లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల మీద నవంబర్ నెలకు గాను ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. మారుతి సియాజ్, ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు బాలెనో మోడళ్ల మీద ఇది వరకు లభించే ఆఫర్లను మరింత పొడగించింది. ఏయే మోడల్ మీద ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాం రండి...

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్ కారును 2014లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. గత ఏడాది దీనిని పలు మార్పులు చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకొచ్చారు. విశాలమైన మరియు శక్తివంతమైన సియాజ్ కారు 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్, 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లను మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు పెట్రోల్ వెర్షన్‌ను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా ఎంచుకోవచ్చు.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే సియాజ్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్ల మీద డిస్కౌంట్లు మరియు ఇతర లాభాల రూపంలో రూ. 70,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది, మరియు అన్ని టాప్ ఎండ్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 60,000 వరకు లాభాలు ఉన్నాయి. సియాజ్ ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 60,000 ఆఫర్లు ఉన్నాయి.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సియాజ్ డీజల్ వేరియంట్ల మీద కూడా బెస్ట్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. సియాజ్ పవర్‌ఫుల్ 1.5-లీటర్ డీజల్ వేరియంట్ల మీద ఏకంగా రూ. 70,000 లాభాలున్నాయి, సియాజ్ 1.3-లీటర్ వేరియంట్ల మీద అయితే అత్యధికంగా 1 లక్ష రూపాయల విలువైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఉన్నాయి. కస్టమర్లు అదనంగా ఐదేళ్ల ఉచిత వారంటీ లేదా దీనికి సమానమైన ఇతర ప్రయోజనాలను ఎంచుకోవచ్చు.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ ధరల శ్రేణి రూ. 8.20 లక్షల నుండి రూ. 11.38 లక్షల మధ్య (డిస్కౌంట్లు కాకుండా) ఎక్స్-షోరూమ్, ఇండియాగా ఉన్నాయి.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి ఎస్-క్రాస్ మార్కెట్లో లభించే పర్ఫెక్ట్ క్రాసోవర్ మోడల్. ఎత్తైన సీటింగ్ పొజిషన్ మరియు ఎస్‌యూవీ తరహా ఫీలింగ్ ఉండటంతో కస్టమర్లు దీనిని బాగానే ఎంచుకుంటున్నారు. మారుతి ప్రారంభించిన నెక్సా డీలర్లు మొట్టమొదటిగా విక్రయించిన మోడల్ ఎస్-క్రాస్ కావడం గమనార్హం.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి ఎస్-క్రాస్ క్రాసోవర్ 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది, దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. ఎస్-క్రాస్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్ల మీద గరిష్టంగా 95,0000 రూపాయలు అదే విధంగా ఎస్-క్రాస్ టాప్ ఎండ్ వేరియంట్లయిన జెటా మరియు ఆల్ఫా మీద గరిష్టంగా రూ. 85,000 విలువై డిస్కౌంట్లు మరియు లాభాలు ఉన్నాయి.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ మోడల్ ధరల శ్రేణి రూ. 8.81 లక్షల నుండి రూ. 11.44 లక్షల మధ్య (డిస్కౌంట్లు కాకుండా) ఎక్స్-షోరూమ్, ఇండియాగా ఉన్నాయి.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి ఇగ్నిస్ చూడటానికి ఒక ఫన్నీ హ్యాచ్‌బ్యాక్ కారులా ఉంటుంది. ఎంతో తేలికగా ఉండే ఇగ్నిస్ అంతే యాక్టివ్ మరియు శక్తివంతమైనది. మారుతి ఇగ్నిస్ ఏడు విభిన్నమైన వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్స్ మరియు అన్ని వేరియంట్లు ఒకే పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తున్నాయి.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి ఇగ్నిస్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోఎంచుకోవచ్చు.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి ఇగ్నిస్ లభించే అన్ని వేరియంట్ల మీద గరిష్టంగా 60,000 రూపాయల విలువైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లు లభిస్తున్నాయి. మారుతి ఇగ్నిస్ ధరల శ్రేణి రూ. 4.74 లక్షల నుండి రూ. 7.10 లక్షల మధ్య (డిస్కౌంట్లు కాకుండా) ఎక్స్-షోరూమ్, ఇండియాగా ఉన్నాయి.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి బాలెనో

మారుతి బాలెనో కంపెనీ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ప్రస్తుతం ఇది మారుతి నెక్సా విక్రయ కేంద్రాలలో మాత్రమే ప్రత్యేకంగా లభ్యమవుతోంది. బాలెనో అత్యధిక ఫీచర్లతో ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది 14 విభిన్న వేరియంట్లు మరియు ఆరు విభిన్న రంగుల్లో లభిస్తోంది.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి బాలెనో 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది. పెట్రోల్ ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ వేరియంట్లో కూడా లభిస్తుంది, ఇది 90బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి తమ బాలెనో కారును 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లో కూడా విక్రయిస్తోంది, ఇది గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి బాలెనో ఆర్ఎస్ వేరియంట్ శక్తివంతమైన 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోది, ఇది 102బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, బాలెనో ఆల్ఫా (నాన్-హైబ్రిడ్) వేరియంట్లో మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తోంది.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి బిఎస్-6 ప్రమాణాలను పాటించే బాలెనో వేరియంట్ల మీద రూ. 40,000 వరకు, బిఎస్-5 ప్రమాణాలను పాటించే వేరియంట్ల మీద రూ. 55,000, అన్ని డీజల్ వేరియంట్ల మీద రూ. 50,000 (ఐదేళ్ల ఉచిత వారంటీ), బాలెనో ఆర్ఎస్ వేరియంట్ల మీద రూ. 75,0090 వరకు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

మారుతి సుజుకి బాలెనో ధరల శ్రేణి రూ. 5.59 లక్షల నుండి రూ. 8.90 లక్షల మధ్య (డిస్కౌంట్లు కాకుండా) ఎక్స్-షోరూమ్, ఇండియాగా ఉన్నాయి.

లక్ష రూపాయలు డిస్కౌంట్ ప్రకటించిన మారుతి

మారుతి సుజుకి ప్రకటించిన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా బిఎస్-4 స్టాకును అమ్మేయాలనే లక్ష్యంగా పండుగ నేపథ్యంలో ప్రకటించిన ఆఫర్లను మళ్లీ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా అన్ని బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద 50 రూపాయల నుండి ఏకంగా లక్ష రూపాయల వరకు అద్భుతమైన డిస్కౌంట్లతో పాటు ఐదేళ్ల పాటు వారంటీని పూర్తి ఉచితంగా అందిస్తోంది. పూర్తి వివరాలకు సమీపంలోని మారుతి అధీకృత డీలర్‌ను సంప్రదించిండి.

Most Read Articles

English summary
Maruti Suzuki Ciaz, S-Cross, Ignis, Baleno: Discounts & Benefits Offered For November. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X