వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్ ఆవిష్కరణ: విడుదల తేదీ మరియు అంచనా ధరలు

Written By:
Recommended Video - Watch Now!
Toyota Yaris India Walkaround; Specifications, Features, Details

వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్‌(Volkswagen Vento Sport Edition) మిడ్ సైజ్ సెడాన్ కారును ఆవిష్కరించింది. వెంటో స్పోర్ట్ ఎడిషన్ ధరలను ఇంకా వెల్లడించలేదు, అయితే వోక్స్‌వ్యాగన్ తమ వెబ్‌సైట్లో వెంటో స్పోర్ట్ ఎడిషన్‌ను చేర్చింది.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

మార్చి 2018 లో వోక్స్‌వ్యాగన్ స్పోర్ట్ ఎడిషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ వెర్షన్ వెంటోతో పోల్చుకుంటే భిన్నంగా ఉండేందుకు స్పోర్ట్ ఎడిషన్ వెంటో కారులో స్టైలింగ్ పరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

సరికొత్త వోక్స్‌వ్యాగన్ వెంటో ఎడిషన్ సెడాన్‌లో కార్బన్-ఫినిషింగ్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు మరియు ఫ్రంట్ ఫెండర్స్ మీద క్రోమ్ స్పోర్ట్ బ్యాడ్జింగ్ కలదు. గ్లోజీ బ్లాక్ రూఫ్ వ్రాప్, 16-అంగుళాల పోర్టగో అల్లాయ్ వీల్స్, బ్లాక్ సైడ్ ఫాయిల్స్ మరియు గ్లోజీ బ్లాక్ రియర్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.

వెంటో స్పోర్ట్ ఎడిషన్‌లోని ఇంటీరియర్ అప్‌డేట్స్ గురించి ఎలాంటి సమాచారం లేదు. స్పోర్టీ సెడాన్ వెంటో టాప్ ఎండ్ వేరియంట్ హైలైన్ ప్లస్‌లో మాత్రమే లభించే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ వేరియంట్లో నిండైన ఫీచర్లు ఉన్నాయి. ఫాక్స్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు సీట్లు, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ మరియు ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రివర్స్ కెమెరా మరియు మిర్రర్ లింక్ కనెక్టివిటి గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

భద్రత పరంగా వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం వంటి ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి.

వోక్స్‌వ్యాగన్ వెంటో టాప్ ఎండ్ వేరియంట్లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్ సెడాన్‌లో రెగ్యులర్ వెర్షన్ వెంటో నుండి సేకరించిన అవే ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. వెంటో స్పోర్ట్ ఎడిషన్‌లోని 1.2-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 103బిహెచ్‌పి పవర్ మరియు 174ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

వోక్స్‌వ్యాగన్ వెంటో మరొక పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే 1.6-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ 103బిహెచ్‌పి పవర్ మరియు 153ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

వెంటో స్పోర్ట్ ఎడిషన్ శక్తివంతమైన డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతోంది. 1.5-లీటర్ కెపాసిటి గల టిడిఐ డీజల్ ఇంజన్ యూనిట్ 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‍‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యమవుతోంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

ప్రస్తుతం, వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 12.62 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 13.87 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

అయితే, వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 13 లక్షలు మరియు డీజల్ వెర్షన్ ధర రూ. 14 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ వెంటో స్పోర్ట్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ ఇటీవల కంపెనీ ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద సరికొత్త వెంటో (వర్చస్)సెడాన్ కారును ఆవిష్కరించింది. అయితే, భారత్‌కు అదే పిక్యూ25 ఫ్లాట్‌ఫామ్ ఆధారిత వెంటో కారును ఖరారు చేసింది.

హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా మిడ్ సైజ్ సెడాన్ కార్లు అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదలయ్యేసరికి, పోటీదారులతో బరిలో నిలిచేందుకు వోక్స్‌వ్యాగన్ తమ వెంటో స్పోర్ట్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది.

English summary
Read In Telugu: Volkswagen Vento Sport Edition Revealed: Expected Launch Date, Price, Specs, Features & Images
Story first published: Monday, March 5, 2018, 15:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark