విరాట్ కోహ్లీ ఖాతాలో ఆడి ఆర్ఎస్5 కూపే లగ్జరీ కారు

Written By:

టీమిండియా కెప్టెన్ మరియు ఐపిల్ 11వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ ఇటీవల ఆడి ఇండియా విపణిలోకి లాంచ్ చేసిన ఆర్ఎస్5 కూపే లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.

ఇండియాలో ఆడి ఆర్ఎస్5 లగ్జరీ కారును కొనుగోలు చేసిన తొలి కస్టమర్‌ విరాట్ కోహ్లీ. సుమారుగా రూ. 1.10 కోట్ల రుపాయల ఎక్స్-షోరూమ్ ధరతో విరూష్క జోడీ దీనిని సొంతం చేసుకుంది.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

విరాట్ కోహ్లీ ఆడి ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ వద్ద ఉన్న అత్యధిక లగ్జరీ కార్లలో ఆడి కార్లే అధికం. అందులో కూడా ఆడి మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి కారును, తొలి కస్టమర్‌గా ఎంచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

విరాట్ నివాసంలో తన లగ్జరీ కార్లను పార్క్ చేసిన ప్రదేశాన్ని చూస్తే, అతి పెద్ద ఆడి కార్ల షోరూమ్‌ను తలపిస్తుంది. విరాట్ లగ్జరీ కార్ల జాబితాలో ఆడి ఎస్6, ఆడి ఏ8 ఎల్, ఆడి క్యూ7, ఆడి ఆర్8, డి ఆర్8 ఎల్ఎస్ఎక్స్ ఇంకా ఆస్టన్ మార్టిని డిబిఎస్ వంటి ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటి సరసన ఇప్పుడు తాజాగా ఆర్ఎస్5 కారు వచ్చి చేరింది.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

ఆడి ఇండియా ఆర్ఎస్5 లగ్జరీ కూపే కారును సెకండ్ జనరేషన్ కారుగా లాంచ్ చేసింది, ఇండియన్ మార్కెట్లోని ఆడి లైనప్‌లో అత్యంత ప్రసిద్దిగాంచిన మోడళ్లలో ఆర్ఎస్5 కూపే ఒకటి. ఆర్ఎస్5 కూపే కారును పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో ఫస్ట్ జనరేషన్ ఆర్ఎస్5 కంటే కొలతల పరంగా ఇది పెద్దదిగా ఉంటుంది. దీనిని బరువును 60కిలోల వరకు తగ్గించడానికి ఆప్షనల్ కార్బన్ ఫైబర్ రూఫ్ కలదు. ఎక్ట్సీరియర్ డిజైన్‌లో మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, సరికొత్త బంపర్లు, పెద్ద పరిమాణంలో ఉన్న గ్రిల్, విశాలమైన ఎయిర్ ఇంటేకర్ మరియు 19-అంగుళాల వీల్స్ స్టాండర్డ్‌గా ఇందులో వచ్చాయి.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

సాంకేతికంగా ఇందులో 2.9-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మునుపటి తరం ఆర్ఎస్5 కూపేలో ఉన్న వి8 పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేసింది. ఇది గరిష్టంగా 444బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

కొత్త తరం ఆడి ఆర్ఎస్5 కూపే లగ్జరీ కారు కేవలం 3.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్ల వరకు ఎలక్ట్రికల్‌గా లిమిట్ చేయడం జరిగింది. ఆడి అందిస్తున్న డైనమిక్ ప్యాకేజీ ద్వారా ఈ వేగాన్ని 280కిలోమీటర్లకు పెంచుకోవచ్చు.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

ఆడి ఆర్ఎ5 కూపే కారులో ఎన్నో విలాసవంతమైన అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అందులో, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, అల్కంటారా లెథర్ అప్‌హోల్‌స్ట్రే, అల్యూమినియం పెడల్స్ మరియు అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గల ఆడి వర్చువల్ కాక్‌పిట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్న తొలి ఆర్ఎస్ బ్రాండ్ కారు ఆడి ఆర్ఎస్5 కూపే. విరాట్ కోహ్లీ లగ్జరీ కార్ గ్యారేజీలో బెంట్లీ కాంటినెంటల్ జిటి మరియు రేంజ్ రోవర్ వోగ్ వంటి ఇతర కంపెనీలకు చెందిన పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఆడి ఆర్ఎస్5 కూపే

1.డ్రైవర్‌కు భలే కానుకిచ్చిన అనుష్క

2.అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ ఫ్యామిలీ కార్ కలెక్షన్

3.రజనీకాంత్ కార్ కలెక్షన్ 1980 నుండి 2018 వరకు...

4.సీఎం కారునే దొంగలించిన దుండగులు

5.అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన బైకు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

English summary
Read In Telugu: Virat Kohli becomes the first owner of Audi RS5 in India
Story first published: Monday, April 16, 2018, 15:48 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark