Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ మూడు లగ్జరీ కార్లను భారత్‌లోనే తయారు చేస్తాం: వోల్వో ఇండియా
స్వీడిష్ దేశానికి చెందిన విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ వోల్వో తమ వి90 క్రాస్ కంట్రీ ఎస్‌యూవీని ప్రాంతీయంగా ఉత్పత్తి చేయడానికి సిద్దమైంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, వి90 క్రాస్ కంట్రీ పూర్తి స్థాయి ప్రొడక్షన్ భారత్‌లోనే జరగనుంది. ఎక్స్‌సి90 తో పాటు వి90 క్రాస్ కంట్రీ ప్రొడక్షన్ చేపట్టనుంది.

బెంగళూరులోని హోస్కేటె సమీపంలో ఉన్న వోల్వో వాణిజ్య వాహనాల తయారీ కేంద్రానికి ప్రక్కనే ప్రస్తుతం వోల్వో ప్యాసింజర్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. అసంపూర్తిగా అసెంబుల్ చేసిన కార్ల విడిపరికరాలను దిగుమతి చేసుకుని వోల్వో తమ స్కేలబుల్ ఫ్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్(SPA) మీద పూర్తి స్థాయిలో అసెంబుల్ చేసి విక్రయిస్తోంది.


ఈ ప్లాంటులో వి90 క్రాస్ కంట్రీ, ఎస్90 సెడాన్ మరియు ఎక్స్‌సి60 ఎస్‌యూవీల ఉత్పత్తిని వోల్వో కొత్తగా చేపట్టనుంది. వోల్వో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఛార్లెస్ ఫ్రంప్ మాట్లాడుతూ, "ఇక మీద ఎస్90, వి90 క్రాస్ కంట్రీ మరియు ఎక్స్‌సి 60 కార్లను SPA వేదిక మీద నిర్మించనున్నట్లు" స్పష్టం చేశారు.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ ఎస్టేట్ లగ్జరీ కారులో 2-లీటర్ల టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 225బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బార్గ్-వార్న్ కంపెనీ నుండి సేకరించిన ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను వి90 క్రాస్ కంట్రీలో తప్పనిసరిగా అందించింది.

ప్రస్తుతం భారత్‌లో వోల్వో వి90 క్రాస్ కంట్రీ ధర రూ. 60 లక్షలు ఎక్స్-షోరూమ్(హైదరాబాద్)గా ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశీయంగానే తయారు చేస్తుండటంతో దిగుమతి చేసుకునే మోడళ్ల కంటే, దేశీయంగా తయారయ్యే మోడళ్ల మీద ట్యాక్స్ చాలా వరకు తక్కువ. కాబట్టి వోల్వో వి90 క్రాస్ కంట్రీ ధరలు భారీగా దిగిరానున్నాయి.
Trending On DriveSpark Telugu:
మారుతికి గట్టి షాక్, ప్రతి కారుకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్
బుల్లెట్ బైకులో రివర్స్ గేర్ అమర్చిన ఈయన తెలివికి జోహార్లు
అత్యధికంగా గూగుల్ చేసిన టాప్ 10 కార్లు

పోటీతత్వం గల ధర నిజంగా స్వీడన్ కంపెనీకి ఇండియాలో సేల్స్ పరంగా బాగా కలిసిరానుంది. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, జాగ్వార్, ల్యాండ్ రోవర్ మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి దిగ్గజ లగ్జరీ సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తులను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు వోల్వో కూడా వీటి సరసన చేరింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వోల్వో వి90 క్రాస్ కంట్రీ ఎస్టేట్ సెగ్మెంట్‌కు చెందిన కారు. విపణిలో ఈ సెగ్మెంట్లో ఉన్న ఏకైక మోడల్ ఇదే. అందులోను దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. అత్యంత పోటీతత్వమున్న ధరతో అందుబాటులోకి వస్తే, ఈ ధరల శ్రేణిలో ఉన్న ఇతర లగ్జరీ కార్లకు ఇది గట్టి పోటీనివ్వడం ఖాయం.
Trending DriveSpark Telugu YouTube Videos