సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న సెల్టోస్ ఎస్‌‌‌యూవీని ఎట్టకేలకు విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కియా సెల్టోస్ ఎస్‌యూవీని సంచలనాత్మక ధరతో ప్రవేశపెట్టింది. కియా సెల్టోస్ దేశీయ విపణిలో విడుదలకు ముందే ఏకంగా 32,000 బుకింగ్స్ నమోదు చేసుకుంది, బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు కూడా ప్రారంభించింది.

కేవలం 9.69 లక్షల రూపాయల ప్రారంభ ధరతో విడుదలైన కియా సెల్టోస్ ఎస్‌యూవీలో ఎవ్వరూ ఊహించని విధంగా నమ్మశక్యంగాని ఎన్నో అధునాతన ఫీచర్లను అందించింది. కియా సెల్టోస్ తప్పనిసరిగా ఎంచుకోవాలని చెప్పే అతి కీలకమైన ఫీచర్ల గురించి ఇవాళ్టి కథనంలో స్పష్టంగా తెలుసుకుందాం రండి...

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

కియా మోటార్స్ తమ మొట్టమొదటి ఉత్పత్తి కియా సెల్టోస్ ఎస్‌‌యూవీని అత్యంత చాకచక్యంగా, పటిష్టమైన ప్రణాళికతో ప్రవేశపెట్టింది. పోటీదారులను ధీటుగా ఎదుర్కునేందుకు రెండు ప్రధాన వేరియంట్లు మరియు వాటిలో 16 సబ్-వేరియంట్లుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ రకాల ఇంజన్ మరియు గేర్‌బాక్స్ వారీగా ఈ వేరియంట్లను విభజించింది.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

ఇంజన్ మరియు గేర్‌బాక్స్ వారీగా వేరియంట్ల మధ్య తేడా ఉన్నప్పటికీ అన్ని ఫీచర్లలో దాదాపు అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి ఫీచర్లు (Segment-First), ఈ శ్రేణిలోనే అత్యుత్తమ ఫీచర్లు (Best-In-Class) మరియు వరల్డ్‌లోనే మొదటిసారిగా పరిచయమైన (Worlds-First) ఫీచర్లు కియా సెల్టోస్‌లో ఉన్నాయి.

కియా సెల్టోస్‌లో ఉన్నటువంటి టాప్-5 ఫీచర్లు ఇవే...

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

UVO కనెక్టెడ్ యాప్

స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికీ లైఫ్‌లో సర్వసాధారణమయ్యేసరికి ప్రతిపనీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారానే అయిపోతోంది. కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు UVO కనెక్టెడ్ యాప్ ప్రవేశపెట్టింది.

UVO యాప్ మొత్తం 37 రకాల పనులు చేస్తుంది. వెహికల్ లైవ్ స్టేటస్, జియో ఫెన్సింగ్, వెహికల్ లైవ్ లొకేషన్, వాయిస్ కమాండ్స్, రిమోట్ ద్వారా ఏసీ పనిచేయడం, వెహికల్ పనితీరును గుర్తించడం, వెహికల్ ఆరోగ్యానికి సంభందించిన అలర్ట్స్, 24X7 ఎమర్జెన్సీ సహాయం ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

UVO కనెక్టెడ్ టెక్నాలజీలో డ్రైవర్ పనిని మరింత మెరుగుపరిచే ఫీచర్లు కూడా ఉన్నాయి. లైవ్ ట్రాఫిక్ సమాచారం, డ్రైవర్ డ్రైవింగ్ ప్రవర్తన, ట్రిప్పులకు సంభందించిన సమాచారం, అంతర్గత న్యావిగేషన్ వ్యవస్థ మరియు వాయిస్ కమాండ్ అసిస్ట్ ఫీచర్లతోపాటు ఎన్నో సేవలని ఈ అప్లికేషన్ అందిస్తోంది.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

సెగ్మెంట్లోనే తొలిసారిగా పరిచయమైన ఫీచర్లు

కియా సెల్టోస్ నిండైన ఫీచర్లతో వచ్చిన ఎస్‌యూవీ మరియు సెగ్మెంట్లోనే తొలిసారిగా పరిచయమైన ఫీచర్లతో వచ్చిన మోడల్‌గా కియా సెల్టోస్ గురించి చర్చించుకోవచ్చు. డ్రైవర్ దృష్టిని మరల్చకుండా అద్భుతంగా రూపొందించిన 8-అంగుళాల హెడ్స్-అప్-డిస్ల్పే (HUD) ఇందులో వచ్చింది. అంతే కాకుండా ఇందులో న్యావిగేషన్ సపోర్ట్ గల 10.25-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా కలదు. హైవే మీద ఒక లైన్ లేన్ నుండి మరో లేన్‌లోకి మారేటప్పుడు స్పష్టమైన విజన్ అందించేందుకు బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కియా సెల్టోస్ సొంతం.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

కియా సెల్టోస్ ఎస్‌యూవీలో ప్రపంచపు మొట్టమొదటి "స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్" అందించారు. ఇది క్యాబిన్ లోపలి వాతావరణంలో ఉండే గాలిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతుంది. అంతే కాకుండా పలురకాల సువాసనలతో కూడా పరిమళాన్ని వెదజల్లుతుంది. కియా సెల్టోస్ టాప్ ఎండ్ వేరియంట్లలో వెంటిలేషన్ గల ఫ్రంట్ సీట్లు, ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ సౌలభ్యమైన ప్రయాణం కోసం సౌకర్యవంతమైన సీట్లను అందించారు.

Most Read:కొత్త రోడ్డు స్కామ్ బయట పడింది..జాగ్రత్తగా ఉండండి

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

UVO కనెక్టెడ్ సిస్టమ్ మీకు నచ్చిన పాటలతో మీ కారును డాన్స్ చేయించవచ్చు. కియా సెల్టోస్‌లోని సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే, 8-స్పీకర్ల బాస్ (BOSE) సరౌండ్ సౌండ్ సిస్టమ్ కలదు. ఆంబియంట్ లైటింగ్, మూడ్ లైటింగ్ మరియు ఎల్ఈడీ సౌండ్ వంటివి ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లో మీ స్మార్ట్ ఫోన్‌ను వైర్-లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Most Read:దారుణంగా మోసపోయాం... జావా కంపెనీపై మండిపడుతున్న కస్టమర్లు

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

సెల్టోస్ సేఫ్టీ ఫీచర్లు

కియా మోటార్స్ తమ సెల్టోస్ ఎస్‌యూవీలో భద్రత పరమైన ఫీచర్లకు పెద్దపీట వేసింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ముందువైపున డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లను సెల్టోస్ లభించే 16 విభిన్న వేరియంట్లలో తప్పనిసరిగా అందించింది. వీటితో బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీల కెమెరా కూడా ఉన్నాయి.

Most Read:మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే అంతే ఇక...!

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్-హోల్డ్ అసిస్ట్, హై స్ట్రక్చర్ సేఫ్టీ, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ ఉన్నాయి. సేఫ్టీ గురించి మాట్లాడితే.. అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి 24 గంటల కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లు

కియా సెల్టోస్ ఎస్‌యూవీ మూడు రకాల విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి,

  • 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్: 115బిహెచ్‌పి పవర్ - 144ఎన్ఎమ్ టార్క్
  • 1.5-లీటర్ డీజల్ ఇంజన్: 114బిహెచ్‌పి పవర్ - 250ఎన్ఎమ్ టార్క్
  • 1.4-లీటర్ టీ-జిడిఐ పెట్రోల్ ఇంజన్: 140బిహెచ్‌పి పవర్ - 242ఎన్ఎమ్ టార్క్

1.4-లీటర్ టి-జిడిఐ ఇంజన్ కేవలం జిటి లైన్ వేరియంట్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. మూడు ఇంజన్‌లు కూడా ఏప్రిల్ 202 నుండి అమల్లోకి రానున్న బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటిస్తాయి.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

కియా సెల్టోస్ లభించే అన్ని ఇంజన్ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తోంది. అదనంగా మరో మూడు రకాల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లను అందిస్తోంది. మొత్తం నాలుగు రకాల గేర్‌బాక్స్‌లలో లభించడం సెగ్మెంట్లోనే తొలిసారి.

  • 1.5-లీటర్ డీజల్: 6-స్పీడ్ ఆటోమేటిక్ (AT)
  • 1.5-లీటర్ పెట్రోల్: 6-స్పీడ్ ఐవిటి (IVT)
  • 1.4-లీటర్ టి-జిడిఐ పెట్రోల్: 7-స్పీడ్ డీసీటీ (DCT)

పైన పేర్కొన్న మూడు ఇంజన్‌లు ఆయా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

ధరలు

ఎన్నో రకాల ఫీచర్లతో నిండిన కియా సెల్టోస్ ఎస్‌యూవీ ధరలను అత్యంత చాకచక్యంగా.. పోటీగా నిర్ణయించారు. సెల్టోస్ ప్రారంభ ధర రూ. 9.69 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.66 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా) ఖరారు చేశారు.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

పోటీ

అత్యంత పోటీతత్వంతో కూడిన ధరలు, నమ్మశక్యంగాని ఫీచర్లతో కియా సెల్టోస్ పోటీదారులకు చుక్కలు చూపిస్తోంది. మిడ్-సైజ్ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, టాటా హ్యారీయర్, మహీంద్రా ఎక్స్‌యూవీ500, ఎంజీ హెక్టర్, జీప్ కంపాస్ మరియు నిస్సాన్ కిక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

కియా సెల్టోస్ ఎస్‌యూవీనే ఎందుకు ఎంచుకోవాలనే ప్రశ్నకు పైన పేర్కొన్నవి మాత్రమే కాదు.. ప్రతి అంశం పరంగా కియా సెల్టోస్ బెస్ట్ అని నిరూపించుకుంది. అవును ఒక్కొక్కరికీ ఒక్కో రంగు ఇష్టం.. ఈ అంశంలో కూడా కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా పలురకాల రంగుల్లో సెల్టోస్‌ను అందిస్తున్నారు. సింగల్-టోన్ కలర్ స్క్రీమ్‌లో- ఎరుపు, నారింజ, గ్లేసియర్ వైట్, క్లియర్ వైట్, సిల్వర్ బ్లూ మరియు బ్లాక్ అదే విధంగా డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో- రెడ్/బ్లాక్, గ్లేసియర్ వైట్/బ్లాక్, సిల్వర్/బ్లాక్ మరియు గ్లేసియర్ వైట్/ఆరేంజ్ రంగుల్లో సెల్టోస్ ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు.

సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా సెల్టోస్ ఎస్‌యూవీని చూడగానే ప్రేమలో పడతారు.. కానీ, ఇది లభించే వేరియంట్లు, ఫీచర్లు, ఇంజన్, ట్రాన్స్‌మిషన్, ఇంటీరియర్, సేఫ్టీ, దీని ధరలు మరియు లభించే రంగులు అంశాల పరంగా చూస్తే ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా సెల్టోస్ ఎస్‌యూవీని మించిన మోడల్ లేదని ఒప్పుకోవాల్సిందే.

మరి మన మేడిన్ ఆంధ్రా కారు మీకు నచ్చిందా..? క్రింది కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి!

Most Read Articles

English summary
Kia Seltos Top Features: Here Are The Key Features Available On The Kia Seltos SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X