ఈ ఏడాది మార్కెట్లోకి విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

Written By:
Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

ప్యాసింజర్ కార్లను ఎంచుకుంటున్న వారిలో యువ కొనుగోలుదారులే అధికంగా ఉండటంతో, చాలా వరకు ఎస్‌యూవీలకే మొగ్గుచూపుతున్నారు. 2017లో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అమ్ముడైన ప్యాసింజర్ కార్లలో ఎస్‌యూవీ సేల్స్ 27శాతం నమోదైంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

2018 చివరి నాటికి ఎస్‌యూవీల సేల్స్ విపరీతంగా పుంజుకోనున్నాయి. మీరు కూడా ఈ ఏడాది ఎస్‌యూవీని ఎంచుకోవాలనుకుంటున్నారా...? అయితే, ఈ సంవత్సరం విడుదలకు సిద్దమైన ఎస్‌యూవీల మీద ఓ లుక్కేసుకోండి...

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

మారుతి సుజుకి వితారా బ్రిజా పెట్రోల్

మారుతి వితారా బ్రిజాను భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఎస్‌యూవీల పరిశ్రమలో తన స్థానాన్ని పధిలం చేసుకోవడానికి మారుతి తమ వితారా బ్రిజా ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు సిద్దమైంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

ప్రస్తుతం స్విఫ్ట్, బాలెనో మరియు ఇగ్నిస్ కార్లలో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను వితారా బ్రిజా పెట్రోల్ వెర్షన్‌లో అందించే అవకాశం ఉంది.

 • విడుదల అంచనా: 2018 మధ్య భాగానికి
 • ధర అంచనా: రూ. 5.5 లక్షల నుండి రూ. 7 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

హ్యుందాయ్ సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సబ్-నాలుగు మీటర్ల ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి కొత్త మోడల్ విడుదల చేయనుంది. 2016లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో మీద ఆవిష్కరించిన కార్లినో కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తోంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

ఫిబ్రవరి 2018లో ఢిల్లీ వేదికగా జరిగే ఆటో ఎక్స్-పో వేదిక మీద మళ్లీ ప్రదర్శనకు రానుంది. కార్లినో ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి ఎలాంటి సాంకేతిక సమాచారం లేదు. అయితే, ఇది 1.2-లీటర్ మరియు 1.4-లీటర్ కెపాసిటి గల ఇంజన్‌లతో, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 • విడుదల అంచనా: 2018 మధ్య భాగానికి
 • ధర అంచనా: రూ. 5.5 లక్షల నుండి రూ. 7.5 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఇండియా క్రెటా ఎస్‌యూవీని 2015లో లాంచ్ చేసింది. ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అయినప్పటికీ, సేల్స్ కొద్ది కొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో క్రెటా ఎస్‌యూవీలో మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి సిద్దమైంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‍‌లో రీడిజైన్ చేయబడిన బంపర్, హెడ్ ల్యాంప్స్ క్రింద ఆకర్షణీయమైన డిజైన్ సొబగులు, క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న సరికొత్త హెడ్ ల్యాంప్స్ మరియు ఫాక్స్ బాష్ ప్లేట్లు వంటివి రానున్నాయి. సాంకేతికంగా అవే, 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్, 1.4-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది.

 • విడుదల అంచనా: 2018 మధ్య భాగానికి
 • ధర అంచనా: రూ. 9 లక్షల నుండి రూ. 14.5 లక్షల మధ్య

Trending On DriveSpark Telugu:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం 2018లో విడుదలవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు

34 లక్షల విలువైన విజయ్ మాల్యా లగ్జరీ కార్లు రూ. 1.4 లక్షలకే!

డేరా బాబా గ్యారేజ్: ఇక్కడ అన్ని లగ్జరీ కార్లు ఉంటాయి!!

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

డాట్సన్ గో క్రాస్

డాట్సన్ గో క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించింది. జనవరి 2018 నుండి ఇండోనేషియా మార్కెట్లో విడుదలవ్వనుంది. విపణిలో ఉన్న మహీంద్రా కెయువి100 మరియు మారుతి సెలెరియో ఎక్స్ వంటి మోడళ్లకు పోటీనివ్వనుంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

డాట్సన్ తమ గో క్రాస్ క్రాసోవర్ గురించి ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు. అయితే, మార్కెట్ ట్రెండ్ అనుగుణంగా చూస్తే 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లతో పరిచయం చేయనుంది.

 • విడుదల అంచనా: 2018 తొలి సగంలో
 • ధర అంచనా: రూ. 5 లక్షల నుండి రూ. 7.5 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

టాటా క్యూ501

టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు హెక్సా క్రాసోవర్ వాహనాలతో మంచి సక్సెస్ అందుకుంది. దేశీయ దిగ్గజం టాటా ఇప్పుడు సఫారీ ఎస్‌యూవీ స్థానాన్ని భర్తీ చేయడానికి క్యూ501 ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

టాటా మోటార్స్ క్యూ501 ప్రీమియమ్ ఎస్‌యూవీని ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తోంది. ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ 5 మరియు 7 సీటింగ్ కెపాసిటీతో ఆల్ డ్రైవ్ సిస్టమ్‌తో జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టుసాన్ వంటి మోడళ్లకు పోటీగా రానుంది.

 • విడుదల అంచనా: 2018 చివరి నాటికి
 • ధర అంచనా: రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

ఎమ్‌జి జిఎస్ కాన్సెప్ట్

ఎమ్‌జి మోటార్స్ భారత్‌లో తమ పూర్తి స్థాయి ప్రణాళికలను సిద్దం చేసుకుంది. అత్యధిక డిమాండ్ ఉన్న ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి తొలి మోడల్‌ను లాంచ్ చేసి, దేశీయంగా తమ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించాడనికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనివ్వగల ఎమ్‌జి జిఎస్ ఎస్‍‌యూవీ ప్రొడక్షన మోడల్‌ను ఎమ్‌జి మోటార్స్ ఇంత వరకు రివీల్ చేయలేదు. అంతే కాకుండా దీని సాంకేతిక వివరాలు కూడా ఇంకా తెలియలేదు.

 • విడుదల అంచనా: 2018లో ఆలస్యంగా
 • ధర అంచనా: రూ. 10 లక్షల నుండి రూ. 13 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

2018 హోండా హెచ్‌ఆర్-వి

సెడాన్, హ్యాచ్‌బ్యాక్ లేదా క్రాసోవర్ ఏ సెగ్మెంట్ అయినా... ప్రీమియమ్ స్టైల్లో అందించేందుకు హోండా కార్స్ ఇండియా ప్రయత్నిస్తోందని ఈ మధ్య కాలంలో విడుదలైన మోడళ్లను చూస్తే తెలుస్తుంది. విపణిలో ఉన్న బిఆర్-వి మరియు సిఆర్-వి మధ్య స్థానాన్ని భర్తీ చేసేందుకు హెచ్ఆర్-వి ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలకు పోటీగా నిలిచే హోండా హెచ్ఆర్-వి 1.5-లీటర్ కెపాసిటి గల విటిఇసి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లో విడుదలవ్వనుంది. అంతర్జాతీయ విపణిలో హోండా హెచ్ఆర్-వి 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది.

 • విడుదల అంచనా: 2018 చివరి నాటికి
 • ధర అంచనా: రూ. 12 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజ బిఎమ్‌డబ్ల్యూ థర్డ్ జనరేషన్ ఎక్స్3 ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. రూ. 50 లక్షల లోపు ధరతో లగ్జరీ పర్ఫామెన్స్ ఎస్‌యూవీని కోరుకునే వారికి ఇదొక చక్కటి ఎంపిక కానుంది. ఢిల్లీలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించి ఆ తరువాత మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

మూడవ తరానికి చెందిన ఎక్స్‌3 ఎస్‌యూవీలో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా ఎన్నో మార్పులు చేపడుతోంది. ఎక్స్3 లభించే పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లలో కూడా అప్‌డేట్స్ చేయనుంది.

 • విడుదల అంచనా: ఫిబ్రవరి 2018లో
 • ధర అంచనా: రూ. 50 లక్షల నుండి రూ. 60 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

ఆడి క్యూ5

2016లో జరిగిన ప్యారిస్ మోటార్ షో లో ఆడి నెక్ట్స్ జనరేషన్ క్యూ5 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అదే క్యూ5 ఎస్‌యూవీని ఈ ఏడాది మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. పెద్ద పరిమాణంలో ఉన్న క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, చంకీ ఫ్రంట్ బంపర్ మరియు అధిక మొత్తంలో గాలిని గ్రహించే ఎయిర్ ఇంటేకర్ ఫ్రంట్ డిజైన్‌లో గుర్తించవచ్చు.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

ఆడి క్యూ5 ఎస్‌యూవీ సాంకేతికంగా 2.0-లీటర్ కెపాసిటి గల టిడిఐ డీజల్ ఇంజన్ 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అనుసంధానంతో లభ్యం కానుంది.

 • విడుదల: జనవరి 18, 2018
 • ధర అంచనా: రూ. 50 లక్షల నుండి రూ. 60 లక్షల మధ్య
2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

ల్యాంబోర్ఘినిఉరస్

ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ ల్యాంబోర్ఘిని జనవరి 11, 2018న "ఉరస్" ప్రపంచపు మొట్టమొదటి సూపర్ ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది. ల్యాంబోర్ఘిని ఉరస్ సూపర్ ఎస్‌యూవీ ధర అంచనా రూ. 3.5 కోట్ల రుపాయలు ఎక్స్-షోరూమ్‌గా ఉండనుంది.

2018లో విడుదలవుతున్న కొత్త ఎస్‌యూవీలు

రెనో ఇండియా ఈ ఏడాది చివరి నాటికి డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. పోటీని ఎదుర్కునేందుకు మరింత విశాలమైన క్యాబిన్ స్పేస్, అధునాతన ఫీచర్లతో సుమారుగా రూ. 9 లక్షల నుండి రూ. 13 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Top 10 upcoming suvs in india. price, expected, launch date, features and specifications.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark