టాటా హెచ్5ఎక్స్‌ ఎస్‌యూవీకి మళ్లీ రహదారి పరీక్షలు: విడుదలకు సర్వం సిద్దం

Written By:

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో సరికొత్త హెచ్5ఎక్స్ (Tata H5X) కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని ఇప్పటికే ఇండియన్ రోడ్ల మీద పలుమార్లు రహస్యంగా పరీక్షించింది.

టాటా హెచ్5ఎక్స్‌

తాజాగా, దేశీయ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించబడుతూ, మీడియాకు చిక్కింది. అఫ్ రోడ్ టెస్టింగ్ కోసం వెళ్లిన హెచ్5ఎక్స్ మరియు ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించబడిన హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ వెర్షన్ మధ్య తేడాలు మరియు దీని విడుదల గురించిన పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

టాటా హెచ్5ఎక్స్‌

టాటా మోటార్స్ తమ హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపర్‌తో కప్పేసి ఎలాంటి ఎక్ట్సీరియర్ ఫీచర్లు మరియు డిజైన్ అంశాలను గుర్తించడానికి వీల్లేకుండా రహదారి పరీక్షలు నిర్వహించారు.

టాటా హెచ్5ఎక్స్‌

రహస్యంగా పరీక్షించబడిన మోడల్ ప్రొడక్షన్ వెర్షన్ హెచ్5ఎక్స్ అని తెలుస్తోంది. వెనుక వైపున తాత్కాలికంగా అమర్చిన టెయిల్ లైట్లు మినహాయిస్తే, ఇందులో గుర్తించడానికి ఎలాంటి డిజైన్ అంశాలు లేవు.

టాటా హెచ్5ఎక్స్‌

సరికొత్త డిజైన్‌లో దప్పంగా మరియు పదునుగా ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా కాన్సెప్ట్ మోడల్ తరహా స్లోపింగ్ రూఫ్ రెయిల్స్ ఇందులో ఉన్నాయి. టాటా భాగస్వామ్యపు దిగ్గజం ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీని నిర్మించిన ఆప్టిమల్ మోడ్యూలర్ ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ (OMEGA) ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు.

టాటా హెచ్5ఎక్స్‌

అదే విధంగా టాటా వారి ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ఆధారంగా వస్తున్న మొదటి మోడల్ హెచ్5ఎక్స్. టాట నెక్సాన్ ఎస్‌యూవీలో ఉన్న స్పోర్టివ్ హ్యుమానిటీ క్యారెక్టర్ లైన్ తరహా సిగ్నేచర్ క్యారెక్టర్ లైన్స్ ఇందులో కూడా రానున్నాయి.

టాటా హెచ్5ఎక్స్‌

ప్రొడక్షన్ వెర్షన్ టాటా హెచ్5ఎక్స్ ఎస్‌యూవీలో ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, ఫ్రంట్ బంపర్ మీద బాణం గుర్తు ఆకారం, స్కిడ్ ప్లేట్లు, డ్యూయల్ టోన్ బంపర్, ఎల్ఇడి హెడ్‍‌ల్యాంప్, మరియు టెయిల్ ల్యాంప్ క్లస్టర్ చుట్టుఉన్న డిజైన్ సొబగులు వంటివి ఉన్నాయి.

టాటా హెచ్5ఎక్స్‌

సాంకేతికంగా టాటా హెచ్‌5ఎక్స్ ఎస్‌యూవీలో ఫియట్ నుండి సేకరించిన 2-లీటర్ మల్టీజెట్ II డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. జెడ్ఎఫ్ కంపెనీ నుండి సేకరించిన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 140 నుండి 17బిహెచ్‌పి మధ్య పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా హెచ్5ఎక్స్‌

టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీలో ఆల్ వీల్ డ్రైవ్ మరియు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లను అందించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ 5- మరియు 7-సీటింగ్ సామర్థ్యంతో రెండు విభిన్న మోడళ్లలో లభ్యం కానుంది. 7-సీటర్ ఎస్‌యూవీని హెచ్7ఎక్స్ పేరుతో ప్రవేశపెట్టవచ్చు.

టాటా హెచ్5ఎక్స్‌

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త ప్రీమియమ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. కంపెనీ ఇప్పటికే హెచ్5ఎక్స్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఎస్‌యూవీని 2019 ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

మార్కెట్లో ఉన్న జీప్ కంపాస్ ఎస్‌యూవీకి సరాసరి పోటీనివ్వనున్న టాటా హెచ్5ఎక్స్ ధర అంచనా రూ. 16 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

టాటా హెచ్5ఎక్స్‌

1.ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్‌లకు పోటీగా మహీంద్రా సిద్దం చేసిన ఎస్‌యూవీ

2.టాటా 5-సీటర్ ఎస్‌యూవీకి పోటీగా బరిలోకి దిగుతున్న మారుతి సుజుకి వితారా

3.సాంకేతిక లోపంతో కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

4.ముఖేష్ అంబానీ పోలీస్ సిబ్బందికి కస్టమైజ్డ్ బైకులు

5.ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన మహీంద్రా ఎమ్‌పీవీ

Source: Rushlane

English summary
Read In Telugu: Tata H5X SUV Spotted Testing Again; Launch Details, Price, Specs And Features
Story first published: Monday, April 16, 2018, 13:36 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark