ఏడు మంది ప్రాణాలను బలిగొన్న చిన్న తప్పిదం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. పాత టాటా సుమోలో ఉన్న 12 మంది ప్రయాణికుల్లో 7 మంది అక్కడికక్కడే మరణించారు. కొండల మధ్య ఉన్న రహదారుల మీదుగా ప్రయాణిస్తున్న టాటా సుమో పెద్ద ల

By Anil Kumar

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. పాత టాటా సుమోలో ఉన్న 12 మంది ప్రయాణికుల్లో 7 మంది అక్కడికక్కడే మరణించారు. కొండల మధ్య ఉన్న రహదారుల మీదుగా ప్రయాణిస్తున్న టాటా సుమో పెద్ద లోయలో పడటంతో ఈ ఘోరం జరిగింది. స్థానికుల కథనం మేరకు ఈ ప్రమాదం గత శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

వివరాల్లోకి వెళితే, వివాహ వేడుకలు వెళుతున్న సందర్భంలో సుమో ప్రమాదానికి గురయ్యింది. 55 ఏళ్ల వయసున్న ఓం ప్రకాశ్ రస్తోగి, కుటుంబ సమేతంగా తన కుమారుడి వివాహానికి వెళుతున్నట్లు తెలిసింది.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

ప్రమాదానికి గల కారణాల కోసం చేసిన దర్యాప్తులో, టాటా సుమోలో ముందు వైపు కూర్చున్న చిన్నారి హ్యాండ్ బ్రేక్ వదలడంతో, లోతుగా ఉన్న లోయలోకి పడిపోయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల కథనం మేరకు, డ్రైవర్ సుమో వాహనాన్ని ఏట వాలుగా, ఇరుకైన మరియు లోతైన లోయ వంటి రోడ్డు మీద ప్రక్కకు పార్క్ చేశాడు. అయితే, ఊహించనట్లుగా, వాహనంలో ఉన్న చిన్నారి హ్యాండ్ బ్రేక్ తొలగించడంతో ఇలా జరిగినట్లు చెప్పుకొచ్చారు.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

ఎవరైనా వెంటనే స్పందించి, కాపాడే సమయం కూడా లేదు. బ్రేక్ వదులవ్వగానే లోతుగా ఉండే ఇరుకైన లోయలోకి క్షణాల్లో దూసుకెళ్లడంతో వెంటనే స్పందించే అవకాశం కూడా లేకపోయింది. జాతీయ రహదారి 24 కు సమీపంలో విజయ్ నగర్‌లో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారిలో నలుగురు మహిళలు మరియు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు గుర్తించారు.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

ప్రమాద స్థలి వద్ద ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, "బారియల్లీ నుండి చావోస్‌లోని వివాహ మహోత్సవానికి వచ్చిన సుమో ప్రమాదవశాత్తు ఇరుకైన లోయలోకి పడిపోయింది. ఈ విషయం తెలియగానే వెంటనే అక్కడి చేరుకునే సరికి మహిళలు ఆర్తనాదాలు చేస్తున్నారు. సుమో నీటిలో దాదాపు మునిగిపోయింది. చాలా మందికి తీవ్రగాయాలవడంతో అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాదం 8:30 గంటలు జరిగితే, పోలీసులు రాత్రి 10:30 గంటలకు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు"

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

పోలీస్ ఆధికారి మాట్లాడుతూ, "రామ్‌పూర్ నివాసితుడైన ఓం ప్రకాశ్ కుమారుడి పెళ్లికి వెళుతుండగా ప్రమాదం సంభవించింది. పార్కింగ్ చేసిన సుమోలోని హ్యాండ్ బ్రేకును చిన్న పాప తొలించడంతో వాహనం లోయలోకి పడిపోయింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, క్రేన్ సహాయంతో నీటిలో మునిగిపోయిన టాటా సుమోను బయటకు తీసినట్లు వివరించాడు."

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

ప్రమాదం జరిగినప్పటి నుండి టాటా సుమో డ్రైవర్ కనిపించడం లేదు. డ్రైవర్ పరారైనట్లు భావించిన పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. లోయకు ప్రక్కనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాహనాన్ని పార్క్ చేయడం డ్రైవర్ చేసిన తప్పు. అదే సమయంలో ఏమీ తెలియని ఓ చిన్నారి హ్యాండ్‌బ్రేక్ వదులు చేయడంతో ఇంతటి భారీ ప్రమాదం జరిగింది.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

ప్రమాదం జరిగినప్పటి నుండి టాటా సుమో డ్రైవర్ కనిపించడం లేదు. డ్రైవర్ పరారైనట్లు భావించిన పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. లోయకు ప్రక్కనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాహనాన్ని పార్క్ చేయడం డ్రైవర్ చేసిన తప్పు. అదే సమయంలో ఏమీ తెలియని ఓ చిన్నారి హ్యాండ్‌బ్రేక్ వదులు చేయడంతో ఇంతటి భారీ ప్రమాదం జరిగింది.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

ప్రతి ప్రయాణంలో కూడా వాహనాన్ని పార్క్ చేసినపుడు, ప్రక్కన నిలిపి ఉంచినపుడు వాహనంలో పిల్లలు లేకుండా చూసుకోండి. జర్నీలో ఉన్నపుడు పిల్లలను ఎప్పుడూ మీతోనే ఉంచుకోవడం ఇంకా ఉత్తమం. చిన్న పిల్లలు ఏదీ కావాలని చేయరు. అయితే, చిన్న చిన్న తప్పులు కోలుకోని విషాదాన్ని మిగిల్చుతాయి, అందుకు ఇవాళ్టి కథనం ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

ఆటోమొబైల్స్‌లో హ్యాండ్‌బ్రేక్ కీలక పాత్ర పోషిస్తుంది. వాహనం రన్నింగ్‌లో నిలిపినప్పుడు, అటు ఇటు కదలకుండా వాహనాన్ని స్థిరంగా నిలిపి ఉంచడానికి హ్యాండ్‌బ్రేక్ సహాయపడుతుందని అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి, ఏట వాలు మరియు లోయ ప్రదేశాల్లో ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. కానీ, దీనిని చాలా సులభంగా ఎవరైనా తొలగించేయవచ్చు.

చిన్న తప్పిదం ఏడు మందిని పొట్టనబెట్టుకుంది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఘజియాబాద్ టాటా సుమో ప్రమాదం నిజంగా చాలా బాధాకరమైన దుర్ఘటన. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ, ప్రతి ప్రమాదాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లోనే కాదు, ఇలాంటి పొరబాట్లు చేస్తే ఎక్కడైనా ఇలాంటి ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి, మీతో పాటు పిల్లలు ప్రయాణిస్తున్నపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.

Most Read Articles

English summary
Read In Telugu: A Tata Sumo Gets Into An Accident In Ghaziabad — Seven Killed Due To A Small Error
Story first published: Monday, April 23, 2018, 14:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X