ప్రతి సీటుకు ఏసి మరియు ఫుష్ బ్యాక్ సీట్లు గల 15-సీటర్ టాటా వింగర్ విడుదల

టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త 15-సీటర్ వింగర్ వాణిజ్య వాహనాన్ని విడుదల చేసింది. టాటా మోటార్స్ సరికొత్త టాటా వింగర్ 15ఎస్ కమర్షియల్ వెహికల్‌ను రూ. 12.05 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ (మహారాష్ట్ర)ధరతో వ

By Anil Kumar

టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త 15-సీటర్ వింగర్ వాణిజ్య వాహనాన్ని విడుదల చేసింది. టాటా మోటార్స్ సరికొత్త టాటా వింగర్ 15ఎస్ కమర్షియల్ వెహికల్‌ను రూ. 12.05 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ (మహారాష్ట్ర)ధరతో విడుదల చేసింది. దేశీయంగా అద్దె వాహనాల నిర్వహణ కంపెనీలు మరియు డ్రైవర్ల కోసం ఈ వాహనాన్ని తీసుకొచ్చింది.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

టాటా వింగర్ 15ఎస్ ఒక మోనోకోక్యూ బస్సు మరియు దీని గరిష్ట సీటింగ్ సామర్థ్యం 15 మంది. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ కల్పించేందుకు పుష్ బ్యాక్ సీట్లు, వ్యక్తిగత ఏసి వెంట్స్ మరియు ప్రతి సీటుకు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

టాటా మోటార్స్ వింగర్ 15ఎస్ బస్సును మోనోకోక్యూ ఫ్రేమ్ మీద నిర్మించారు, దీంతో బస్సు యొక్క నాయిస్, వైబ్రేషన్స్ మరియు హార్ష్‌నెస్ పాళ్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ముందు వైపున యాంటీ-రోల్ బార్స్ మరియు వెనుక వైపున హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు గల వ్యక్తిగత సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

టాటా వింగర్ 15ఎస్ బస్సులో సాంకేతికంగా 2.2-లీటర్ సామర్థ్యం గల డైకోర్ డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 98బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

టాటా వింగర్ 15ఎస్ గరిష్ట వేగం గంటకు 100కిలోమీటర్లుగా ఉంది మరియు బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

కొత్తగా విడుదలైన టాటా వింగర్ 15ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 23 విక్రయ కేంద్రాలలో లభిస్తోంది. టాటా వింగర్ 15ఎస్ మీద 3 సంవత్సరాలు లేదా 3 లక్షల కిలోమీటర్ల పాటు (ఏది ముందు అయితే దాని మీద) వారంటీ లభిస్తుంది.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

దేశీయంగా ఉన్న టూర్స్ మరియు ట్రావెల్ అవసరాల కోసం వింగర్ 15ఎస్ వెహికల్‌ను డిజైన్ చేశారు. టాటా వింగర్ 15ఎస్ వెహికల్‌ను తొలుత మహారాష్ట్రలో విక్రయించి, ఆ తరువాత దశల వారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

టాటా మోటార్స్ ప్యాసింజర్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ విభాగం యొక్క సేల్స్ మరియు మార్కెట్ అధిపతి సందీప్ కుమార్ మాట్లాడుతూ, "దేశంలో పట్టీకరణ శరవేగంగా పెరగడంతో, ట్రాఫిక్ మరియు పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని టాటా వింగర్ 15ఎస్ వాహనాన్ని ప్రవేశపెట్టాము. అద్దె వాహనాల మార్కెట్లో టాటా వింగర్ 15ఎస్ అత్యంత కీలకమైన ఉత్పత్తిగా రాణిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నామని" చెప్పుకొచ్చాడు.

12 లక్షల ధరతో విడుదలైన 15-సీటర్ టాటా వింగర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

15 మంది వరకు అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు టాటా మోటార్స్ వింగర్ 15ఎస్ వెహికల్‌ను డిజైన్ చేసింది. అద్దెకు నడుపుకునే డ్రైవర్లకు మరియు అద్దె వాహనాలతో ప్యాపారాన్ని నిర్వహించే సంస్థలకు ఈ మోడల్ ఎంతగానో ఉపయోగపడనుంది. దేశీయంగా ఇది ఫోర్స్ టెంపో ట్రావెలర్ వెహికల్‌కు సరాసరి పోటీనిస్తుంది.

టాటా వింగర్ 15ఎస్ లేదా ఫోర్స్ టెంపో ట్రావెలర్; ఈ రెండింటిలో ఏ వాహనం ఉత్తమమైనది? క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాతో పంచుకోండి.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Winger 15-Seater Launched At Rs 12.05 Lakh With Individual AC Vents And Push Back Seats
Story first published: Tuesday, August 7, 2018, 14:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X