బెంగళూరులో పట్టుబడిన టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ తమ హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీంతో టాటా హ్యారియర్ ఎస్‌యూవీకి ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా బెంగళూరు నగర వీధుల్లో పరీక్ష

By Anil Kumar

టాటా మోటార్స్ తమ హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీంతో టాటా హ్యారియర్ ఎస్‌యూవీకి ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా బెంగళూరు నగర వీధుల్లో పరీక్షస్తుండగా డ్రైవ్‌స్పార్క్ ప్రతినిధికి తారసపడింది...

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

బెంగళూరులోని హోసూరు రోడ్డులో పరీక్షస్తుండగా పట్టుబడింది, ఈ ప్రొడక్షన్ వెర్షన్ టాటా హ్యారియర్‌లో ఎలాంటి డిజైన్ అంశాలు మరియు ఫీచర్లను గుర్తించడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపరుతో కప్పేసి మరీ పరీక్షించారు.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రివర్స్ గేర్ ల్యాంప్ గల ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. వెనుక అద్దం మీద "ఆన్ టెస్ట్" అనే స్టిక్కర్ కూడా గమనించవచ్చు. రూఫ్‌కు చివర్లో ఉన్న స్పాయిలర్, అందులో చక్కగా ఇమిడిపోయిన స్టాప్ ల్యాంప్ కలదు.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

బెంగళూరులో పరీక్షించిన టాటా హ్యారియర్ రియర్ డిజైన్ స్కిడ్ ప్లేట్లు కూడా ఉన్నాయి. అయితే, ఎక్ట్సీరియర్ మొత్తాన్ని పూర్తిగా కప్పేయడంతో గుర్తించడానికి వీల్లేకుండాపోయింది. హ్యారియర్ ఎస్‌యూవీలోని డి-పిల్లర్ డిజైన్ గమనిస్తే ఇది 7-సీటర్ వేరియంట్ అని తెలుస్తోంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీని నిర్మించిన ఒమెగా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా టాటా హ్యారియర్ ఎస్‌యూవీని నిర్మించారు. అంతే కాకుండా, టాటా నూతన ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా వచ్చిన మొదటి మోడల్ కూడా ఇదే. ఇందులో సిగ్నేచర్ హ్యుమానిటీ లైన్స్ మరియు ఆకర్షణీయైన వీల్ ఆర్చెస్ రానున్నాయి.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీలో సాంకేతికంగా ఫియట్ నుండి సేకరించిన 2-లీటర్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది, ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హ్యుందాయ్ నుండి సేకరించిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ అనుసంధానంతో విడుదల చేయనుంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

టాటా ప్యాసింజర్ కార్ల లైనప్‌లో అత్యంత విలాసవంతమైన ఉత్పత్తిగా వస్తోన్న హ్యారియర్ ఎస్‌యూవీలో పలు సౌకర్యవంతమైన ఫీచర్లు వస్తున్నాయి. టాటా హ్యారియర్ 5 మరియు 7 సీటింగ్ వేరియంట్లలో రానుంది. టాటా దీనిని వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లోపే విడుదల చేసే అవకాశం ఉంది.

టాటా హ్యారియర్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 1.0 ఆధారంగా గత రెండేళ్లలో విడుదల చేసిన నాలుగు కార్లు భారీ విజయాన్ని అందుకోవడంతో, దీనికి కొనసాగింపుగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ను ఆవిష్కరించింది. ఈ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన మొదటి మోడల్ టాటా హ్యారియర్. భారీ అంచనాలతో వస్తోన్న హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీల విభాగంలో సంచలనం సృష్టించనుంది. టాటా హ్యారియర్ 7-సీటర్ విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, మిత్సుబిషి పజేరో స్పోర్ట్ మరియు స్కోడా కొడియాక్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Harrier (H5X) SUV Spotted Testing In Bangalore
Story first published: Wednesday, August 22, 2018, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X