Just In
Don't Miss
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Sports
మ్యాక్సీనా మజాకానా.. సిక్స్ కొడితే సీటుకే బొక్క!
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతీ సుజుకి ఎర్టిగా కి పోటీగా కొత్త ఎంపివి తీసుకురానున్న హ్యుందాయ్
హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లో ఇప్పటికే వారి వెన్యూ మరియు గ్రాండ్ ఐ 10 నియోస్ వంటి వరుస లాంచ్ లతో విజయవంతంగా నడుస్తోంది అయితే తాజాగా ఈ సంస్థ తెలియచేసిన విషయం ఏమిటంటే భారతమార్కెట్లో ఎప్పుడు ఎంపివి హవా నడుస్తోందని, దీనికి తగ్గట్టుగా పోటీని ఎదురుకోవడానికి, వారు కూడా ఎంపివి ని తీసుకురానున్నట్టు తెలియచేసారు. వివరాలలోకి వెళితే..

హ్యుందాయ్ ఇండియా దేశీయ మార్కెట్లో కొత్త ఎంపివి ని పరిచయం చేయడం గురించి ఆలోచిస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం మార్కెట్లను అధ్యయనం చేయడం, మూల్యాంకనం చేయడం, అన్వేషించడం వంటి ప్రక్రియల్లో ఉంది. డిమాండ్ బలంగా ఉంటే ఎంపివి సెగ్మెంట్లో తాయారు చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

2021 సంవత్సరంలో ఈ ఎంపివి ప్రారంభించాలని కంపెనీ ఆలోచిస్తోంది. దక్షిణ కొరియా ఆధారిత ఆటో దిగ్గజం భారత మార్కెట్లో అత్యధిక సెగ్మెంట్లలో ఉంది, ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా ఉంది.

ఈ సంస్థ దేశీయంగా వివిధ సెగ్మెంట్ల వారీగా అనేక అధ్యయనాలు, పరిశోధనలు నిర్వహిస్తోందని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ఎస్ కిమ్ తెలిపారు.

హ్యుందాయ్ వారి లేటెస్ట్ ఆఫరింగ్, గ్రాండ్ ఐ10 నియోస్ విడుదల సమయంలో ఈ ప్రకటన చేసారు. హ్యుందాయ్ ఆటో ఎక్స్ 2012 లో హెక్సా స్పేస్ ఎంపివి కాన్సెప్ట్ ను ప్రదర్శించారు, అయితే ఈ వేహికల్ ను ఎన్నడూ కూడా ఉత్పత్తి చేసినట్లు చూడలేదు.

హెక్స స్పేస్ ను తిరిగి ఎంపివి సెగ్మెంట్ లో మొదటి ఆఫరింగ్ గా ప్రారంభించాలని అనుకుంటున్నాను. సంబంధిత వార్తల్లో కంపెనీ హ్యుందాయ్ క్రెటా అప్గ్రేడ్ చేసే ప్రక్రియలో ఉందని, అయితే మార్కెట్ పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు వాహనాన్ని లాంచ్ చేస్తామని చెప్పారు.
Most Read: భారత దేశంలోని రాష్ట్ర పోలీస్ ఫోర్స్ ఉపయోగించే ఆధునిక కార్లు ఇవే

కొత్తగా వెలువడిన పుకారులలో ఇది ఆటో ఎక్స్ పో 2020 లో కొత్త క్రెటా ఆవిష్కరించబడుతుంది. హ్యుందాయ్ తన వద్ద ఉన్న అన్ని వాహనాలపై బిఎస్-6 ఉద్గరా నిబంధనలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసే దిశగా కూడా పనిచేస్తోంది.
Most Read: కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన గ్రాండ్ ఐ10 నియోస్ మొదటి కారుగా బిఎస్-6 పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ గురించి వివరాలను తెలుసుకోవడానికి- ఇక్కడ క్లిక్ చేయండి.
Most Read: అన్ని మోడల్లపై బిఎస్-6 ఇంజన్ల తీసుకురానున్న హ్యుందాయ్

హ్యుందాయ్ వరుస లాంచ్ లతో బిజీగా ఉందని తెలుస్తోంది. వారు వెన్యూ తో ప్రారంభించి, తరువాత గ్రాండ్ ఐ10 నియోస్, తరువాత వారి క్రెటా ఫేస్‌లిఫ్ట్ ను లాంచ్ చేసే పనిలో ఉన్నారు.