అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

నగరీకరణ పెరగడంతో పట్టణాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. సిటీలో కనీసం ఓ పది కిలోమీటర్లు వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో డ్రైవింగ్ చాలా కష్టం. వేగానికి అనుగుణంగా గేర్లు మార్చుతూనే ఉండాలి. ఇలా చేయడంలో చిరాకు రావడమే కాకుండా ఇంజన్, గేర్‌బాక్స్ ఇలా మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది.

వీటన్నింటికీ ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం గేర్లు మనం మార్చకుండా వేగాన్ని బట్టి దానికదే గేర్లు మార్చుకునే సిస్టం. సింపుల్‌గా చెప్పాలంటే ఆటోమేటెడ్ మ్యాన్యుల్ ట్రాన్స్‌మిషన్ (AMT).

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కార్లలో ముందుకు మరియు రివర్స్ రెండు గేర్లు మాత్రమే ఉంటాయి. ఆటోమేటిక్ కార్ల వలన డ్రైవింగ్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నవారిలో భయం కూడా పోతుంది. గేర్ మార్చిన తర్వాత నెమ్మదిగా క్లచ్ వదులుతూ.. యాక్సిలరేషన్ నెమ్మదిగా పెంచాలి అప్పుడే ఇంజన్ ఆఫ్ కాకుండా కారు చక్కగా ముందుకెళుతుంది. కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్లకు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కంటే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్లు ఎంతగానో సహాయపడతాయి.

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే కార్లు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి, ఇలాంటి గేర్‌బాక్స్ కేవలం ఖరీదైన కార్లలో మాత్రమే ఉంటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే అపోహ మాత్రమే.. నిజం ఏ మాత్రం కాదు. అత్యంత సరసమైన ధరలో లభించే టాప్-10 బెస్ట్ ఆటోమేటిక్ కార్ల వివరాలను డ్రైవ్‌స్పార్క్ టీం మీకోసం తీసుకొచ్చింది. ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

10. టాటా టిగోర్

ఇండియాలో లభించే అత్యుత్తమ, చీపెస్ట్ సెడాన్ కార్లలో టాటా టిగోర్ ఒకటి. టిగోర్ స్టైలిష్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ కారును గత ఏడాది పలు నూతన ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే టాటా టిగోర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తోంది.

టాటా టిగోర్ రివట్రాన్ (పెట్రోల్) XMA బేస్ వేరియంట్ రూ. 6.40 లక్షల ధరతో లభిస్తోంది

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

09. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

టాప్ 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్ల జాబితాలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ కన్వెన్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించే ఏకైక మోడల్ ఇదే. మిగతా మోడళ్లన్నీ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి ఉన్నాయి. కానీ రెండు గేర్‌బాక్సుల పనితీరు ఒకేలా ఉంటుంది. గ్రాండ్ ఐ10 విషయానికి వస్తే మ్యాగ్నా ఏటీ 1.2 వేరియంట్ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. వచ్చే ఏడాది గ్రాండ్ ఐ10 నెక్ట్స్ జనరేషన్ మోడల్‌ను లాంచ్ చేయనున్నారు.

హ్యందాయ్ ఐ10 టార్క్ కన్వర్టర్ (డీజల్) మ్యాగ్నా AT వేరియంట్ రూ. 6.52 లక్షల ధరతో లభిస్తోంది

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

08. మారుతి సుజుకి ఇగ్నిస్

సిటీ కస్టమర్లను టార్గెట్ చేసుకుని టాల్ బాయ్ డిజైన్‌తో వచ్చిన స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి ఇగ్నిస్. మారుతి ఇగ్నిస్ అనుకున్న టార్గెట్‌ను మిస్ అయినప్పటికీ, ఆశించిన ఫలితాలే సాధిస్తోంది. మారుతి సుజుకి ఇగ్నిస్ కేవలం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ డెల్టా బేస్ వేరియంట్ ధర రూ. 5.87 లక్షలు

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

07. టాటా టియాగో

టాటా మోటార్స్ ప్రస్తుతం అత్యధికంగా విక్రయిస్తున్న కార్లలో టియాగో మొదటి స్థానంలో ఉంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర హ్యాచ్‌బ్యాక్ కార్లకు గట్టి పోటీనిస్తోంది. టాటా టియాగో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. టాటా టియాగో బేస్ వేరియంట్ XZA వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

టాటా టియాగో రివట్రాన్(పెట్రోల్) XZA వేరియంట్ ధర రూ. 5.60 లక్షలు

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

06. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్

మారుతి సుజుకి సరికొత్త వ్యాగన్-ఆర్ కారును ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. పాత వ్యాగన్-ఆర్‌తో పోల్చితే విశాలమైన క్యాబిన్, అత్యాధునిక ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజన్ దీని సొంతం. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభించే వ్యాగన్-ఆర్ LXi వేరియంట్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది.

మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ LXi 1.0 AMT వేరియంట్ ధర రూ. 5.26 లక్షలు

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

05. హ్యుందాయ్ శాంట్రో

కొన్నేళ్ల క్రితం మార్కెట్ నుండి శాశ్వతంగా తొలగించిన శాంట్రో కారును 2018 చివర్లో మార్కెట్లోకి మళ్లీ లాంచ్ చేసింది. ఏదేమైనప్పటికీ శాంట్రో సేల్స్ ఫలితాలు హ్యుందాయ్ ఆశించిన మేర సాధించలేదు. శాంట్రో ఆటోమేటిక్ వేరియంట్ విషయానికి వస్తే, బేస్ వేరియంట్ మ్యాగ్నా AMT 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది.

హ్యుందాయ్ శాంట్రో పెట్రోల్ మ్యాగ్నా AMT వేరియంట్ ధర రూ. 5.21 లక్షలు

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

04. మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి సెలెరియో ఇండియన్ మార్కెట్లోకి పరిచయమైన అత్యంత సరసమైన మరియు బెస్ట్ ఆటోమేటిక్ కారు. ఎంట్రీల లెవల్ హ్యాచ్‌‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి సెలెరియో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. సెలెరియోలో డీజల్ వేరియంట్ల ఉత్పత్తిని నిలిపివేయడంతో కేవలం 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది.

మారుతి సుజుకి సెలెరియో కె10 పెట్రోల్ VXi AMT వేరియంట్ ధర రూ. 5.13 లక్షలు

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

03. మారుతి సుజుకి ఆల్టో కె10

ఇప్పుడిక భారతదేశపు మోస్ట్ పాపులర్ మరియు బెస్ట్ సెల్లింగ్ కారు వంతు. మారుతి ఆల్టో ఎన్నో ఏళ్ల పాటు అత్యధిక విక్రయాలు సాధిస్తున్న కారుగా మొదటి స్థానంలో నిలిచింది. 1.0-లీటర్ కె10 సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో లభించే ఆల్టో కె10 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. తొలిసారిగా కారును ఎంచుకునే కస్టమర్లు, మహిళలు, కాలేజీ యువత తొలుత ఈ ఆల్టో కె10 కారును కొనుగోలు చేస్తున్నారు.

మారుతి సుజుకి ఆల్టో కె10 VXi AMT వేరియంట్ ధర రూ. 4.43 లక్షలు

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

02. రెనో క్విడ్

ఫ్రెంచ్ దిగ్గజ రెనో దేశీయ మార్కెట్లోకి క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును ప్రవేశపెట్టి తీవ్ర అలజడి సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే మారుతి ఆల్టో మోడల్‌కు తీవ్ర పోటీని సృష్టించింది. రెనో క్విడ్ 800సీసీ మరియు 1.0-లీటర్ ఇంజన్ ఆప్షన్‌‌లో లభిస్తుండగా, కేవలం 1-లీటర్ ఇంజన్‌తో మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తోంది.

రెనో క్విడ్ 1.0 RXT AMT Optional వేరియంట్ ధర రూ. 4.50 లక్షలు

అత్యంత సరసమైన ధరలో లభించే 10 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

01. డాట్సన్ రెడి-గో

భారతదేశపు అత్యంత సరసమైన ఆటోమేటిక్ కారుగా డాట్సన్ రెడి-గో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన సరసమైన కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ రెడి-గో స్మాల్ కారును 800సీసీ ఇంజన్‌తో తొలి ఉత్పత్తిని విడుదల చేయగా, మార్కెట్ అవసరాల దృష్ట్యా 1.0-లీటర్ ఇంజన్‌తో కూడా లాంచ్ చేసింది. 1-లీటర్ రెడి-గో కారును 5-స్పీడ్ మ్యాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చి ఇండియా యొక్క చీపెస్ట్ ఆటోమేటిక్ కారుగా నిలిపింది.

డాట్సన్ రెడిగో 1.0 T(O) AMT వేరియంట్ ధర రూ. 4.19 లక్షలు

గమనిక: అన్ని వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి. ప్రాంతాలు మరియు డీలర్లను బట్టి వేరియంట్లు మరియు ధరలలో వ్యత్యాసం ఉండవచ్చు.

Most Read Articles

Read more on: #టాప్ 10 #top 10
English summary
10 Most Affordable Automatic Transmission Cars OF India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X