మే లో విడుదలవుతున్న టయోటా యారిస్ వేరియంట్లు మరియు ధరల వివరాలు

జపాన్ దిగ్గజం టయోటా దేశీయ విపణిలోకి విడుదలకు సిద్దం చేసిన యారిస్ కారు ధరలు వివరాలు వెల్లడయ్యాయి. టయోటా మోటార్స్ తమ యారిస్ మిడ్ సైజ్ సెడాన్ యారిస్ ధరలను వెల్లడించి, దేశవ్యాప్తంగా ఉన్న టయోటా అధీకృత డీలర

By Anil Kumar

జపాన్ దిగ్గజం టయోటా దేశీయ విపణిలోకి విడుదలకు సిద్దం చేసిన యారిస్ కారు ధరలు వివరాలు వెల్లడయ్యాయి. టయోటా మోటార్స్ తమ యారిస్ మిడ్ సైజ్ సెడాన్ యారిస్ ధరలను వెల్లడించి, దేశవ్యాప్తంగా ఉన్న టయోటా అధీకృత డీలర్ల వద్ద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది.

టయోటా యారిస్

టయోటా షోరూమ్‌లో యారిస్ కారును గమనించి, వేరియంట్ల వారీగా ధరలను పరిశీలించే అవకాశాం కల్పించింది. రూ. 50,000 ముందస్తు బుకింగ్ మొత్తాన్ని చెల్లించి యారిస్ బుక్ చేసుకోవచ్చు.

టయోటా యారిస్

టయోటా యారిస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.75 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14.07 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఇవ్వబడ్డాయి. టయోటా యారిస్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. అవి, జె, జి, వి మరియు విఎక్స్.

టయోటా యారిస్

మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో వేరియంట్ల వారీగా టయోటా యారిస్ ధరలు

Variant MT CVT
J ₹ 8,75,000 ₹ 9,95,000
G ₹ 10,56,000 ₹ 11,76,000
V ₹ 11,70,000 ₹ 12,90,000
VX ₹ 12,85,000 ₹ 14,07,000
టయోటా యారిస్

టయోటా ఇండియా విభాగం టయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారును వచ్చే మే 18 న విపణిలోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అదే విధంగా ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు విడుదల రోజున డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

టయోటా యారిస్

టయోటా మోటార్స్ యారిస్ సెడాన్ కారును మొట్టమొదటి సారిగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018 వాహన ప్రదర్శనలో ఆవిష్కరించింది. ప్రదర్శన వేదిక మీద యారిస్ కారుకు సందర్శకుల తాకిడి అధికంగా ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

టయోటా యారిస్

సాంకేతికంగా టయోటా యారిస్‌లో 1.5-లీటర్ కెపాసిట గల డ్యూయల్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు. మరో ప్రధాన హైలైట్ ఏమిటంటే, సివిటి గేర్‌బాక్స్ అన్ని వేరియంట్లలో లభ్యమవుతోంది.

టయోటా యారిస్

టయోటా యారిస్ ఎన్నో ఫీచర్లతో వస్తోంది. ప్రధానంగా చెప్పుకోదగిన వాటిలో, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఇడి లైట్ల చుట్టూ ఉన్న ఆకర్షణీయమైన పట్టీ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి ఉన్నాయి.

టయోటా యారిస్

భద్రత పరంగా టయోటా యారిస్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి. వీటితో పాటు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు మరియు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

టయోటా యారిస్

టయోటా యారిస్ ఇంటీరియర్‌లో బీజి మరియు సిల్వర్ సొబగులు గల బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్ ఇంటీరియర్ కలదు. క్యాబిన్‌లో 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ డ్రైవర్ సీట్, రియర్ ఏ/సి వెంట్స్, ఆంబియంట్ లైటింగ్, సివిటి మోడళ్లలో పెడల్ షిఫ్టర్స్, 60:40 నిష్పత్తిలో మడిచే అవకాశం ఉన్న రియర్ సీట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా యారిస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విడుదలయ్యే సమయానికి వీలైనంత మంది ఎక్కువ కస్టమర్లను చేరుకోవడానికి టయోటా మోటార్స్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్ల వద్ద ప్రదర్శించింది. అదే విధంగా వేరియంట్ల వారీగా ధరలను కూడా వెల్లడించింది.

టయోటా యారిస్

గతంలో టయోటా ఎటియోస్ కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసినప్పుడు, ఏ షోరూమ్‌లో కూడా ఎటియోస్‌ను ప్రదర్శించలేదు, అంతే కాకుండా విడుదల సమయానికి ఇది లభించే వేరియంట్లు మరియు ధరల వివరాలు కస్టమర్లకు అస్సలు తెలియరాలేదు. దీంతో బుకింగ్ చేసుకున్న కస్టమర్లలో సుమారుగా 50 శాతం కారును చూసిన తరువాత బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.

ఇలాంటి పొరబాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుంది. టయోటా యారిస్ భారత్‌లోకి తొలిసారిగా విడుదలవుతోంది. ఇది విపణిలో ఉన్న మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

టయోటా యారిస్

1.నూతన అధ్యయనానికి నాంది పలికిన హోండా మోటార్స్

2.టాటా నెక్సాన్ ఏఎమ్‌టి వేరియంట్ మీద బుకింగ్స్ ప్రారంభించిన టాటా మోటార్స్

3.ఏడు మంది ప్రాణాలను బలిగొన్న చిన్న తప్పిదం

4.పరీక్షిస్తూ పట్టుబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700

5.లంచం తీసుకున్న ట్రాఫిక్ పోలీసుకు చుక్కలు చూపించిన యూట్యూబర్

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Yaris Prices Revealed; To Launch In May
Story first published: Thursday, April 26, 2018, 10:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X