టాటా 5-సీటర్ ఎస్‌యూవీకి పోటీగా బరిలోకి దిగుతున్న మారుతి సుజుకి వితారా

Written By:

ఇండియన్ ఎంట్రీ లెవల్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో భారీ విజయాన్ని అందుకున్న మారుతి సుజుకి ఇప్పుడు ఇండియన్ యుటిలిటి వెహికల్ సామ్రాజ్యంలో రాణించడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి, వితారా బ్రిజా ఎస్‌యూవీతో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ఖరీదైన మరియు విలాసవంతమైన ఎస్‌యూవీని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్దమైన మారుతి తాజాగా, సుజుకి వితారా ఎస్‌యూవీని రహస్యంగా సిద్దం చేస్తోంది.

మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

మారుతి సుజుకి వితారా

సరికొత్త సుజుకి వితారా నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. మార్కెట్లో ఉన్న వితారా బ్రిజాతో పోల్చుకుంటే కొలతల పరంగా సుజుకి వితారా పెద్దదిగా ఉంటుంది. స్టైలింగ్ పరంగా కూడా కండలు తిరిగిన రూపాన్ని కలిగి ఉంటుంది. బ్రిజా ఎస్‌యూవీతో పోల్చితే పెద్ద పరిమాణంలో మరియు అగ్రెసివ్ శైలిలో ఉంటుంది.

మారుతి సుజుకి వితారా

రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడిన మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ టార్క్విష్ మెటాలిక్ పెయింట్ స్కీములో మరియు సుజుకి సింబల్ కలిగి ఉంది. సుజుకి వితారా రిజిస్టర్ నెంబర్ చూస్తే, మారుతి సుజుకి ఇండియా పేరు మీద రిజిస్టర్ అయ్యింది. అంటే, వితారా ఎస్‌యూవీని మారుతి సుజుకి అతి త్వరలో విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

మారుతి సుజుకి వితారా

మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీలో క్రోమ్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఎస్‌యూవీ మొత్తానికి అడ్వెంచర్ లుక్ తీసుకొచ్చేందుకు వితారా చుట్టూ బాడీ అంచుల వద్ద ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది. మారుతి వితారా ఎస్‌యూవీలో 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి వితారా

సుజుకి వితారా ఎస్‌యూవీ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో అమ్మకాల్లో ఉంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇండియన్ వెర్షన్ వితారా ఎస్‌యూవీలో 140బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.4-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ ఇంజన్ రానుంది.

మారుతి సుజుకి వితారా

డీజల్ వేరియంట్ కోసం 120బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 1.6-లీటర్ ఫియట్ మల్టీజెట్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించనుంది.

మారుతి సుజుకి వితారా

గతంలో, మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో పాత తరం గ్రాండ్ వితారా ఎస్‌యూవీని విక్రయించేది. 2015లో దేశీయ విపణి నుండి తొలగించింది. ప్రస్తుతానికి, కొత్త తరం వితారా ఎస్‌యూవీ విడుదల గురించి మారుతి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2019 నాటికల్లా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

మారుతి సుజుకి వితారా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోని యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లో మెరుగైన వాటాను సొంతం చేసుకోవాలని మారుతి సుజుకి ఇండియా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే వితారా ఎస్‌యూవీని విడుదల చేయడానికి చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఎస్-క్రాస్ పై స్థానాన్ని భర్తీ చేయనున్న మారుతి సుజుకి వితారా రూ. 9 లక్షల నుండి రూ.10 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి వితారా పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు టాటా మోటార్స్ వారి అప్ కమింగ్ 5 సీటర్ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

మారుతి సుజుకి వితారా

1. కారుకు కుడి లేదా ఎడమవైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది మధ్యలో ఎందుకు ఉండదు?

2.విడుదలకు సర్వం సిద్దం చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్

3.ఆర్మీ ఎడిషన్‌లో టాటా సఫారీ: అసలు తిరకాసు ఇక్కడే ఉంది!!

4.నూతన కలర్ స్కీములో మారుతి ఇగ్నిస్ మరియు బాలెనో

5. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి: మిడిల్ క్లాస్ రేసింగ్ ప్రియుల బెస్ట్ ఛాయిస్

Source: Team BHP

English summary
Read In Telugu: Suzuki Vitara Spotted Testing In India; Expected Launch, Price, Specs And Features
Story first published: Tuesday, April 10, 2018, 8:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark