మారుతి, హ్యుందాయ్ కంపెనీలకు ముచ్చెమటలు పట్టించనున్న టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

ఆటో ఎక్స్‌పో 2018: టాటా మోటార్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా సరికొత్త 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది.

Recommended Video

New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

ఆటో ఎక్స్‌పో 2018: ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లు కీలకంగా ఉన్నాయి. ఇందులో మారుతి బాలెనోదే పైచేయి. అయితే, అన్ని మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా టాటా మోటార్స్ సరికొత్త ఎ45ఎక్స్ కారును తీసుకొచ్చింది.

భారీ విక్రయాలు సాధిస్తున్న బాలెనో మీద పోటీగా వచ్చిన టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం...

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

యూరోపియన్ కార్ల తయారీ సంస్థలు రూపొందించే ఫ్యూచర్ తరహా హ్యాచ్‌బ్యాక్ కారును మన దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎన్నో విలాసవంతమైన ఫీచర్లతో మారుతి బాలెనో మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కార్లకు గట్టిపోటీనిచ్చేలా 44ఎక్స్ కారును టాటా అభివృద్ది చేసింది.

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

టాటా నుండి ఊహించని డిజైన్ అంశాలను టాటా బృందం టాటా 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్‌లో అందించింది. అందులో ముందు మరియు వెనుక వైపున గల పదునైన డిజైన్ అంశాలు ప్రతి కారు ప్రేమికున్ని ఆకట్టుకుంటాయి.

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

తేలికపాటి బరువున్న ఫ్లాట్‌ఫామ్ మీద రూపొందించబడిన 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ డిజైన్‌లో పలుచటి హెడ్ ల్యాంప్స్, చిన్న పరిమాణంలో ఉన్న రెండు హెడ్ ల్యాంప్స్‌ మధ్యలో అధునాతన ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి.

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

అయితే, ఫ్రంట్ బానెట్ మాత్రం, టాటా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 1.0 లాంగ్వేజ్ ఆధారంగా మార్కెట్లోకి వచ్చిన నెక్సాన్, టియాగో మరియు టిగోర్ కార్లలో ఉన్న బానెట్‌ ప్రేరణతో వచ్చింది.

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కాన్సెప్ట్ కారులోని సైడ్ డిజైన్‌లో ఉన్న క్యారెక్టర్ లైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతే కాకుండా ముందు మరియు వెనుక డోర్లు కలిసే చోట టాప్‌తో అనుసంధానమై ఉండే పిల్లర్లు ఇందులో మిస్సయ్యాయి. దీంతో ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం స్పోర్టివ్ లుక్ సొంతం చేసుకుంది.

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

టాటా 45ఎక్స్ రియర్ డిజైన్‌లోని పదునైన మిర్రర్, రియర్ టెయిల్ ల్యాంప్స్ నుండి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వరకు డోర్ల మీద వెళ్లిన పదునైన క్యారెక్టర్ లైన్స్ వంటివి ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ నుండి వచ్చిన ప్రత్యేకతలు.

టాటా 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇప్పటి వరకు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశించని టాటా మోటార్స్ ఎట్టకేలకు స్టన్నింగ్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్‌లో ఉన్న 45ఎక్స్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ దీనిని వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

టాటా 45ఎక్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తే, ఇది వరకే ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం.

టాటా 45X ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్

H5X ఆవిష్కరణతో దిగ్గజాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టాటా మోటార్స్

ఆటో ఎక్స్‌పో 2018: యమహా YZF-R15 V3.0 విడుదల

ఆటో ఎక్స్‌పో 2018: ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Tata 45X Premium Hatchback Concept Revealed - Expected Launch Date And Images
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X