టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్: ఇదీ కారు పరిస్థితి!

తమిళనాడులో టాటా టియాగో మరియు ట్రాక్టర్ మధ్య భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ధృడమైన శరీరాన్ని గల ట్రాక్టర్‌ను ఢీకొన్న టాటా టియాగో అద్భుతమైన ఫలితాలు కనబరిచింది.

By Anil Kumar

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా టాటా టియాగో మొదటి స్థానంలో నిలిచింది. అంతే కాకుండా, రోజు రోజుకీ దీని ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. అత్యుత్తమ నిర్మాణ నాణ్యత, డిజైన్, ఫీచర్లు మరియు ధరకు తగ్గ విలువల కలిగి ఉండటంతో టాటా టియాగో కారుకు నానాటికీ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

తమిళనాడులో టాటా టియాగో మరియు ట్రాక్టర్ మధ్య భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ధృడమైన శరీరాన్ని గల ట్రాక్టర్‌ను ఢీకొన్న టాటా టియాగో అద్భుతమైన ఫలితాలు కనబరిచింది. అసలేం జరిగిందో క్రింది కథనంలో చూద్దాం రండి....

తమిళనాడులో టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కారు రోడ్డు మీదున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద ఫోటోలను పరిశీలిస్తే, ట్రాక్టర్ రెండుగా విడిపోయింది. టియాగో కారు ప్రమాదానికి గురైన తరువాత, కారు యజమాని ప్రమాద వివరాలను మరియు ఫోటోలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

ఖచ్చితంగా ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియరాలేదు గానీ, కారు ఓనర్ చేసిన ట్వీట్ ప్రకారం, తాము ప్రయాణిస్తున్న టియాగో కారు ట్రాక్టరును ఢీకొట్టిన అనంతరం రెండు పల్టీలు కొట్టి తలక్రిందులుగా రోడ్డు మీద నిలిచిపోయినట్లు తెలిపాడు. ఈ ఘటనలో అందరు సురక్షితంగా బయటపడ్డారు.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

ఫోటోలను గమనిస్తే, చీకట్లో రోడ్డు మీదున్న ట్రాక్టరును ఢీకొట్టడంతో టాటా టియాగో ఎడమవైపు నుజ్జు నుజ్జుయిపోయింది. తలక్రిందులుగా నిలిచిపోవడానికి ముందు టియాగో రెండు పల్టీలు కొట్టింది.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

ఏదేమైనప్పటికీ, ప్రమాద తీవ్రత ట్రాక్టర్ మీద ఎక్కువగానే పడింది. ట్రాక్టర్ బాడీ మరియు ఇంజన్ విడి భాగాల మీద ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇంజన్ మొత్తం క్రింద పడిపోయింది. ప్రమాదం ఎంత శక్తివంతమైనదో తీవ్రంగా డ్యామేజ్ అయిన ట్రాక్టర్ మరియు టియాగోను చూస్తే తెలుస్తుంది.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

ప్రమాదానికి గురైన టాటా టియాగో ఎక్స్‌జడ్ వేరియంట్ అని తెలిసింది, టాటా టియాగో లైనప్‌లో ఇదే టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు వంటి అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

ప్రమాదం జరిగినపుడు ఎయిర్ బ్యాగులు విచ్చుకున్నాయా... లేదా... అనే విషయం తెలియరాలేదు. కారు ప్రక్క వైపున ప్రమాదం జరగడంతో ఎయిర్ బ్యాగులు విచ్చుకునే అవకాశం లేదు. ఒక వేళ ఎయిర్ బ్యాగులు విచ్చుకున్నప్పటికీ, దాని వలన ప్రయాణికుల మొహం మీద గాయాలవుతాయి తప్పిదే, ప్రయోజనం చేకూరే అవకాశం లేదు ఎందుకంటే కారు ఒక ప్రక్క నుండి ట్రాక్టరును ఢీకొట్టింది కాబట్టి.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

పల్టీలు కొట్టిన అనంతరం కారు తలక్రిందులుగా నిలిచిపోయింది. కారు మొత్తం బరువును పిల్లర్లు బాగా తీసుకున్నాయి. పిల్లర్లు ధృడంగా ఉండటంతో తలక్రిందులయ్యాక రూఫ్ టాప్ కారు క్యాబిన్‌లోకి చొచ్చుకెళ్లకుండా బరువు మొత్తాన్ని మోసుకుని అలాగే ఉండిపోయింది.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

ప్రమాదానంతరం డోర్లు కూడా బాగానే పనిచేశాయి. నిజానికి, ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు డోర్లకు డ్యామేజ్ అయితే, లోపలున్న ప్రయాణికులను రక్షించడానికి డోర్లు ఏ మాత్రం సహకరించవు. కానీ, టియాగో హ్యాచ్‌బ్యాక్ తలుపు సులభంగానే తెరుచుకున్నాయి. ఇక్కడే టాటా వారి నిర్మాణత ఏంటో బయటపడింది.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

ట్రాక్షన్ విషయానికి వస్తే, ప్రమాదానికి గురైన ట్రాక్టర్ చాలా పాత మోడల్ అని తెలుస్తోంది. ట్రాక్టర్‌లో కార్ల తరహా ఫ్రేమ్ ఉండదు. ట్రాక్టర్ బాడీ మొత్తం ఇంజనే ఉంటుంది. కాబట్టి, ఇందులో క్రంపుల్ జోన్స్ ఉండవు. దీంతో ప్రమాదం తీవ్రత ఏదైనా సరాసరి ట్రాక్టర్ బాడీ మీదనే పడుతుంది. బహుశా ఈ కారణం చేతనే ట్రాక్టర్ ప్రమాద బలాన్ని తీసుకోలేక తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

టాటా టియాగో యాక్సిడెంట్ అవ్వడం ఇదేమీ మొదటి సారి కాదు, టియాగో హ్యాచ్‌బ్యాక్ ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలకు గురైంది. అన్ని ప్రమాదాల్లో కూడా ఒకే విధమైన ఫలితాలు. ప్రమాదానంతరం కారులో ప్రయాణిస్తున్న అందరం సురక్షితంగా బయటపడ్డాం అని స్వయంగా యజమానులే అద్బుతమైన నిర్మాణ నాణ్యత దీని సొంతం అని టియాగోను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

నిజమే, నిర్మాణ నాణ్యత పరంగా టాటా మోటార్స్ అద్భుతమే చేసింది. ఈ ధరల శ్రేణిలో ఉన్న మరే ఇతర కార్లు కూడా టియాగో వంటి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. ధరకు తగ్గ విలువలు, అత్యాధునిక సేఫ్టీ మరియు ఇంటీరియర్ ఫీచర్లు, స్టైలిష్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్, మంచి మైలేజ్ మరియు అత్యుత్తమ పనితీరును కనబరిచే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఇలా ఎన్నో అంశాల పరంగా టాటా టియాగో ఎంతో మంది ఇండియన్స్ ఫేవరెట్ కారుగా నిలిచింది.

టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్

1.అవమానించిన ఫోర్డ్ మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్న రతన్ టాటా

2.టియాగో కారును ఎక్కువగా ఎంచుకోవడానికి ఇవీ అసలు కారణాలు!

3. మహా వృక్షం మీద పడినా చెక్కు చెదరని టాటా హెక్సా

4.టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

5.విమానాన్నే లాగేసిన టాటా హెక్సా: వీడియో

Picture credit: Vijay / Twitter

టాటా మోటార్స్ కొత్త ఎస్‌యూవీ

Most Read Articles

English summary
Read In Telugu: Tata Tiago hits tractor: Here’s the result
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X