ప్రయోగ దశలోనే ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

Written By:

సుఖవంతమైన మరియు సౌకర్యవంతమైన జీవనం గడపడానికి మనిషి సృష్టించని పరిజ్ఞానం అంతా ఇంత కాదు. ఒకానొక దశలో శృతి మించిన ప్రయోగాలు మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. రోబో సినిమాలో రజనీ రూపొందించిన రోబో మొత్తం మానవ జాతినే అంతం చేయాలని చూసినట్లు, తాజాగా ఓ సంఘటన జరిగింది.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భవిష్యత్ రవాణాలో కీలకం కానున్నాయి. మనిషి రూపొందించిన అద్భుతాల్లో ఇదీ ఒకటి. కృత్రిమ మేధస్సుతో స్వయం చాలకంగా నడిచే కారు ఒక మహిళను చంపేసింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, అరిజోనా నగరంలో ఉబర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు రోడ్డు మీద వెళుతున్న ఓ మహిళను గుద్ది చంపింది.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

అరిజానోలో రోడ్డు మీద వెళుతున్న మహిళను సెల్ఫ్ డ్రైవింగ్ కారు చంపేయడంతో.... సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు సరైన ఎంపికేనా...? అసలు మానవ భవిష్యత్తు రవాణాకు ఇవి ఖచ్చితంగా అవసరమేనా....? ఇంకా ఇలాంటి ప్రమాదాలు ఎన్ని చోటు చేసుకుంటాయో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

వోల్వో ఎక్స్‌‌సి90 ఉబర్ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ 49 ఏళ్ల మహిళను ప్రాణాలు తీసింది. షాకింగ్ నిజం ఏమిటి అంటే ప్రమాదం జరిగినపుడు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు అత్యవసర ప్రత్యామ్నాయ డ్రైవర్ అవసరం వచ్చింది.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

వోల్వో ఎక్స్‌సి90 సెల్ఫ్ డ్రైవింగ్ కారు తన మార్గంలో ఉన్నపుడు కారుకు ఎదురుగా మహిళ వచ్చింది. దిశ మరియు వేగాన్ని అదుపు చేసుకోలేక ఆ మహిళ మీదకు కారు దూసుకెళ్లింది. దీంతో అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

ప్రపంచ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెక్నాలజీ ద్వారా జరిగిన మొదటి మరణం ఇది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల పరిజ్ఞానాన్ని ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నట్లు ఈ సంఘటన గుర్తుచేస్తుంది.

Recommended Video - Watch Now!
Driverless, Self-Driving Vehicles In India - The Hi-Tech Robotic Systemz Limited - DriveSpark
మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సర్వీసులను నడపడానికి వేమో నుండి వచ్చిన ప్రతిపాదనలను అరిజోనా అధికారులు ఆమోదించారు. అంతే కాకుండా, పబ్లిక్ రోడ్ల మీద సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సర్వీసులను ప్రారంభించడానికి అరిజోనా అధికారులే ఉబర్ సంస్థను స్వాగతించారు.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

ప్రమాదం జరిగిన వెంటనే, అలర్ట్ అయిన ఉబర్ టెంపే, పీట్స్‌బర్ద్, శాన్‌ఫ్రాన్సిస్కో మరియు టొరంటో నగరాల్లో అటానమస్ కార్ల మీద చేస్తున్న పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేసింది. కంపెనీలు తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రయోగాలకు సంభందించిన ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలని ఈ ప్రమాదం చెబుతుంది.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

సాధారణంగా, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను జనవాసం లేని నియంత్రిత ప్రదేశంలో పరీక్షిస్తారు. కానీ, ఎక్కువ కంపెనీలను ఆకట్టుకోవడానికి అరిజోనా అధికారులు పబ్లిక్ రోడ్ల మీద సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను పరీక్షించడానికి అనుమతులు ఇచ్చింది. ఈ మూర్ఖత్వపు నిర్ణయం ఓ మహిళ ప్రాణాలు బలిగొంది.

మహిళను చంపేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మీద గత నాలుగైదేళ్ల నుండి ప్రయోగాలు ఊపందుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు పోటాపోటీగా స్వయం చాలక కార్ల పరిజ్ఞానాన్ని మరియు అందుకు కావాల్సిన విడి భాగాలను అభివృద్ది చేసుకుంటున్నాయి. కంపెనీల తొందరపడుతున్నాయే కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. రోడ్డు మీద ఎదురయ్యే అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కోవడానికి మానవ మేధస్సును మించిన కృత్రిమ మేధస్సు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో తప్పనిసరి.

Source: NYTimes

English summary
Read In Telugu: Self-Driving Uber Car Crashes In Arizona — Kills Pedestrian

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark