ప్రపంచంలో మరే కారుకు సాధ్యం కాని ఛాలెంజ్ పూర్తి చేసిన రేంజ్ రోవర్ స్పోర్ట్

Written By:

చైనాలో సహజ సిద్దంగా ఏర్పడిన ఒక రాతి తోరణం కలదు. స్వర్గదామంగా పేరు పొందిన ఈ ప్రదేశాన్ని చేరుకోవాలంటే పెద్ద పెద్ద కొండల మధ్యనున్న 99 మలుపులు మరియు నిటారుగా ఉన్న 999 మెట్ల ద్వారా చేరుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలను కూడా ఈ మెట్ల ద్వారా హెవెన్ గేటును చేరుకోలేకపోయాయి.

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

అయితే, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎక్కడా ఆగకుండా ఏకబిగిన హెవెన్ గేట్‌ను చేరుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. వీడియో మరియు ఫోటోలతో పాటు మరిన్ని వివరాలు చూద్దాం రండి...

Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

చెైనాలోని టియాన్‌మెన్ మౌంటెయిన్ రోడ్డులో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఏడు మైళ్ల గుండా రోవర్ స్పోర్ట్ ప్రయాణించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ రోడ్డును డ్రాగన్ రోడ్డు అని కూడా పిలుస్తారు.

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

ఈ డ్రాగన్ రోడ్డు ఛాలెంజ్‌లో మొత్తం 99 మలుపులు మరియు నిటారుగా ఉన్న 999 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల సాధారణంగా మనుషులు నడవడమే ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. ఇలాంటి మెట్ల మీద రేంజ్ రోవర్ నాన్-స్టాప్‌గా ప్రయాణించింది.

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

ఈ సవాల్‌ను అధిగమించడానికి ఎస్‌యూవీలో ప్రత్యేకమైన టైర్లను అందించారు. ప్యానసానికి జాగ్వార్ రేసింగ్ బృందం నుండి హో-పిన్ టుంగ్ రేసర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసి ఛాలెంజ్ పూర్తి చేశాడు.

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

డ్రాగన్ రోడ్డు మీద ఏడు మైళ్లు ప్రయాణించడానికి రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ టెర్రైన్ రెస్పాన్ 2 సిస్టమ్‌ను డైనమిక్ మోడ్‌లో ఎంచుకున్నాడు.

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

రేంజ్ రోవర్ స్పోర్ట్ రోడ్డు మార్గాన్ని పూర్తి చేసుకుని, 45-డిగ్రీల వాలుతో ఉన్న 999 మెట్ల మార్గం ద్వారా స్వర్గపు తోరణాన్ని చేరుకోవడానికి ఆప్టిమైజ్డ్ టెర్రైన్ రెస్పాన్‌ను ఎంచుకున్నాడు.

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

ఎట్టకేలకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, సురక్షితంగా నిటారుగా ఉన్న 999 మెట్ల గుండా సహజ సిద్దంగా ఏర్పడిన రాతి తోరణాన్ని చేరుకున్నారు. ప్రపంచంలో ఈ మార్గాన్ని వెహికల్ ద్వారా చేరుకున్న తొలి సంఘటన ఇదే.

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

రేంజ్ రోవర్ స్పోర్ట్ నడిపిన డ్రైవర్ హో-పిన్ టుంగ్ మాట్లాడుతూ, " నేను, ఇప్పటి వరకు ఫార్మాలా ఇ, ఫార్ములా 1 మరియు 24 గంటల లి మ్యాన్స్ పోటీల్లో గెలుపొందాను. అయితే, ఇప్పటి వరకు ఇలాంటి కఠినమైన సవాళుతో కూడా డ్రైవింగ్ అనుభవాన్ని ఇదివరకెన్నడూ అనుభవించలేదని చెప్పుకొచ్చాడు."

నిటారు మెట్లు ఎక్కిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ

రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు తీసుకున్న అత్యంత కఠినమైన సవాళ్లలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గతంలో పైక్స్ పీక్ కొండను ఎక్కడం, అరేబియన్ భూ భాగంలో నిర్జీవంగా ఉన్న సువిశాలమైన ఎడారిని దాటడం మరియు స్విట్జర్లాండ్‌లోని 7,119 అడుగుల ఎత్తు ఉన్న పల్లపు మంచు పర్వతం నుండి క్రిందకు దిగడం వంటి ఎన్నో సవాళ్లను స్వీకరించింది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ హెవెన్ గేట్‌ను చేరుకోవడాన్ని వీడియోలో వీక్షించగలరు...!!

English summary
Read In Telugu: Range Rover Sport Does Something No Other Vehicle has Ever Done
Story first published: Tuesday, February 13, 2018, 18:34 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark