టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్ విడుదల: ధర రూ. 7.99 లక్షలు

Written By:

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్‌ వేరియంట్ (Tata Nexon XZ) ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. టాటా మోటార్స్ తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మరో కొత్త వేరియంట్లో విపణిలోకి పరిచయం చేసింది. 2017 డిసెంబరులో విడుదల చేసిన నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో అదనంగా ఎక్స్‌జడ్‌ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

టాటా నెక్సాన్ XZ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.99 లక్షలు మరియు నెక్సాన్ XZ డీజల్ వేరియంట్ ధర రూ. 8.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. నెక్సాన్ XZ వేరియంట్ టాటా నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ XZ+ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది.

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

టాటా నెక్సాన్ XZ వేరియంట్ ఇంటీరియర్‌లో ప్రీమియమ్ ఫీల్ కలిగించే అన్ని కీలకమైన ఫీచర్లు వచ్చాయి. ఇందులో ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్ సపోర్ట్, రివర్స్ కెమెరా మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

అంతే కాకుండా, నెక్సాన్ XZ వేరియంట్లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, హైడ్ అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు మరియు సీట్ బెల్ట్, నాలుగు ట్వీటర్లు గల సౌండ్ సిస్టమ్, డోర్లకు లోపలి వైపున ఫ్యాబ్రిక్ సొబగులు మరియు టెక్ట్స్ లేదా వాట్సాప్ మెసేజ్‌లను చదివి వినిపించి మరియు రీప్లై ఇచ్చే టెక్నాలజీ కలదు.

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

అయితే, నెక్సాన్ XZలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లు మిస్సయ్యాయి. XZ వేరియంట్లో డ్యూయల్ టోన్ వీల్ కవర్స్ గల 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

నెక్సాన్ XZ వేరియంట్ అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌‌లతో లభ్యమవుతోంది. పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో లభిస్తున్నాయి. రెండింటిలో కూడా ఇకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని అతి త్వరలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విపణిలోకి లాంచ్ చేయనుంది. నెక్సాన్ ఏఎమ్‌టి వేరియంట్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. నెక్సాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్ చదవండి...

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి నెక్సాన్ విడుదలైనప్పటి నుండి టాటా మోస్ట్ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. టాటా నెక్సాన్ మీద వస్తోన్న విపరీతమైన ఆదరణకు అనుగుణంగా ఇప్పుడు XZ వేరియంట్ నెక్సాన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. దీంతో కస్టమర్లకు నెక్సాన్ లభించే ఆప్షన్లు మరింత పెరిగాయి.

విపణిలో ఉన్న వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఇకో స్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు టాటా నెక్సాన్ గట్టి పోటీనిస్తోంది.

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్ వేరియంట్

1. ఈ ఏడాది విడుదలకు సిద్దమైన అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్-10 కార్లు

2.మారుతి వితారా బ్రిజాకు పోటీగా జీప్ స్మాల్ ఎస్‌యూవీ

3.ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కొడుకు దగ్గర జరిమానా వసూలు చేసిన పోలీస్ అధికారి

4.హోండా సిబి హార్నెట్ 160ఆర్ ఏబిఎస్ విడుదల: ధర రూ. 84,675 లు

5. ఒకే కారుకు ఏడాదిలో 127 ఫైన్లు, 1.8 లక్షల జరిమానా విధించిన హైదరాబాద్ పోలీసులు

English summary
Read In Telugu: Tata Nexon XZ Variant Launched In India; Prices Start At Rs 7.99 Lakh
Story first published: Tuesday, March 27, 2018, 11:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark