కూడళ్ల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పొరబాటు చేయకండి

Written By:

కాలం ఎంత మారినా మనిషి ప్రవర్తనలో మార్పు రానంత వరకు అభివృద్ది మరియు అద్భుతమైన జీవన శైలి లభించడం కష్టమే. ఇందుకొక సరైన ఉదాహరణ ఈ సంఘటన. కాలి నడక నుండి వేల కిలోమీటర్లను కొన్ని గంటల్లోనే చేధించే దిశగా ఎంతో జ్ఞానం సంపాదించుకున్న మనం అజ్ఞానంతో తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

ఒక్క క్షణం ఆగి ఉంటే సురక్షితంగా రోడ్డు దాటేవారు. మూర్ఖత్వపు నిర్ణయానికి ఈ ముగ్గురు కోలుకోలేని గాయాలతో రోజూ గడిపే దైనందిన జీవితానికి దూరమయ్యారు. వీరు మాత్రమే కాదు, ఇండియన్ రోడ్ల మీద ఇలాంటి సంఘటన రోజుకొకటి జరుగుతోంది. కనీసం ఈ సంఘటనతోనైనా మేల్కొండి...

అసలేం జరిగిందో చూద్దాం రండి...

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

ఇండియన్ రోడ్ల మీద సర్వసాధారణంగా జరిగే సంఘటన కర్ణాటక రాష్ట్ర తీర ప్రాంత పట్టణ ఉడుపి నగరంలో చోటు చేసుకుంది. జాతీయ రహదారుల మీద కూడళ్ల వద్ద ఖచ్చితంగా నెమ్మదిగానే వెళ్లాలి అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

జాతీయ రహదారి మీద మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టయోటా ఇన్నోవా వాహనం బజాజ్ పల్సర్ 150 బైకును ఢీకొట్టింది. దీంతో రైడర్‌తో సహా బైకు మీదున్న మరో ఇద్దరు కొన్ని అడుగుల మేర గాల్లోకి ఎగిరిపడ్డారు.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

ఇండియాలో జాతీయ రహదారుల మీద ఏ అంశం పరంగా చూసుకున్నా తరచూ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. కానీ, అధిక సంఖ్యలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మన తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయి.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

మితి మీరిన వేగంతో ప్రయాణించడం, మానవరహిత జంక్షన్లు, పాదచారులను పట్టించుకోకుండా డ్రైవ్ చేయడం, బాధ్యతారహితమైన బైక్ రైడర్లు ఈ నాలుగు అంశాలతో సంవత్సరానికి కొన్ని వేల మంది కూడళ్ల వద్ద విగతజీవులవుతున్నారు.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

ఇలాంటి సందర్భాల్లో ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి. మొదట రోడ్డు దాటేటపుడు రోడ్డుకు ఇరువైపులా వాహన రాకపోకలను గమనించాలి, స్పీడ్ లిమిట్లను ఖచ్చితంగా పాటించాలి, ఇంకా భద్రత పరమైన నియమాలను పాటించే సురక్షితంగా డ్రైవ్ చేసుకోగలం.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

ఈ సంఘటన బంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే, ఈ ప్రమాదంలో ఇరువురి తప్పు ఉంది. బైక్ రైడర్ రోడ్డును గమనించకుండా ముందుకు రావడం, జంక్షన్‌లో నెమ్మదిగా వెళ్లకుండా మితిమీరిన వేగంతో టయోటా ఇన్నోవా డ్రైవర్ వెళ్లడంతో స్పందించేలోపే ప్రమాదం జరిగిపోయింది.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

వీడియో మొదట్లో చూసినట్లయితే, ముగ్గురు వ్యక్తులతో ఉన్న పల్సర్ 150 రోడ్డు దాటడానికి ప్రయత్నించడాన్ని గమనించవచ్చు.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

ముగ్గురు వ్యక్తులు కూడా మారుతి సుజుకి సెలెరియో మరియు స్విఫ్ట్ డిజైర్ కార్లు వెళ్లే వరకు ఆగి సగం రోడ్డును దాటడానికి ప్రయత్నించారు. రోడ్డును దాటేటపుడు వారికి కుడిపై గమనించిన ముగ్గురు సగం రోడ్డును దాటిని తరువాత వారికి ఎడమ వైపు వేగంతో దూసుకొస్తున్న ఇన్నోవా వాహనాన్ని గమనించలేదు.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

వేగంగా వస్తున్న ఇన్నోవా వచ్చేలోపే రోడ్డును దాటేస్తామనుకున్నారో ఏమో... ఏ మాత్రం నెమ్మదించకుండా, గుడ్డి నమ్మకంతో రోడ్డును దాటడానికి ప్రయత్నించారు. ఇన్నోవా నడుపుతున్న వ్యక్తి కూడా కనీసం చివరి నిమిషంలో కూడా యాక్సిలరేషన్ వదిలేయలేదు.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

టయోటా ఇన్నోవా అత్యధిక వేగంతో బజాజ్ పల్సర్ 150 బైకును ఢీకొట్టింది. బైకు మీద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ ఫోర్సుకు గాల్లోకి ఎగిరిపడ్డారు. వీడియో రికార్డయిన కెమెరా క్లోజ్డ్ సర్క్యూట్(సీసీ) కావడంతో డ్రైవర్ ప్రవర్తించిన తీరును కూడా గుర్తించడం జరిగింది. సడెన్‌గా బైకు రావడంతో వారిని తప్పించడానికి వాహనాన్ని కుడివైపుకు మళ్లించబోయి, ఎడమవైపుకు మళ్లించాడు. బైకు కూడా ఎడమవైపుకు రావడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

బైకు మీద ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా ఉడుపిలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ దుర్ఘనట జాతీయ రహదారి 66 మీద జరిగింది. ఈ రహదారి మహారాష్ట్రలోని పాన్వెల్ మరియు భారతదేశపు దక్షిణ కొన కన్యాకుమారిని కలుపుతుంది.

వేగం దాటికి బజాజ్ పల్సర్ 150 దాదాపు నుజ్జునుజ్జయ్యింది. ఇన్నోవా ముందు భాగం కూడా పాక్షికంగా దెబ్బతిని ఉండవచ్చు. తీవ్రంగా గాయబడిన బాధితులు చికిత్స పొందుతున్నారు.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ రోడ్ల మీద రోడ్డు ప్రమాదాలు ప్రతినిత్యం సర్వసాధారణం. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించడానికి మనం చేయాల్సినవన్నీ చేయాలి. యాక్సిడెంట్లను అరికట్టడానికి మనం చేయాల్సిన మొట్టమొదటిది డ్రైవింగ్‌లో ఉన్నపుడు ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరించడమే.

కూడళ్ల వద్ద ఎప్పుడూ జాగ్రత్తగానే వ్యవహరించాలి. ప్రత్యేకించి, జాతీయ రహదారులకు సమీపంలో నివశించే వారు మితిమీరిన వేగంతో దూసుకెళ్లే వాహనాల పట్ల ప్రత్యేక దృష్టి సారించండి. ఢీకొట్టి వెళ్లిపోయారంటే, ఏ వాహనం ఢీకొట్టిందో కూడా తెలుసుకోలేరు.

బజాజ్ పల్సర్ బైకును ఢీకొన్న టయోటా ఇన్నోవా

1. విడుదలకు సిద్దమైన ఏబిఎస్ వెర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్: ధర మరియు ఇతర వివరాలు

2.హోండా సిబిఆర్250ఆర్ విడుదల: ధర రూ. 1.64 లక్షలు

3.జీప్ కంపాస్ ఓనర్ల జాబితాలోకి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్

4.[వీడియో] కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

5.పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్ ఎస్‌యూవీ: మళ్లీ అవే ఫలితాలు!!

English summary
Read In Telugu: Accident Video Shows Why You Should Slow Down Near Junctions On Highways

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark