వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

వోక్స్‌వ్యాగన్ ఇండియా యొక్క భవిష్యత్తు ఉత్పత్తుల అభివృద్ది బాధ్యతలు ఇక మీదట స్కోడా చేపట్టనుంది. ఈ మేరకు, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుండి స్కోడాకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

By Anil Kumar

వోక్స్‌వ్యాగన్ ఇండియా యొక్క భవిష్యత్తు ఉత్పత్తుల అభివృద్ది బాధ్యతలు ఇక మీదట స్కోడా చేపట్టనుంది. ఈ మేరకు, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుండి స్కోడాకు ఆదేశాలు అందినట్లు సమాచారం. వోక్స్‌వ్యాగన్ ఇండియా యొక్క "ఇండియా 2.0 ప్రాజెక్ట్"ను స్కోడా చేపట్టేందుకు బోర్డు నుండి తుది ఆమోదం లభించింది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

వోక్స్‌వ్యాగన్ గ్రూపు సూచనల మేరకు, ఈ ప్రాజెక్టులో భాగంగా ఇండియన్ మార్కెట్ కోసం రూపొందించే నూతన మోడళ్ల అభివృద్దికి సంభందించి పూర్తి భాద్యతలను స్కోడా చేపడుతుంది. అంటే వోక్స్‌వ్యాగన్ ప్రవేశపెట్టే అన్ని మోడళ్లను పూర్తి స్థాయిలో స్కోడా అభివృద్ది చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఎమ్‌క్యూబీ ఏఓ-ఇన్ సబ్-కాంపాక్ట్ ఫ్లాట్‌ఫామ్ మీద వోక్స్‌వ్యాగన్ ఇండియా కోసం కావాల్సిన ఉత్పత్తుల తయారీని స్కోడా పర్యవేక్షిస్తుంది. అన్ని మోడళ్లను కూడా ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద డిజైన్ చేయనున్నారు.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

స్కోడా కూడా ఈ నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించే తొలి మోడల్‌ను 2020లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని లక్ష్యంగా చేసుకొని రానుంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

స్కోడా అభివృద్ది చేసే మొదటి ఎస్‌యూవీ మోడల్‌ను కంపెనీ యొక్క విజన్ ఎక్స్ ఎస్‌యూవీ డిజైన్ అంశాలను ఆధారంగా చేసుకుని డెవలప్ చేయనుంది. ఈ విజన్ ఎక్స్ ఎస్‍‌యూవీని అంతర్జాతీయంగా ఇదివరకే ఆవిష్కరించింది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

విజన్ ఎక్స్ ఎస్‌యూవీ డిజైన్ లక్షణాలతో ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద స్కోడా అభివృద్ది చేస్తున్న ఈ నూతన ఎస్‌యూవీని వోక్స్‌వ్యాగన్ ఇండియా కూడా అధికారికంగా లాంచ్ చేయనుంది. డిజైన్, మెకానికల్, ఇంజన్ మరియు ఫీచర్లను డు మోడళ్లు పంచుకోనున్నాయి.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

పూనేలో ఉన్న వోక్స్‌వ్యాగన్ చకన్ ప్రొడక్షన్ ప్లాంటును స్కోడా సొంతం చేసుకోనుంది. అంతే కాకుండా, ఈ ప్లాంటులో నూతన ప్రొడక్షన్ లైన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. సరికొత్త ఎమ్‌క్యూబీ ఏఓ-ఇన్ ఫ్లాట్‌ఫామ్ మీద ఇప్పటికే ఉన్న ఉత్పత్తులకు అనుగుణంగా ప్రొడక్షన్ చేపట్టనున్నారు.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

చకన్ ప్రొడక్షన్ ప్లాంటును ప్రస్తుతం స్కోడా ర్యాపిడ్, వోక్స్‌వ్యాగన్ అమియో, పోలో మరియు వెంటో కార్లను ఉత్పత్తి చేయడానికి వోక్స్‌వ్యాగన్ గ్రూప్ వినియోగిస్తోంది.

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

స్కోడా సీఈఓ బెర్నార్డ్ మయర్ మాట్లాడుతూ, "వోక్స్‌వ్యాగన్ గ్రూపు ఇండియన్ మార్కెట్ కోసం కావాల్సిన ఉత్పత్తులను అభివృద్ది చేసే భాద్యతలను స్కోడా అప్పగిచ్చింది. స్కోడా మీద ఉన్న నమ్మకం మరోసారి నిరూపించబడింది. వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆశించిన విధంగానే, ఇండియన్ మార్కెట్ కోసం కావాల్సిన కొత్త మోడళ్లను స్కోడా బృందం అభివృద్ది చేస్తుందని చెప్పుకొచ్చాడు."

వోక్స్‌వ్యాగన్ ఇండియా కార్ల అభివృద్ది ఇప్పుడు స్కోడా చేతుల్లోకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ గ్రూపునకు చెందిన ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ ఇరు సంస్థలకు కావాల్సిన నూతన మోడళ్లను అభివృద్ది చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. డెవలప్‌మెంట్ మరియు ప్రొడక్షన్ పద్దతులు పరంగా రెండు కంపెనీలు కూడా దాదాపు ఒకే వేదికను అనుకరించాల్సి ఉంటుంది. తక్కువ ధరలో, సరైన సమయంలో డిమాండుకు తగ్గ ప్రొడక్షన్ చేపట్టడానికి ఈ నిర్ణయం ఎంతగానో కలిసి రానుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Skoda To Lead Model Development For Volkswagen Group In India
Story first published: Saturday, June 23, 2018, 17:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X