5 మరియు 7 సీటింగ్ ఎస్‌యూవీలకు రహదారి పరీక్షలు నిర్వహించిన టాటా

Written By:

టాటా మోటార్స్ విపణిలోకి 5 మరియు 7 సీటింగ్ కెపాసిటి గల అత్యాధునిక ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018 వేదిగా 5-సీటర్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన టాటా ఇప్పుడు 7-సీటర్ ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

టాటా h5x మరియు టాటా h7x

దేశీయ ఎస్‌యూవీ పరిశ్రమలో ఉన్న అగ్రగామి తయారీదారులకు గట్టి పోటీనిచ్చేందుకు రెండు కొత్త ఎస్‌యూవీలను కాన్సెప్ట్ దశలో పరీక్షిస్తోంది. ప్రస్తుతం, ఐదు మరియు ఏడు మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉంది. చిన్న కార్ల సెగ్మెంట్లో విజయాన్ని అందుకొన్న టాటా ఇప్పుడు మిడ్ సైజ్ మరియు ప్రీమియమ్ ఎస్‌యూవీల మీద దృష్టి సారించింది.

టాటా h5x మరియు టాటా h7x

2016 ఆటో ఎక్స్ పోలో ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఆవిష్కరించిన నాలుగు మోడళ్లు టాటాకు భారీ విజయాన్ని సాధించిపెట్టాయి. దీనికి కొనసాగింపుగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్ ఆధారంగా టాటా మోటార్స్ కొత్త మోడళ్లను అభివృద్ది చేసింది.

టాటా h5x మరియు టాటా h7x

గడిచిన ఆటో ఎక్స్‌పోలో ఈ సరికొత్త డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన 45X ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు H5X 5-సీటర్ ఎస్‌యూవీని కాన్సెప్ట్ దశలో ప్రవేశపెట్టింది. ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న దేశీయ మరియు విదేశీ సంస్థల మోడళ్లకు గట్టి పోటీనిచ్చేందుకు రెండు ఎస్‌యూవీలను శరవేగంగా సిద్దం చేస్తోంది.

టాటా h5x మరియు టాటా h7x

టాటా మోటార్స్ తాజాగా H7X ఎస్‌యూవీకి ఊటీకి సమీపంలో రహదారి పరీక్షలు నిర్వహిస్తూ పట్టుబడింది. డిజైన్ పరంగా ఇది చూడటానికి అచ్చం H5X ఎస్‌యూవీనే పోలి ఉంటుంది. కానీ, ఇందులో ఉన్న వ్యత్యాసం మూడు వరుసల సీటింగ్ లేఔట్.

టాటా h5x మరియు టాటా h7x

టాటా మోటార్స్ H5X మరియు H7X రెండు ఎస్‌యూవీలను L550 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేస్తోంది. టాటా భాగస్వామ్యపు దిగ్గజం ల్యాండ్ రోవర్ ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డిస్కవరీ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీని నిర్మించింది. అయితే, ఈ రెండు కొత్త మోడళ్లలో ల్యాండ్ రోవర్ లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టాటా h5x మరియు టాటా h7x

రోడ్డు మీద టెస్టింగ్ నిర్వహించిన H7X ఎస్‌యూవీ డిజైన్ అంశాలను గుర్తించడానికి వీల్లేకుండా ఎక్ట్సీరియర్ మొత్తాన్ని నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపరుతో కప్పేసి, తాత్కాలిక హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌తో పరీక్షించారు.

టాటా h5x మరియు టాటా h7x

టాటా H7X ఎస్‌యూవీ H5X తో పోల్చుకుంటే చాలా పొడవుగా ఉంటుంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, దప్పంగా ఉన్న పిల్లర్లు(రూఫ్ టాప్ మరియు బాడీని కలిపే స్తంభాలు) మరియు పెద్ద పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టాటా h5x మరియు టాటా h7x

టాటా H5X ఎస్‌యూవీ సి-పిల్లర్ వద్ద అంతమయ్యే స్లోపింగ్ రూఫ్ టాప్ కలిగి ఉంది. అయితే, టాటా H7X ఎస్‌యూవీలో బాక్సీ డిజైన్ కలిగి ఉంది. దీంతో మూడవ వరుస సీటింగ్ అందివ్వడానికి సాధ్యమైంది. ఇది మినహాయిస్తే ఫ్రంట్ మరియు సైడ్ ప్రొఫైల్ అచ్చం H5X ఎస్‌యూవీ శైలిలోనే ఉంటుంది.

టాటా h5x మరియు టాటా h7x

టాటా లైనప్‌లో అత్యంత ముఖ్యమైన ఎస్‌యూవీగా నిలవనున్న H7X ఇంటీరియర్‌ విశాలమైన మరియు సౌకర్యవంతమైన లగ్జరీ క్యాబిన్ ఉంది. టాటా H7X హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డిస్ల్పే, సన్‌రూఫ్, సరౌండ్ సౌండ్ మ్యూజిక్ సిస్టమ్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు వంటి ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లతో రానుంది.

టాటా h5x మరియు టాటా h7x

సాంకేతికంగా, టాటా H7X ఎస్‌యూవీ 2-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా జడ్ఎఫ్ నుండి సేకరించిన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే ఈ ఇంజన్ 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా h5x మరియు టాటా h7x

టాటా H5X ఎస్‌యూవీ కూడా ఇదే ఇంజన్‌తో రానుంది. అయితే, 5-సీటర్ వేరియంట్ కావడంతో కాస్త తక్కువ పవర్ అవుట్‌పుట్ ఉండేలా అందివ్వనున్నారు. డిజైన్ పరంగా H5X మరియు H7X చూడటానికి ఒకేలా ఉంటాయి. 5 మరియు 7 సీటింగ్ లేఔట్ మినహాయిస్తే రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదు.

టాటా h5x మరియు టాటా h7x

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ H5X ఎస్‌యూవీని పరిచయం చేసిన తరువాత, H7X ఎస్‌యూవీని 2019లో విడుదల చేసే అవకాశం ఉంది. టాటా H7X పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు హోండా సిఆర్-వి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. టాటా H7X రూ. 20 లక్షల అంచనా ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చే ఛాన్స్ ఉంది.

టాటా H5X విడుదలైతే, హ్యుందాయ్ టుసాన్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు జీప్ కంపాస్ వంటి మిడ్ సైజ్ ప్రీమియమ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా h5x మరియు టాటా h7x

1. టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్: ఇదీ కారు పరిస్థితి!

2. ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లు

3.2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ: 42 ఏళ్లుగా కొనసాగుతున్న రాజసం

4.పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్ ఎస్‌యూవీ: మళ్లీ అవే ఫలితాలు!!

5.ఈ కారుతో మారుతి డిజైర్ పతనం ఖాయం

Source: Rushlane

English summary
Read In Telugu: Tata H7X 7-Seater SUV Spotted Testing; Expected Launch, Price, Specs And Features
Story first published: Thursday, April 5, 2018, 19:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark