కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ భారతదేశపు తమ మొట్టమొదటి కార్ల తయారీ ప్లాంటును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తొలి కారును విపణిలోకి ఆవిష్కరించారు. అతి త్వరలో విడుదల కానున్న కియా సెల్టోస్ వేరియంట్లు మరియు డీజల్ వెర్షన్ గురించి పాఠకుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

ఇవాళ్టి కథనంలో కియా సెల్టోస్ డీజల్ వేరియంట్ల గురించి స్పష్టంగా తెలుసుకుందా రండి..

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీ జీటీ లైన్ వేరియంట్లను ప్రస్తుతం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే ఆవిష్కరించింది. కానీ తాజాగా అందిన సమాచారం మేరకు, సెల్టోస్ జీటీ లైన్ వేరియంట్లను డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా పరిచయం చేయనున్నట్లు తెలిసింది.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

కియా సెల్టోస్ విడుదల సమయానికల్లా జీటీ లైన్ డీజల్ వేరియంట్లను అధిక మొత్తంలో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కియా విక్రయ కేంద్రాల్లో దీనిని టెస్ట్ డ్రైవ్ చేసేందుకు కస్టమర్లకు అందుబాటులో ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

అత్యంత ఆకర్షణీయమైన డిజైన్, నాణ్యమైన పార్ట్స్ మరియు అత్యాధునిక ప్రమాణాలతో వచ్చిన కియా సెల్టోస్ ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఇదే సెగ్మెంట్లో తీవ్ర పోటీ ఉన్నది వాస్తమే.. కానీ పోటీని ఎదుర్కొని సక్సెస్ అయ్యేందుకు కియా సెల్టోస్ లోని పలు అంశాలు కీలకంగా నిలిచాయి.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

కియా సెల్టోస్ ఎస్‌యూవీని విభిన్న ఇంజన్, గేర్‌బాక్స్ మరియు వేరియంట్లతో పాటు వాటికి అనుగుణంగా కావాల్సిన ఫీచర్లను మాత్రమే ఎంచుకోవడమే కాకుండా.. ఆయా ఎంచుకున్న ఫీచర్లకు తగ్గట్లుగా ధరలు కూడా నిర్ణయించబడతాయి. ఇప్పటి వరకు కస్టమర్లకు ఇటువంటి పూర్తి స్వేచ్ఛను కలిగించింది కియా మాత్రమే కాబోలు.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

కియా సెల్టోస్ ఎస్‌యూవీ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, టెక్ లైన్ (Tech Line) మరియు జీటీ లైన్ (GT Line). వీటిని వరుసగా మరో నాలుగు సబ్-వేరియంట్లుగా విభజించారు. అవి, HTW, HTK, HTK+, HTX, HTX+ మరియు GTK, GTX, GTX+.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

టెక్ లైన్ క్రింద లభించే అన్ని సబ్-వేరియంట్లు టుర్భో-డీజల్ లేదా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తున్నాయి. 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 115బిహెచ్‌పి పవర్ మరియు 144ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

టెక్-లైన్ క్రింద ఉన్నటువంటి వేరియంట్లు 1.5-లీటర్ టుర్భో-డీజల్ ఇంజన్‌తో కూడా లభిస్తున్నాయి. 115బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

Most Read: కియా సెల్టోస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ : ఆంధ్ర రాష్ట్రంలో తయారైన తొలి కార్

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

కియా సెల్టో మరో విభాగం జిటి లైన్ (GT Line) వేరియంట్లు. ఇవి అత్యతం కఠినమైన ఎస్‌యూవీలు. వీటిలో 140బిహెచ్‌పి పవర్ మరియు 242ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.4-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ కలదు. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో సెలక్ట్ చేసుకోవచ్చు.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

కియా సెల్టోస్ రెండు కీలక వేరియంట్లు మరియు మొత్తం తొమ్మిది సబ్-వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటన్నింటిని కూడా విభిన్న ఇంజన్లు, రకరకాల గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు. వీటికి తగ్గట్లుగానే ఆయా మోడల్ ధర డిసైడ్ అవుతుంది. అదే విధంగా అదనపు ఫీచర్లను పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం ద్వారా సెల్టోస్ ఎస్‌యూవీ ధరను మీరే నిర్ణయించుకోవచ్చు.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

సేఫ్టీ పరంగా కియా సెల్టోస్ ఎస్‌యూవీలో సైడ్ మరియు కర్టన్ ఎయిర్ బ్యాగులు, 360-డిగ్రీలో పర్యవేక్షించే కెమెరా, గుర్తించడానికి సాధ్యం కాని మలుపులను కనిపెట్టే టెక్నాలజీ, హెడ్స్-అప్ డిస్ల్పే మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

జీటీ లైన్ వేరియంట్లలో లభించే ఈ ఫీచర్లతో పాటు డీజల్ ఇంజన్ ఎంచుకోవాలంటే ప్రస్తుతం డీజల్ వేరియంట్ ఈ ఫీచర్లతో పాటు అందుబాటులో లేదు. దీంతో, కియా ఇండియా ఇప్పుడు జీటీ లైన్ వేరియంట్లలో కూడా డీజల్ ఇంజన్‌ను త్వరలో అందివ్వాలని భావిస్తోంది.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

జీటీ లైన్ విభాగంలో ఉన్నటువంటి టాప్ ఎండ్ వేరియంట్ GTX+ లో మాత్రమే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ అందిస్తున్నట్లు సమాచారం. జీటీ లైన్ మరియు టెక్ లైన్ రెండింటి మధ్య ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు ఫీచర్లతో పాటు గుర్తించదగిన పలు ఎక్ట్సీరియర్ గుర్తులు కూడా జోడిస్తోంది.

కియా సెల్టోస్ కొంటున్నారా? మీకోసం ముఖ్యమైన సమాచారం!

విడుదల మరియు ధర అంచనా

కియా మోటార్స్ తమ మొట్టమొదటి కారు సెల్టోస్ ఎస్‌యూవీని ఆగష్టు 22, 2018 న పూర్తి స్థాయిలో దేశీయ విపణిలోకి లాంచ్ చేయనుంది. దీని ధర సుమారుగా రూ. 10 లక్షల నుండి రూ. 17 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

Most Read Articles

English summary
Kia Seltos’ GT Line Variants Will Soon Come With Diesel Power. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X