విపణిలోకి మైలేజ్ వెర్షన్ వోక్స్‌వ్యాగన్ పోలో విడుదల: ధర రూ. 5.41 లక్షలు

Written By:

వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌కు సరికొత్త 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో పరిచయం చేసింది.

మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ అధికంగా ఉంది. మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్ల విజయమే ఇందుకు నిదర్శనం. మైలేజ్ ప్రియులైన ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి జర్మనీ ప్యాసింజర్ కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఒక కొత్త నిర్ణయంతో ముందుకొచ్చింది. మోస్ట్ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకొన్న పోలో కారులో ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను విడుదల చేసింది.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

మైలేజ్ వెర్షన్ ప్రవేశపెట్టడం కోసం వోక్స్‌వ్యాగన్ పోలో కారులో ఉన్న 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను శాశ్వతంగా తొలగించి, మైలేజ్ కోసం సిద్దం చేసిన 1-లీటర్ మూడు సిలిండర్ల ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వడం జరిగింది.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

వోక్స్‌వ్యాగన్ పోలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఏఆర్‌ఏఐ ఫలితాల మేరకు, లీటర్‌కు 16.47కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. కానీ, వోక్స్‌వ్యాగన్ తాజాగ పరిచయం చేసిన పోలో 1-లీటర్ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 18.78కిమీల మైలేజ్‌నిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

అత్యుత్తమ మైలేజ్ సామర్థ్యం గల పోలో 1-లీటర్ వేరియంట్ 6,200ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 75బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ, టార్క్ కాస్త తగ్గింది. 1.2 లీటర్ ఇంజన్ 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే, 1-లీటర్ వేరియంట్ 95ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

వోక్స్‌వ్యాగన్ పోలో 1.0-లీటర్ వేరియంట్ ధర మునుపటి పోలో ధరలతోనే అందుబాటులోకి వచ్చింది. సరికొత్త పోలో 1 లీటర్ వేరియంట్ ధర రూ. 5.41 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

వోక్స్‌వ్యాగన్ పోలో లభించే అన్ని వేరియంట్లలో ఉన్న 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ వచ్చింది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. అంతే కాకుండా దీని బరువు సుమారుగా 18కిలోల వరకు తగ్గింది.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

వోక్స్‌వ్యాగన్ పోలో 1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్లు మరియు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

Variants Price
Trendline Rs 5.41 Lakh
Comfortline Rs 6.10 Lakh
Highline Rs 7.01 Lakh
Highline Plus Rs 7.24 Lakh
వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

వోక్స్‌వ్యాగన్ 1.2-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ గల పోలో జిటి టిఎస్ఐ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్‌ను యథావిధిగా విక్రయించనుంది. ఇది సుమారుగా 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

వోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ వెర్షన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. డీజల్ వెర్షన్ పోలో కోరుకునేవారి కోసం 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ వేరియంట్‌ను అందుబాటులో ఉంచింది.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ పోలో రెగ్యులర్ డీజల్ వెర్షన్‌లో ఉన్న 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా జిటి టిడిఐ వెర్షన్‌లో ఉన్న ఇదే డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

వోక్స్‌వ్యాగన్ పోలో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్

వోక్స్‌వ్యాగన్ పోలో 1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్ పట్ల డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త 1-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ పోలో లైనప్‌ నుండి తొలగించిన 1.2-లీటర్ తరహా పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, తక్కువ కెపాసిటి గల 1 లీటర్ ఇంజన్ అధిక మైలేజ్ ఇస్తుంది.

మైలేజ్ ప్రియులకు అనుగుణంగా వోక్స్‌వ్యాగన్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే. కానీ, ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2-లీటర్ పోలో లభించే అవే పాత ధరలతోనే కొత్త పోలోను ప్రవేశపెట్టింది.

వోక్స్‌వ్యాగన్ కనుక ఈ పోలో 1 లీటర్ ఎమ్‌పిఐ మోడల్ ధరలను స్వల్పంగా తగ్గించి ఉంటే, అత్యుత్తమ మైలేజ్‌తో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లతో పాటు సరికొత్త మారుతి స్విఫ్ట్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వగలిగేది.

English summary
Read In Telugu: Volkswagen Polo Gets More Fuel Efficient 1-Litre Petrol Engine: Price, Mileage, Specs & Features
Story first published: Saturday, March 10, 2018, 10:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark