2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు ఇవే

Written By:
Recommended Video - Watch Now!
Under-Aged Rider Begs The Policewomen To Spare Him - DriveSpark

భారతదేశపు దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఫిబ్రవరి నెలలో దేశ రాజధాని కేంద్రం ఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2018 వేదిక మీద భారత మార్కెట్ కోసం రూపొందించిన కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా మోటార్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించనున్న కొత్త మోడళ్ల వివరాలు అధికారికంగా వెల్లడించింది. భారతదేశపు అతి పెద్ద ఆటో షో కేంద్రంగా తాము ప్రవేశపెట్టే మోడళ్లలో మూడు కొత్త ఉత్పత్తులకు సంభందించిన టీజర్‌ను టాటా విడుదల చేసింది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టీజర్ వీడియో ప్రకారం, టాటా రివీల్ చేయడానికి సిద్దం చేసిన మూడు మోడళ్ల గురించి స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. అయితే, టీజర్ ఆధారంగా హెచ్5 కోడ్ పేరుతో టాటా అభివృద్ది చేసిన ప్రీమియమ్ ఎస్‌యూవీ, ఎక్స్‌451 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

ఇదే వేదిక మీద హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీతో పాటు తేలికపాటి కమర్షియల్ వెహికల్‌ను కూడా ప్రదర్శించనుంది. ఈ మూడు మోడళ్లను ఒక చోట చేర్చి బ్లాక్ క్లాత్‌తో కప్పేసి టీజర్ వీడియోలో తెరకెక్కించారు. టాటా అప్ కమింగ్ మోడళ్ల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో మీ కోసం...

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా హెచ్5 ఎస్‍‌‌యూవీ

టాటా మోటార్స్ తమ సరసమైన ఉత్పత్తులతో అధిక డిమాండ్ ఉన్న సెగ్మెంట్ మీద దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అత్యంత సరసమైన ధరలో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, 2018 నుండి ఖరీదైన ప్రీమియమ్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి టాటా సిద్దమైంది. ఈ తరుణంలో ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కోసం ఉపయోగించిన ఎల్550 ఫ్లాట్‌ఫామ్ మీద హెచ్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా మోటార్స్ హెచ్5 ప్రీమియమ ఎస్‌యూవీని ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల రహస్యంగా పరీక్షించింది. టాటా హెచ్5 సాంకేతికంగా ఫియట్ వారి 2.0-లీటర్ కెపాసిటి గల మల్టీ జెట్ డీజల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న జీప్ కంపాస్ మరియు ఇతర ఖరీదైన మిడ్ సైజ్ ఎస్‌యూవీ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Image Source: The Automotive India

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా ఎక్స్451 హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ 2016లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన మోడళ్లను ఆవిష్కరించి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడే ఆదే ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ఆధారంగా రూపొందించిన మోడళ్లను ఈ 2018 ఆటో ఎక్స్‌పో మీద ప్రదర్శించనుంది. అందులో ఒకటి టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా డిజైనింగ్ బృందం అంతర్గతంగా ఎక్స్451 అనే పేరుతో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారును అభివృద్ది చేస్తోంది. ఈ మోడల్‌ను ఇప్పటికే పలుమార్లు రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. ఇది విపణిలో ఉన్న మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో సాంకేతికంగా నెక్సాన్ నుండి సేకరించిన 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది. టాటా ఈ ఎక్స్451 కాన్సెప్ట్‌ను ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించి, 2019 నాటికి పూర్తి స్థాయిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Trending On DriveSpark Telugu:

అగ్రస్థానమే లక్ష్యంగా టాటా నుండి వస్తున్న 10 కొత్త కార్లు

గాల్లోకి ఎగిరి రెండు అంతస్థుల మేడ మీదకు దూసుకెళ్లిన కారు

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా లైట్ కమర్షియల్ వెహికల్

ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టనున్న ఆ రెండు మోడళ్లతో పాటు, వాణిజ్య వాహన విభాగంలోకి తేలిక పాటు కమర్షియల్ ట్రక్కును ఆవిష్కరించనుంది. వాణిజ్య వాహన విభాగంలో వాహనాల సంఖ్యను విస్తృతపరిచేందుకు అనేక కొత్త మోడళ్లను పరిచయం చేయడంలో భాగంగానే ఓ తేలికపాటి కమర్షియల్ ట్రక్కును సిద్దం చేస్తోంది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

ప్రస్తుతం ఎంట్రీ లెవల్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో టాటా ఏస్ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తున్న ఏస్ ఆధారిత మోడళ్ల మీదే టాటా దృష్టి పెట్టింది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో పాటు, ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాల పరంగా సమీకృత ప్రయాణావసరాలకు సంభందించి అధునాతన పరిష్కారాలను ప్రవేశపెట్టనుంది. ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా పలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించనుంది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా ఎంతో చురుకుగా ముందుకెళుతోంది. ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL)కు టాటా సరఫరా చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఓ మోడల్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. దీనితో పాటు, నానో ఎలక్ట్రిక్ మరియు టామో రేస్మో సూపర్ కారును కూడా ప్రదర్శించనుంది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు అతి వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో విదేశీ సంస్థలకు ధీటుగా రాణించేందుకు కసరత్తులు ప్రారంభించింది. గత రెండేళ్లలో టాటా సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో టాటా వాటా భారీగా పెరిగింది.

2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద టాటా తీసుకొస్తున్న కొత్త మోడళ్లు

ఈ ఏడాది ఎన్నో నూతన ఆవిష్కరణలకు నిలయమవుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక ఆధారంగా టాటా మోటార్స్ తమ అన్ని భవిష్యత్తు మోడళ్లను ప్రదర్శించడానికి ఏర్పాటు పూర్తి చేసుకుంది. ఆటో ఎక్స్‌పో అప్‍‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Auto Expo 2018: Tata Motors To Showcase H5 SUV, Premium Hatchback And New LCV. Read In Telugu
Story first published: Wednesday, January 17, 2018, 13:38 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark