సాంకేతిక లోపంతో టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియాలో విక్రయిస్తున్న ఇన్నోవా క్రిస్టా మరియా ఫార్చూనర్ వాహనాలను రీకాల్ చేసింది. రెండు మోడళ్లలో కూడా ఫూయల్ హోస్ వద్ద తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రీకాల్ చేసినట్లు టయోటా ప

By Anil Kumar

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియాలో విక్రయిస్తున్న ఇన్నోవా క్రిస్టా మరియా ఫార్చూనర్ వాహనాలను రీకాల్ చేసింది. రెండు మోడళ్లలో కూడా ఫూయల్ హోస్ వద్ద తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రీకాల్ చేసినట్లు టయోటా ప్రకటించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

జూలై 16, 2016 నుండి మార్చి 22, 2018 మధ్య తయారైన ఇన్నో టయోటా ఇన్నోవా క్రిస్టా మోడళ్లను అదే విధంగా అక్టోబరు 6, 2016 నుండి మార్చి 22, 2018 మధ్య తయారైన అన్ని టయోటా ఫార్చ్యూనర్ వాహనాలను ముందస్తు భద్రతలో భాగంగా రీకాల్ చేసినట్లు టయోటా ప్రకటించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

రీకాల్ గురించి టయోటా విడుదల చేసిన ఓ ప్రకటనలో మొత్తం 2,628 యూనిట్ల ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ వాహనాలను వెనక్కి పిలిచినట్లు తెలిసింది. సియామ్ విడుదల చేసిన ఓ ప్రకటనలో "ఫ్యూయల్ రిటర్న్ హోస్‌ను క్యానిస్టర్ హోస్‌కు తప్పుగా అనుసంధానం చేసినట్లు గుర్తించారు. దీని వలన ఫ్యూయల్ ట్యాంక్ పూర్తిగా నింపినపుడు క్యానిస్టర్ నుండి లీకేజ్ జరుగుతుంది." అని పేర్కొంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా కూడా ఇదే ప్రకటించింది. ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చూనర్ మోడళ్లలోని పెట్రోల్ వేరియంట్లు మాత్రమే రికాల్‌కు గురైనట్లు వెల్లడించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

టయోటా మోటార్స్ ఏడాది తొలిసగం విక్రయాల్లో 23 శాతం వృద్దిని సాధించినట్లు ప్రకటించింది. జూన్ 2018లో దేశీయంగా 13,088 యూనిట్లను విక్రయించింది. వీటిలో జూన్ 2018లో ఇన్నోవా క్రిస్టా 43 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎమ్‌పీవీ వాహనాలలో టయోటా ఇన్నోవా క్రిస్టా ఒకటి. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, విడుదలైనప్పటి నుండి ప్రతి నెలా సగటున 8,000 యూనిట్ల విక్రయాలు జరుపుతోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రెండు మోడళ్లలో కూడా 2,694సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇన్-లైన్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 163బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

రెండు వాహనాలు కూడా 170బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లో లభిస్తున్నాయి. ఇన్నోవా క్రిస్టా అదనంగా 150బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే చిన్న డీజల్ ఇంజన్ వేరియంట్లో లభ్యమవుతోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మోడళ్లు టయోటా ఇండియాకు మంచి సేల్స్ సాధించిపెడుతున్నాయి. కస్టమర్లు భద్రతను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక లోపం ఉన్న వాహనాలను రీకాల్ చేసింది. రీకాల్ అయిన వాహనాల్లో కేవలం పెట్రోల్ వేరియంట్లు మాత్రమే ఉన్నాయి. అయితే, చాలా వరకు కస్టమర్లు డీజల్ వేరియంట్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ వాహనాల ధరల శ్రేణి రూ. 14.34 లక్షల నుండి రూ. 26.69 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Innova Crysta And Fortuner Recalled Over Faulty Fuel Hose Connection
Story first published: Tuesday, July 10, 2018, 13:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X