మైలేజ్ కోసం సరికొత్త పెట్రోల్ ఇంజన్ పరిచయం చేస్తున్న వోక్స్‌వ్యాగన్

వోక్స్‌వ్యాగన్ తమ పోలో హ్యాచ్‌బ్యాక్ మరియు అమియో కాంపాక్ట్ సెడాన్ మోడళ్లను సరికొత్త పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, పోలో మరియు అమియ

By Anil

Recommended Video

New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

వోక్స్‌వ్యాగన్ తమ పోలో హ్యాచ్‌బ్యాక్ మరియు అమియో కాంపాక్ట్ సెడాన్ మోడళ్లను సరికొత్త పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, పోలో మరియు అమియో కార్లలో నూతన పెట్రోల్ ఇంజన్ అందిస్తున్నట్లు తెలిసింది. అవసరానికి తగిన పవర్ మరియు ఆశించిన మైలేజ్ ఈ నూతన ఇంజన్‌తో పొందవచ్చు.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

మీరు చదివింది నిజమే, వోక్స్‌వ్యాగన్ ఇండియా లైనప్‌లో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని 1-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇది గరిష్టంగా 76బిహెచ్‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

ఈ 1-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో రానుంది. ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని స్థానంలోకి వస్తున్న కొత్త పెట్రోల్ ఇంజన్ పోలో మరియు అమియో కాంపాక్ట్ సెడాన్ కార్లలో టార్క్ తగ్గడానికి కారణమవుతుంది.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

వోక్స్‌వ్యాగన్ 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా అధిక మైలేజ్ ఇస్తుందని చెబుతోంది. పోలో కారులో 18.5కిమీ/లీ మరియు అమియో కాంపాక్ట్ సెడాన్ కారులో 20కిమీ/లీ మైలేజ్ సాధ్యమవుతుందని పేర్కొంది.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

ప్రస్తుతం 1.2-లీటర్ ఇంజన్ గల పోలో హ్యాచ్‌బ్యాక్ గరిష్టంగా 16.47కిమీ/లీ మరియు అమియో కాంపాక్ట్ సెడాన్ గరిష్టంగా లీటర్‌కు 17.83కిమీ/లీ మైలేజ్ ఇస్తున్నాయి. రెండు కార్లలో కూడా మైలేజ్ పెరిగినప్పటికీ, ఇది వరకు పవర్ ఫుల్ కార్లుగా పేరుగాంచిన పోలో మరియు అమియోలలో పవర్ తగ్గడం కస్టమర్లకు కాస్త అసంతృప్తినిస్తుందని చెప్పవచ్చు.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

పోలో మరియు అమియో కార్లలో తక్కువ కెపాసిటి ఉన్న 1-లీటర్ పెట్రల్ ఇంజన్ అందివ్వడానికి బదులుగా, ఇది వరకే ఉన్న 1.2-లీటర్ టిఎస్ఐ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ట్యూనింగ్ చేసి అందించవచ్చు. అయితే, ఇప్పటి వరకు 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

కొత్త 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చినప్పటికీ పోలో మరియు అమియో కార్ల ధరలలో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. ప్రస్తుతం, వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.42 లక్షలు మరియు అమియో కాంపాక్ట్ సెడాన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.5 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

వోక్స్‌వ్యాగన్ పోలో మరియు అమియో పెట్రోల్ ఇంజన్‌తో పాటు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతోంది. సాంకేతికంగా వీటిలో ఉన్న 1.5-లీటర్ టిడిఐ డీజల్ ఇంజన్ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా 1.5-లీటర్ యొక్క పవర్ ఫుల్ వెర్షన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టివ్ మరియు పవర్ ఫుల్ వెర్షన్ పోలో జిటి వేరియంట్లోని 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 104బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో పోలో మరియు అమియో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ తమ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను శాశ్వతంగా తొలగించి, దాని స్థానంలోకి సరికొత్త 1-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో పోలో మరియు అమియో కార్లలో మైలేజ్ మరింత పెరగనుంది. అయితే, ఇదే సందర్భంలో పోలో మరియు అమియో యొక్క పవర్ ఫుల్ వెర్షన్ కోరుకునే కస్టమర్లను నిరుత్సాహపరుస్తోంది. ఇప్పటి వరకు నూతన పెట్రోల్ ఇంజన్ పరిచయం గురించి వోక్స్‌వ్యాగన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరిన్ని ఆటోమొబైల్ వార్తల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Source: MotorOctane

Most Read Articles

English summary
Read In Telugu: Volkswagen Polo And Ameo To Get New Petrol Engine — Power And Mileage Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X