలు మరియు అతి తక్కువ మలుపులతో చాలా చక్కగా ఉంటుంది. ప్రొడక్షన్ వెర్షన్ వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఖచ్చితంగా చిన్న అల్లాయ్ వీల్స్‌తో రానుంది. బహుశా 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రావచ్చు.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ రియర్ డిజైన్‌లో, అధునాతన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ముందు వైపు అందించిన తరహాలోనే ఉన్న రియర్ స్కిడ్ ప్లేట్ మరియు రియర్ మిర్రర్ పై భాగంలో పొట్టిగా ఉన్న పలుచటి స్పాయిలర్ వంటివి డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ మేరకు, టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవు 4,107ఎమ్ఎమ్, ఇది హ్యుందాయ్ క్రెటా (4270ఎమ్ఎమ్) కంటే తక్కువగా మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ (3998ఎమ్ఎమ్) కంటే కాస్త ఎక్కువగా ఉంది. అంతే కాకుండా, వోక్స్‌వ్యాగన్ పోలో కంటే కేవలం 54ఎమ్ఎమ్ పొడవుగా ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో కంపెనీ యొక్క ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తోంది. ఏదేమైనప్పటికీ, ఈ ఎస్‌యూవీ 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో రానుంది. టి-క్రాస్ ఎస్‌యూవీకి అనుగుణంగా పనితీరులో మార్పులు చేసిన ఈ ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ డీఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో పరిచయం చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

రిపోర్ట్స్ నుండి అందుతున్న సమాచారం మేరకు, వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఖచ్చితంగా ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో మాత్రమే లభించనుంది. అయితే, బహుశా అంతర్జాతీయ విపణిలో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ పరిచయం అయ్యే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఇండియన్ మార్కెట్లో టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఈ ఏడాదిలో అంతర్జాతీయ ఆవిష్కరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొలతల పరంగా కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ, ఇండియన్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి తన ఎంట్రీ ఇవ్వడం ఖాయం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో అత్యంత విజయవంతమైన విభాగం కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ - వోక్స్‌వ్యాగన్ ఇండియా ఇప్పటి వరకు దేశీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో బలమైన పోటీని ప్రవేశపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో విక్రయాలు జరిపేందుకు వోక్స్‌వ్యాగన్ తమ టి-క్రాస్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యూవీని అత్యంత సరసమైన ధరలో ప్రవేశపెట్టేందుకు సన్నద్దమవుతోంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Volkswagen T-Cross Compact-SUV Teased: Rivals The Hyundai Creta
Story first published: Thursday, July 5, 2018, 13:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X