టాటా నుండి మారుతి బాలెనోకు ఊహించని ఎదురుదెబ్బ

టాటా ఇప్పుడు ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి తమ 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విడుదలకు సర్వం సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అత్యంత రహస్యంగా టాటా 45ఎక్స్ కారుకు రహదారి పరీక్షలు నిర్వహిస్తోంది.

By Anil Kumar

టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అంటే అర్థం కాలేదు కదా... అదేనండి సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల అయిన స్విఫ్ట్, ఫిగో వంటివి కాకుండా మరికాస్త పొడవుగా ఉండే మారుతి బాలెనో, హోండా జాజ్ మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 వంటి కార్లను ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు అంటారు.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్

దేశీయ దిగ్గజం టాటా ఇప్పుడు ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి తమ 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విడుదలకు సర్వం సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అత్యంత రహస్యంగా టాటా 45ఎక్స్ కారుకు రహదారి పరీక్షలు నిర్వహిస్తోంది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో మారుతి బాలెనో భారీ సేల్స్ సాధిస్తోంది. నిర్మాణ నాణ్యత పరంగా చూసుకుంటే బాలెనో అంత మెరుగైనదేమీ కాదు. అయితే, దీని ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు విశాలమైన ఇంటీరియర్ శైలి కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

ప్రస్తుతం ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో అత్యుత్తమ వృద్దిని సాధిస్తున్న టాటా ఇప్పుడు, మార్కెట్ వాటాను మరింత పెంచుకునే ఉద్దేశ్యంతో అత్యంత ధృడమైన బాడీ, అత్యుత్తమ నిర్మాణ విలువలతో పాటు ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ఎన్నో అత్యాధునిక ఫీచర్లను పరిచయం చేస్తోంది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

టాటా మోటార్స్ ఈ 45ఎక్స్ కారును మొట్టమొదటిసారిగా 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించింది. కాన్సెప్ట్ దశలో ఆవిష్కరించిన ఈ మోడల్ పలు రకాల పరీక్షలు మరియు రోడ్ టెస్టింగ్ అనంతరం ప్రొడక్షన్ దశకు చేరుకున్నట్లు సమాచారం.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

ప్రస్తుతం ముంబాయ్ రోడ్ల మీద పరీక్షిస్తున్న టాటా 45ఎక్స్‌ను గమనిస్తే, ఫ్రంట్ డిజైన్ ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ లైట్లతో దీనిని పరీక్షిస్తోంది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

ఎలాంటి డిజైన్ అంశాలను గుర్తించడానికి వీల్లేకుండా బాడీ మొత్తాన్ని నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపరుతో కప్పేశారు. ఇరువైపులా ఉన్న రియర్ వ్యూవ్ మిర్రర్లను ఏ-పిల్లర్ మీద కాకుండా డోర్ల అందివ్వడం జరిగింది. రియర్ మిర్రర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

మార్కెట్ లీడర్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది కాబట్టి, కస్టమర్లను ఆకట్టుకునేందుకు అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన మెటీరియల్‌లో అత్యంత సుందరంగా ఇంటీరియర్‌ను తీర్చిదిద్దనుంది. సౌకర్యవంతమైన సీట్లు, విశాలమైన క్యాబిన్, అత్యాధునిక డ్యాష్‍‌బోర్డ్ వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

అంతే కాకుండా, అధునాతన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, కూల్డ్ గ్లూవ్ బాక్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

సాంకేతికంగా టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అత్యంత శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. రెండు ఇంజన్‌లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రానున్నాయి.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

వీటిలో పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సెగ్మెంట్లోనే అత్యధిక మైలేజ్ ఇవ్వగలవు.

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు

టాటా 45ఎక్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో కార్లతో పాటు హ్యాచ్‌బ్యాక్ మరియు క్రాసోవర్ సెగ్మెంట్లలో ఉన్న ఇతర మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
Read In Telugu: Tata 45X Hatchback (Maruti Baleno Rival) Spied Again In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X