హైదరాబాద్-బెంగళూరు హైవే మీద నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

Written By:
Recommended Video - Watch Now!
Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్-44)మీద నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కారు ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదానికి గురైన నిస్సాన్ జిటి-ఆర్ ఫోటోలను పరిశీలిస్తే రిపేరీ కూడా సాధ్యం కాని విధంగా నుజ్జునుజ్జయ్యింది.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

ఇప్పటి వరకు, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుం ఉన్న సమాచారం మేరకు రోడ్డు దాటుతున్న వారిని తప్పించబోయి ఇలా ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. అయితే ఇది ఎంత వరకు నిజమో దర్యాప్తులో తేలనుంది.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

సమాచార వర్గాల కథనం మేరకు, ఈ భయంకరమైన ప్రమాదం నుండి నిస్సాన్ జిటి-ఆర్ కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ప్రమాదంలో తీవ్రంగా ధ్వంసమైన కారును చూస్తే అలా అనిపించకపోవచ్చు.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

సూపర్ కార్లను అధిక వేగం వద్ద నిలపడానికి ప్రయత్నించి, ప్రమాదానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కారు ఎడమవైపును గమనిస్తే పూర్తిగా ధ్వంసమైంది. మితిమీరిన వేగంతో కారును అదుపు చేయలేక ఎడమవైపుకు పల్టీలు కొట్టిందని భావించవచ్చు.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

యాక్సిడెంట్‌లో తీవ్రంగా డ్యామేజ్ అయిన కారును తరలిస్తున్నపుడు ఫోటోలు సేకరించడం జరిగింది. యాక్సిడెంట్ అయిన కారును నడపడానికి వీలకాకపోవడంతో క్రేన్ సహాయంతో ట్రక్కు మీదకు చేర్చి తరలించారు.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

ఈ సంఘటనలో తప్పు ఎవరిదైనప్పటికీ, జాతీయ రహదారుల్లో ప్రయాణిస్తున్నపుడు ఒ నిర్ణీత వేగాన్ని మెయింటెన్ చేయడం ఎంతో ఉత్తమం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్లే జాతీయ రహదారుల్లో మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

నిస్సాన్ ఇండియాలో విక్రయిస్తున్న 2019 నిస్సాన్ జిటి-ఆర్(ఆర్35) సూపర్ కారు ధర రూ. 1.99 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

సాంకేతికంగా నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కారులో 3.8-లీటర్ కెపాసిటి గల ట్విన్-టుర్భోఛార్జ్‌డ్ వి6 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 6800ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 562బిహెచ్‌పి పవర్ మరియు 3600-5800ఆర్‌పిఎమ్ మధ్య 637ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ నుండి అని చక్రాలకు అందుతుంది.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కారు కేవలం 3 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, మరియు జిటి-ఆర్ గరిష్ట వేగం గంటకు 315కిలోమీటర్లుగా ఉంది.

నిస్సాన్ జిటి-ఆర్ యాక్సిడెంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రోడ్డు మొత్తం ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్మానుష్యంగా ఉంటే 100సీసీ బైకులు రైడ్ చేసే వారే మ్యాక్సిమమ్ స్పీడ్ ట్రై చేస్తారు. అలాంటి పవర్‌ఫుల్ ఇంజన్, క్షణాల్లో 100కిమీల వేగాన్ని అందుకునే గుణం ఉన్న కార్లను స్లోగా డ్రైవ్ చేయమంటే ఎవ్వరూ చేయరు. ఏదేమైనప్పటికీ వేగం ఖరీదు ప్రాణాలైనపుడు అతి వేగం అనవసరమనే చెప్పాలి.

కాబట్టి 100సీసీ బైకులో వెళ్లినా... పవర్‌ఫుల్ సూపర్ కార్లలో వెళ్లినా ఆయా రహదారులకు అనుగుణంగా సూచించిన స్పీడ్ లిమిట్స్‌ ఫాలో అవ్వండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Nissan GT-R Bangalore-Hyderabad Highway Crash — Driver Survives, GT-R Totalled!
Story first published: Tuesday, January 23, 2018, 11:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark