టాటా నెక్సాన్ ఆటోమేటిక్ విడుదల ఖరారు

Written By:
Recommended Video - Watch Now!
Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

టాటా మోటార్స్ సరికొత్త నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఏఎమ్‌టి(ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వెర్షన్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

సరికొత్త టాటా నెక్సాన్ ఆటోమేటిక్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లో లభ్యం కానుంది. దీనితో పాటు, ఫిబ్రవరి 9 నుండి 14 మధ్య జరగబోయే ఆటో ఎక్స్‌పో 2018 వేదిక మీద పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించనుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

ప్రస్తుతం, ఇండియన్ మార్కెట్లో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కేవలం ఫోర్డ్ ఇకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది. ఇందులో 6-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఉంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

ఇప్పుడు నెక్సాన్ ఎస్‌యూవీలో ఏఎమ్‌టి వస్తే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే రెండవ పెట్రోల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ కానుంది. టాటా నెక్సాన్‌లో అందించిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆధారంగానే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అభవృద్ది చేసి అందిస్తోంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా నెక్సాన్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్ఎ, మిడిల్ వేరియంట్ ఎక్స్‌టిఎ లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రానుంది. నెక్సాన్ ఎక్స్‌జడ్ఎ సరికొత్త మ్యారీ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో వస్తోంది. ఎక్స్‌జడ్ఎ మీద వస్తున్న రూమర్లు నిజమైతే ఇందులో సన్‌రూఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

Trending On DriveSpark Telugu:

ఈ ఎస్‌యూవీలు భారతదేశపు మైలేజ్ ఛాంపియన్లు

2018 మారుతి స్విఫ్ట్ మీద అఫీషియల్ బుకింగ్స్ షురూ చేసిన మారుతి

ఈ రెండు బైకులను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెడతాం: BMW

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా నెక్సాన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అవి, 1.2-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్. రెండు ఇంజన్‌లు కూడా 108.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ 1750-4000ఆర్‌పిఎమ్ మధ్య 170ఎన్ఎమ్ టార్క్ మరియు నెక్సాన్ డీజల్ వేరియంట్ 1500-2700ఆర్‌పిఎమ్ మధ్య 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న భారతదేశపు ఏకైక సబ్ 4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. విడుదలైనప్పటి నుండి టాటా నెక్సాన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కాబట్టి, ఆటోమేటిక్ వేరియంట్ కూడా మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. నెక్సాన్ ఏఎమ్‌టి ధర రెగ్యులర్ వేరియంట్ కన్నా రూ. 50,000 ల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Tata Nexon AMT Launch Soon – The Automatic Nexon Debuts At The Auto Expo 2018. Read In Telugu
Story first published: Friday, January 19, 2018, 18:17 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark