150కిమీల వేగం వద్ద ఇన్నోవా క్రిస్టాకు తప్పిన పెను ప్రమాదం: వీడియో

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న టయోటా ఇన్నోవా క్రిస్టా ఊహించని రీతిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుంది.

By Anil Kumar

ఏ మాత్రం ఊహించనటువంటి రహదారులకు ఇండియన్ రోడ్లు బాగా ప్రసిద్ది. అవును, భారతీయ రహదారులు మీద ఎప్పుడు ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయో అస్సలు ఊహించలేము. డ్రైవింగ్‌లో ఉన్నపుడు మనల్ని ఎప్పుడూ కాపాడేది మన జాగ్రత్తే. కానీ ఇదొక్కటే కాదు, సురక్షితమైన రహదారులు మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా తప్పనిసరని చెప్పాలి.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న టయోటా ఇన్నోవా క్రిస్టా ఊహించని రీతిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. అసలేం జరిగిందో చూద్దాం రండి...

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

ఓ జాతీయ రహదారి రహదారి మీద రెండు ఇన్నోవా క్రిస్టా వాహనాలు హైస్పీడుతో ప్రయాణిస్తున్నాయి. రెండు ఇన్నోవా క్రిస్టా వాహనాలు కూడా సుమారుగా 150కిమీల మరియు 130 - 140 కిమీల వేగంతో వెళుతున్నాయి.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

అయితే, ముందు వైపున భారీ వేగంతో దూసుకెళుతున్న ఇన్నోవా క్రిస్టాకు అనుకోకుండా రోడ్డు మీద మధ్యలో ఉన్నటువంటి ఓ వస్తువు చుట్టూ రెడ్ ప్లాస్టిక్ కోన్‌లతో ఏర్పాటు చేసిన అవాంతరం ఎదురైంది.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

దాన్ని ఢీకొట్టకుండా తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం కొద్దిగా ఎడమవైపుకు మళ్లడం. అయితే అదే సందర్భంలో దానికి ప్రక్కనే మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు రావడంతో డ్రైవర్‌కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. అయితే భయాందోళనకు గురైపోయి స్టీరింగ్ అటూ ఇటూ తిప్పకుండా సడెన్ బ్రేకులు వేశాడు.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

క్షణాల్లో ఇన్నోవా క్రిస్టా వేగం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పక్కన వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ పాస్ అయిపోవడం, సడెన్‌గా ఎదురైన అవాంతరాన్ని తప్పించుకుని ముందుకెళ్లిపోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. బ్రేకులకు జోడింపుగా అందించిన ఓ సేఫ్టీ పరికరం ఇన్నోవా క్రిస్టాను భారీ ప్రమాదం నుండి తప్పించింది.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

ఇంతకీ ఆ సేఫ్టీ టెక్నాలజీ ఏంటి? క్షణాల్లో వాహన వేగాన్ని ఎలా తగ్గించిందో చూద్దాం రండి...

త్రుటిలో భారీ ప్రమాదాన్ని తప్పించుకున్న టయోటా ఇన్నోవా క్రిస్టాలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉంది. ఏబిఎస్ టెక్నాలజీ హైస్పీడులో బ్రేకులు అప్లే చేసినపుడు చక్రాలు పట్టేయకుండా చేయడం మరియు స్కిడ్ అవ్వడాన్ని నివారిస్తుంది.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

హైస్పీడులో బ్రేకులు ప్రయోగించినపుడు, బ్రేకులు చక్రాన్ని పట్టేస్తాయి దీంతో ఆ వేగానికి చక్రాలు రోడ్డు మీద రాసుకుంటూ వెళ్తాయి. అయినా కూడా అవాంతరాన్ని ఢీకొట్టకుండా ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. అయితే ఏబిఎస్ సిస్టమ్ చక్రాలు స్కిడ్ మరియు రాపిడి కాకుండా చేస్తూనే వాహన వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

డిస్క్ బ్రేక్ వద్ద ఓ సెన్సార్ ఉంటుంది. ఇది డిస్క్ తిరిగే వేగాన్ని గమనిస్తూ ఉంటుంది. మీరు బ్రేకులు గట్టిగా వేసినపుడు కొన్ని మిల్లీ సెకండ్లలోపే వీల్ లాక్ అవ్వడాన్ని గుర్తిస్తుంది. వెంటనే బ్రేక్ ప్యాడ్స్‌ను డిస్క్ నుండి దూరం చేస్తుంది.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

ఇలా చేయడంతో వీల్ లాక్ అవ్వదు. అప్పటికే వెహికల్ అధిక వేగం మీద ఉండటంతో వాహనం మళ్లీ వేగాన్ని పుంజుకుంటుంది. కాబట్టి వేగం పెరిగితే బ్రేక్ ప్యాడ్స్ డిస్క్‌ను మళ్లీ పట్టి ఉంచుతాయి. ఈ క్రమంలో వీల్ లాక్ అయినట్లు సెన్సార్ గుర్తిస్తే బ్రేకులు అప్లే కాకుండా ఏబిఎస్ చూసుకుంటుంది.

హైస్పీడ్ ఇన్నోవా క్రిస్టాకు క్షణాల్లో తప్పిన ప్రమాదం

ఈ మొత్తం కేవలం కొన్ని మిల్లీ సెకండ్లలోనే పూర్తవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏబిఎస్ సిస్టమ్స్ ఒక్క సెకన్‌లో 15 సార్లు బ్రేకులను అప్లే చేయడం, వదలడం చేస్తాయి. మనం బ్రేకులు అప్లే చేసినపుడు మనకు ఇవేం తెలియకపోయినా... ఏబిస్ ఉన్న వాహనాల్లో అధిక వేగం వద్ద బ్రేకులు అప్లే చేస్తే క్షణాల్లో వాహన వేగం పూర్తిగా తగ్గిపోతుంది.

గంటకు సుమారుగా 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనం ఏబిఎస్ ఫీచర్ ఉండటంతో భారీ ప్రమాదాన్ని ఎలా తప్పించుకుందో చూడండి

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Innova Crysta at 150 Kmph saved from certain crash thanks to ABS [Video]
Story first published: Wednesday, August 22, 2018, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X