రెనో క్యాప్చర్ ఎస్‌‌యూవీ మీద భారీ తగ్గింపు

రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది. రెనో ఇండియా ఎన్నడూలేని విధంగా క్యాప్చర్ ఎస్‌యూవీగా ఏకంగా 2 లక్షల రుపాయలు తగ్గించింది.

By Anil Kumar

2 లక్షల రుపాయల డిస్కౌంట్ అనగానే, అందరి కళ్లు మతాబుల్లా వెలిగిపోయి ఉంటాయి. కానీ 2017లో తయారైన రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తిరకాసు మెలి పెట్టింది.

రెనో క్యాప్చర్ ఎస్‌‌యూవీ మీద భారీ తగ్గింపు

రెనో ఇండియా 2017 ఏడాది చివరిలో తయారు చేసిన క్యాప్చర్ ఎస్‌యూవీలు ఇంకా డీలర్ల వద్దనే ఉన్నాయి. చాలా వరకు స్టాక్ అలాగే ఉండిపోయింది. నిజానికి రెనో క్యాప్చర్ ఆశించిన సేల్స్ సాధించలేకపోతోంది.

రెనో క్యాప్చర్ ఎస్‌‌యూవీ మీద భారీ తగ్గింపు

ఈ నేపథ్యంలో డీలర్ల వద్ద ఉన్న స్టాకును క్లియర్ చేసుకునేందుకు సుమారుగా2 లక్షల రుపాయలు డిస్కౌంట్లు ప్రకటించింది. రెండు లక్షలు రుపాయలు తగ్గడం సాధరణ విషయమేమీ కాదు. మరి ఈ డీల్ మీకు నచ్చినట్లయితే స్టాకు పూర్తయ్యేలోపు సమీప రెనో డీలర్‌ను సంప్రదించి ఓ ఎస్‌యూవీని బుక్ చేసుకోండి.

రెనో క్యాప్చర్ ఎస్‌‌యూవీ మీద భారీ తగ్గింపు

డిస్కౌంట్‌తో లభించే రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ ధరకు తగ్గ విలువలు కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎంచుకోవాలనుకునే కస్టమర్లు విశాలమైన క్యాబిన్, నూతన స్టైలింగ్ మరియు అత్యాధునిక ఫీచర్లున్న రెనో క్యాప్చర్ ఎస్‌యూవీని నిశ్చింతగా ఎంచుకోవచ్చు.

రెనో క్యాప్చర్ ఎస్‌‌యూవీ మీద భారీ తగ్గింపు

ఇండియన్ మార్కెట్లో ఉన్న రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీని డస్టర్ మోడల్‌ను నిర్మించిన బి-జీరో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డెవలప్ చేసారు. 9.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో విడుదలైన ఇది విపణిలో ఉన్న డస్టర్ పై స్థానాన్ని భర్తీ చేస్తుంది.

రెనో క్యాప్చర్ ఎస్‌‌యూవీ మీద భారీ తగ్గింపు

రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యువీలోని 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 106బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

రెనో క్యాప్చర్ ఎస్‌‌యూవీ మీద భారీ తగ్గింపు

అదే విధంగా రెనో క్యాప్చర్‌లోని 1.5-లీటర్ కె9కె టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 248ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉంది. డస్టర్‌తో పోల్చుకుంటే మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ మరియు విశాలమైన క్యాబిన్ దీని సొంతం.

Most Read Articles

English summary
Read In Telugu: Renault Captur SUV gets a massive Rs. 2 lakh discount: Here’s why
Story first published: Friday, July 13, 2018, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X