TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
2018 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో మారుతి స్విఫ్ట్: టాప్ 3 కార్లు ఇవే!!
స్విట్జర్లాండులో జరుగుతున్న 2018 జెనీవా మోటార్ షోలో, వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించారు. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2018లో టాప్ 3 రేంజ్ రోవర్ వెలార్, మజ్దా సిఎక్స్-5 మరియు వోల్వో ఎక్స్‌సి60 నిలిచాయి.


పలు కెటగిరీల క్రింది ఎన్నో కార్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇందులో అర్బన్ కార్ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నామినేట్ అయ్యింది, అవార్డు దక్కించుకుంది. ప్రతిష్టాత్మక 2018 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల జాబితాలో నామినేట్ అయిన కార్లు మరియు అవార్డులకు ఎంపికైన కార్లు ఏవి ఉన్నాయో చూద్దాం రండి...
న్యూయార్క్ మోటార్ షోలో వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ విన్నర్‌తో పాటు 2018 అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలను కూడా ప్రకటించనున్నారు.
అదే విధంగా, ఇతర కెటగిరీలైన వరల్డ్ పర్ఫామెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో తుది జాబితాలో ఎంపికైన విజేతలను వెల్లడించనున్నారు.
ప్రస్తుతానికి, ఆరు విభిన్న కెటగిరీలలో టాప్ మూడు కార్లు ఎంపిక చేశారు. 24 దేశాల నుండి 82 మంది అంతర్జాతీయ ఆటోమొబైల్ జర్నలిస్టులు జ్యూరీ సభ్యులు ప్రతి కెటగిరీలో మూడు కార్లను తుది పోటీలకు ఎంపిక చేశారు.
2018 వరల్డ్ కార్
- మజ్దా సిఎక్స్-5
- రేంజ్ రోవర్ వెలార్
- వోల్వో ఎక్స్‌సి60
2018 వరల్డ్ అర్బన్ కార్
- ఫోర్జ్ ఫియస్టా
- సుజుకి స్విఫ్ట్
- వోక్స్‌వ్యాగన్ పోలో
2018 వరల్డ్ లగ్జరీ కార్
- ఆడి ఏ8
- పోర్షే కయీన్
- పోర్షే పానమెరా
2018క వరల్డ్ పర్ఫామెన్స్ కార్
- బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5
- హోండా సివిక్ టైప్ ఆర్
- లెక్సస్ ఎల్‌సి500
2018 వరల్డ్ గ్రీన్ కార్
- బిఎమ్‌డబ్ల్యూ 530ఇ ఐ పర్ఫామెన్స్
- క్రిస్లర్ పసిఫికా హైబ్రిడ్
- నిస్సాన్ లీఫ్
2018 వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్
- లెక్సస్ ఎల్‌సి 500
- రేంజ్ రోవర్ వెలార్
- వోల్వో ఎక్స్‌సి60