మోస్ట్ పవర్ ఫుర్ వెర్షన్‌లో వోక్స్‌వ్యాగన్ అమియో కాంపాక్ట్ సెడాన్

Written By:
Recommended Video - Watch Now!
Horrific Footage Of Volkswagen Polo Exploding At A CNG Filling Station

వోక్స్‌వ్యాగన్ 2018లో ఇండియన్‌ మార్కెట్ కోసం కొన్ని కొత్త కార్లను మరియు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేయడానికి నిర్ణయించుకుంది. 2017 సంవత్సరం వోక్స్‌వ్యాగన్ ఇండియాకు మంచి ఫలితాలు సాధించి పెట్టింది. వోక్స్‌వ్యాగన్ అమియో కాంపాక్ట్ సెడాన్ ఆశాజనకమైన సేల్స్ వోక్స్‌వ్యాగన్ వార్షిక వృద్ది పెరుగుదలకు తోడ్పడింది.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

అంతే కాకుండా, ప్రీమియమ్ సెగ్మెంట్లోకి టిగువాన్ ఎస్‌యూవీ మరియు కొత్త తరం పస్సాట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. ఏదేమైనప్పటికీ, 2018లో కొత్త మోడళ్లను విడుదల చేసే ఆలోచనలో వోక్స్‌వ్యాగన్ ఉంది.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, వోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది ప్రవేశపెట్టే కొత్త మోడళ్లలో వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ ఉంది. అమియో జిటి టిఎస్ఐ స్పోర్టివ్ వెర్షన్‌లో కాకుండా పర్ఫామెన్స్ వెర్షన్‌లో వస్తోంది.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

వోక్స్‌వ్యాగన్ తమ జిటి టిఎస్ఐ అమియో కాంపాక్ట్ సెడాన్ కారును 2018 చివరిలో విడుదల చేయడానికి సన్నద్దమవుతోంది. మరియు దీనిని వోక్స్‌వ్యాగన్ పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ పోలో జిటి టిఎస్ఐ ఆధారంగా నిర్మిస్తున్నారు.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

సాంకేతికంగా పోలో జిటి టిఎస్ మోడల్‌లోని అదే 1.2-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ అమియో జిటి టిఎస్ఐలో వస్తోంది. 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

అమియో కారులో జిటి టిఎస్ఐ వెర్షన్‌ పరిచయమైతే, ఇండియన్ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన సబ్-కాంపాక్ట్ సెడాన్ ఇదే కానుంది. వోక్స్‌వ్యాగన్ వెంటో టిఎస్ఐ పోలో టిఎస్ఐతో పోల్చుకుంటే బరువు అధికంగా ఉంటుంది. కానీ బరువు మరియు పవర్ నిష్పత్తి ప్రయోజనాలు అమియో సెడాన్‌కు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.

10 లక్షల ధరతో విలాసవంతమైన ఫీచర్లు ఉన్న 12 బెస్ట్ కార్లు

8 లక్షల ధరలో లభించే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

ప్రస్తుతం, వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ మోడల్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించింది. అయితే జిటి టిఎస్ఐ ఇంజన్ రావడంతో మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లభించే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

పవర్‍‌ఫుల్ అమియో కాంపాక్ట్ సెడాన్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మారుతి న్యూ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, సరికొత్త హోండా అమేజ్ మరియు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

అతి త్వరలో విడుదల కానున్న కొత్త తరం హోండా అమేజ్ మరియు న్యూ మారుతి డిజైర్ కార్లతో అమియో గట్టి పోటీని ఎదుర్కోనుంది. ఎందుకంటే ఈ రెండింటిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో ఆప్షనల్‌గా లభ్యమవుతోంది. అయితే, పనితీరు విషయంలో వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ బెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌గా నిలవడం ఖాయం.

వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త మరియు శక్తివంతమైన ఇంజన్ పరిచయం చేయడంతో వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోనే అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలవనుంది. అంతే కాకుండా డిఎస్‌జి గేర్‌బాక్స్ పరిచయం చేయడంతో సిటి మరియు లాంగ్ డ్రైవ్‌లో మరింత మజా పొందవచ్చు.

ఎన్ని ఫీచర్లు ఉన్నా, ఇంజనీరింగ్ పరంగా ఎంత అద్భుతం చేసినా... ఇండియన్ కస్టమర్లు చివరగా అడిగే ప్రశ్న "లీటర్‌కు ఎంత ఇస్తుంది...?". కాబట్టి, వోక్స్‌వ్యాగన్ అమియో జిటి టిఎస్ఐ మైలేజ్ ప్రియులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Read In Telugu: Volkswagen Ameo GT TSI Launch Date Details: Expected Price, Specs And Features

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark