పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్ ఎస్‌యూవీ: మళ్లీ అవే ఫలితాలు!!

నెక్సాన్ ఎస్‌యూవీ ప్రమాద వివరాలను వెళ్లడిస్తూ, హర్యాణాలోని కర్నల్ ప్రాంతం వద్ద వెనుక నుండి ఇతర వాహన ఢీకొట్టడంతో నియంత్రణ కోల్పోయి, రోడ్డుకు ప్రక్కనే ఉన్న సిమెంట్ బ్లాక్స్ ఢీకొని ప్రక్కనున్న రోడ్డు మీద

By Anil Kumar

టాటా నెక్సాన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మోస్ట్ పాపులర్ సబ్ 4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. అసాధారణమైన డిజైన్, అధునాతన ఫీచర్లు మరియు ఇంజన్ ఆప్షన్‌లతో యువ కొనుగోలుదారులను మరియు ఎస్‌యూవీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

అంతే కాకుండా, నెక్సాన్ ఎస్‌యూవీ విడుదలైనప్పటి నుండి పలు ప్రమాదాలకు గురైంది. యాక్సెండ్ అయిన ప్రతిసారీ టాటా నిర్మాణ నాణ్యత విలువలు బయటపడటంతో నెక్సాన్ ఎస్‌యూవీ మరింత ఖ్యాతిని గడిస్తోంది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

ఇటీవల ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారి మీద టాటా నెక్సాన్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే, ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ జరగలేదు. నెక్సాన్ ఎస్‌యూవీని నిర్మాణ నాణ్యత పట్ల వాహన యాజమాని సంతోషం వ్యక్తం చేశాడు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

అసలేమైందో చూద్దాం రండి....

నెక్సాన్ ఎస్‌యూవీ ప్రమాద వివరాలను వెళ్లడిస్తూ, హర్యాణాలోని కర్నల్ ప్రాంతం వద్ద వెనుక నుండి ఇతర వాహన ఢీకొట్టడంతో నియంత్రణ కోల్పోయి, రోడ్డుకు ప్రక్కనే ఉన్న సిమెంట్ బ్లాక్స్ ఢీకొని ప్రక్కనున్న రోడ్డు మీద మూడు నాలుగు పల్టీలుకొట్టి ఆగిపోయిందని వివరించాడు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

ప్రమాదానంతరం, నెక్సాన్ ఓనర్ ఎస్‌యూవీ వెనుక డోర్ ఓపెన్ చేసుకొని బయటికొచ్చాడు. సీటు బెల్ట్ ధరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. తలకు గాయాలవ్వకుండా తాను ధరించిన తలపాగా కాపాడిందని చెప్పుకొచ్చాడు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

కర్నల్ పోలీస్ స్టేషన్‌లో నెక్సాన్ యజయమాని ప్రమాదం గురించి ఫిర్యాదు చేశాడు. వెనుక నుండి ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించలేకపోయాడు. అయితే, ప్రమాద దృశ్యాలను చూస్తే పెద్ద లారీ లేదా ట్రక్కు ఢీకొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

ప్రమాదానికి గురైన టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో టెయిల్ ల్యాంప్స్ వెలుగుతూనే ఉండటాన్ని గమనించవచ్చు. అంటే ఇంతటి ప్రమాదం జరిగినా కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్‌ యథావిధిగా పనిచేస్తోంది. ప్రమాదం తరువాత ఎయిర్ బ్యాగులు కూడా విచ్చుకున్నాయి.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

యాక్సిడెంట్ తరువాత టాటా నెక్సాన్ పడిపోయిన పొజిషన్ చూస్తే, డోర్లను తెరుచుకొని బయటకు రావడం కష్టతరమే. అయితే, ఎస్‌యూవీ వెనుక వైపున డిక్కీ డోరు తెరుచుకుని వెహికల్ డ్రైవ్ చేస్తున్న నెక్సాన్ ఓనర్ సురక్షితంగా బయటపడ్డాడు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా నెక్సాన్ నిర్మాణ నాణ్యతే నన్ను ఈ భారీ ప్రమాదం నుండి ప్రాణాలతో రక్షించింది. నెక్సాన్ క్వాలిటీ అద్భుతమని చెప్పుకొచ్చాడు. ప్రమాదం జరిగిన సరిగ్గా ఆరు రోజుల తరువాత అదే కలర్‌లో, అదే వేరియంట్లో ఉండే మరో నెక్సాన్ ఎస్‌యూవీని డీలర్ ఇవ్వనున్నట్లు తెలిపాడు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

పలుమార్లు పల్టీలు కొట్టిన తరువాత కూడా నెక్సాన్ క్యాబిన్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా నాణ్యత పరంగా పిల్లర్ల పనితీరు ఎంత పటిష్టంగా ఉందో ఈ ప్రమాదం చెబుతుంది. ఎలాంటి ప్రమాదమైన దాని తీవ్రత ప్రయాణికుల వరకు చేరకుండా చేయడంలో నెక్సాన్ విషయంలో టాటా మోటార్స్ అద్భుతమే చేసిందని చెప్పవచ్చు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

అచ్చం ఇలాంటి ప్రమాదాలకే గురైన ఇతర మోడళ్లు ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా క్యాబిన్‌తో సహా నుజ్జునుజ్జయ్యాయి. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఇప్పటికే పలు ప్రమదాలకు గురైంది. అన్ని ప్రమాదాల్లో కూడా ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా రక్షించింది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా నెక్సాన్ గురించి అతి ముఖ్యమైన విషయాలు

టాటా మోటార్స్ నెక్సాన్ వాహనాన్ని ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి గత ఏడాది డిసెంబరులో లాంచ్ చేసింది. టాటా ఈ సెగ్మెంట్లోకి ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ, కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పలు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. టాటా ఇటీవలె ఎక్స్‌జడ్ వేరియంట్‍‌ను రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లాంచ్ చేసింది. తమ బెస్ట్ సెల్లింగ్ నెక్సాన్ ఎస్‌యూవీని అతి త్వరలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. వీటిలో, పెట్రోల్ వేరియంట్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ వేరియంట్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

పోటీదారులను ఎదుర్కుని కస్టమర్లను ఆకట్టుకునేందుకు, టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, 6.5-అంగుళాల పరిమాణంలో ఉన్న హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెంటర్ కన్సోల్ మీద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ కండీషనర్ కంట్రోల్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

భద్రత పరంగా నెక్సాన్ ఎస్‌యూవీలో, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా లభిస్తున్నాయి.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, మొరొకాన్ బ్లూ, వెర్మోంట్ రెడ్, సీటిల్ సిల్వర్, గ్లాస్గో గ్రే మరియు కాల్గరి వైట్. నెక్సాన్ ధరల శ్రేణి రూ. 6.12 లక్షల నుండి రూ. 9.71 లక్షల మధ్య ఉంది.

ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టాటా నెక్సాన్

1. ఇలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు!!

2.కనీవిని ఎరుగని సేల్స్‌తో హోండాకు చుక్కలు చూపిస్తున్న డబ్ల్యూఆర్-వి

3.రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేసిన పోలీసులు

4.మిస్టరీ రైలులో నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రహస్య చైనా పర్యటన

5.కొత్త ట్రెండ్ సెట్ చేసిన క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బైకుతో తలలు పట్టుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon compact SUV rolls multiple times in an accident; Owner thanks Tata build quality
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X