Subscribe to DriveSpark

భారత్‌లో అంబాసిడర్ బ్రాండుకు మళ్లీ ప్రాణం పోస్తున్న ప్యూజో

Written By:
Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

తెల్ల పంచె కట్టు, ఖద్దరు షర్టు ధరించి వైట్ కలర్‌ అంబాసిడర్ కారులో దిగితే ఆ కిక్కే వేరు. కొత్తగా వచ్చిన ఎన్ని కార్లలో కూడా ఆ మజా ఉండదు. ఇదేం టేస్ట్ అబ్బా అనుకుంటున్నారా... ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆ ఫీల్ ఏంటో మీకే తెలుస్తుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ప్యూజో అంబాసిడర్

అబాసిడర్ స్టైల్ కార్లు ఇప్పుడు కొందామంటే ఎక్కడ దొరుకుతాయి..? ఖచ్చితంగా కావాలంటే సెకండ్ హ్యాండ్ కార్లే గతి. కానీ, ఇక మీదట ఇలా ఉండదులేండి. ఎందుకంటే ఫ్రెంచ్‌కు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ప్యూజో ఇండియాలో అంబాసిడర్ బ్రాండ్‌కు పునరుజ్జీవం తీసుకురానుంది.

ప్యూజో అంబాసిడర్

మీరు చదివింది అక్షరాలే నిజమే, ఇండియాలో అంబాసిడర్ బ్రాండ్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అంబాసిడర్‌కు మళ్లీ ప్రాణం పోయనుంది. ప్యూజో మరియు సికె బిర్లా సంస్థలు అంబాసిడర్ పేరుతో కార్లను పరిచయం చేయన్నాయి.

ప్యూజో అంబాసిడర్

ప్యూజో, సిట్రన్, ఒపెల్ మరియు డిఎస్ ఆటోమొబైల్స్ కంపెనీలకు మాతృ సంస్థగా ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం పిఎస్ఎ గ్రూప్ దేశీయ దిగ్గజం సికె బిర్లా గ్రూపుతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుని అంబాసిడర్ బ్రాండ్‌ను రూ. 80 కోట్లకు కొనుగోలు చేసింది.

ప్యూజో అంబాసిడర్

నాలుగు సంస్థలు గల పిఎస్ఎ గ్రూప్ ఇండియన్ మార్కెట్లో ప్యూజో కంపెనీ ద్వారా కార్యకలాపాలు నిర్వహించనుంది. కార్ల తయారీ మరియు నిర్వహణ పరంగా దేశీయంగా సపోర్ట్ కోసం సికె బిర్లా కంపెనీని భాగస్వామిగా చేర్చుకుంది. ఇప్పుడు అంబాసిడర్ బ్రాండ్‌లో ఇరు కంపెనీలకు చెరిసగం వాటాలున్నాయి.

ప్యూజో అంబాసిడర్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, అంబాసిడర్ బ్రాండ్‌ ద్వారానే ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాలని ప్యూజో భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో పిఎస్ఎ గ్రూప్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ, ప్యూజో పేరు గురించి ఇండియన్ కస్టమర్లకు అవగాహన ఉండదు కాబట్టి అంబాసిడర్ కార్ల కంపెనీ పేరుతో తమ కార్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాడు.

ప్యూజో అంబాసిడర్

అయితే, ప్యూజో పేరుతో కార్లు వస్తాయా... లేకపోతే అంబాసిడర్ పేరుతో కార్లు వస్తాయా...? అనేది ఇంకా ఖాయం కాలేదు. కానీ, ప్యూజో మాత్రం అధిక వ్యయంతో అంబాసిడర్ బ్రాండ్‍‌ను సొంతం చేసుకోవడంతో ఈ బ్రాండ్ పేరు మీదనే కొత్త కార్లను తీసుకొచ్చే అవకాశం ఉంది.

ప్యూజో అంబాసిడర్

ఇండియన్ మార్కెట్లో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న అంబాసిడర్ కారును సికి బిర్లా మరియు ప్యూజో భాగస్వామ్యం తయారు చేసే అవకాశం లేకపోలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పాత కాలపు డిజైన్ స్టైల్‌తో వచ్చే మోడళ్లకు ఈ మధ్య ఆదరణ ఎక్కువగానే ఉంది. అందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను చక్కటి ఉదాహరణ.

Trending On DriveSpark Telugu:

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

2018లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం విడుదలయ్యే కార్లు

ప్యూజో అంబాసిడర్

ప్యూజో మరియు సికె బిర్లా గ్రూప్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఇండియాలో కార్ల ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తమిళనాడులోని హిందుస్తాన్ మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంటును కార్ల తయారీ కోసం ఉపయోగించుకోనుంది. భారత్‌లో కొత్త కార్ల అభివృద్ది మరియు తయారీ పరంగా సుమారుగా 700 కోట్ల రుపాయల వరకు పెట్టుబడి పెట్టనుంది.

ప్యూజో అంబాసిడర్

తొలుత ఏడాదికి లక్ష కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును సిద్దం చేసుకుని, భవిష్యత్తులో లభించే డిమాండ్ మరియు పెట్టుబడి ఆధారంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. ఇంజన్, గేర్‌బాక్స్ మరియు అన్ని ప్రధాన విడి భాగాలను ఇండియాలోనే తయారు చేసే, విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని ప్యూజో భావిస్తోంది.

ప్యూజో అంబాసిడర్

పిఎస్ఎ గ్రూప్ ఇండియన్ మార్కెట్లోకి ప్యూజో బ్రాండ్ పేరుతో 2019 నాటికి పూర్తి స్థాయిలో ప్రవేశించనుంది. భారత్‌లో అత్యధిక డిమాండ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో తమ తొలి కారును లాంచ్ చేయనుంది. ఈ తరుణంలో ప్యూజో ఇప్పటికే పలుమార్లు తమ 208 హ్యాచ్‌బ్యాక్ కారును భారత రోడ్ల మీద పరీక్షించింది.

ప్యూజో అంబాసిడర్

హ్యాచ్‌బ్యాక్‌తో పాటు మిడ్ సైజ్ సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీలను కూడా అభివృద్ది చేసి భారత్‌తో పాటు డిమాండ్ అధికంగా ఉన్న ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది.

ప్యూజో అంబాసిడర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

1960 మరియు 1970 ల కాలంలో అంబాసిడర్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. భారతీయుల నాడి గమనించిన ఫ్రెంచ్ దిగ్గజం ప్యూజో అంబాసిడర్‌కు మళ్లీ ప్రాణం పోస్తోంది. అంబాసిడర్ బ్రాండ్ పేరు క్రింద కార్లను తీసుకొచ్చినా... మళ్లీ అంబాసిడర్ కారునే లాంచ్ చేసినా అతిశయోక్తి లేదు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Financial Express

Picture credit: Wiki Commons

English summary
Read In Telugu: Peugeot Considering Revival Of Ambassador Brand In India
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark