ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఎంజి మోటార్ ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా హెక్టార్ ఎస్‌యూవీని దేశీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కంపెనీ ఈ కారును ఇప్పటికే మార్కెట్లో విజయాన్ని సాధించింది. దేశంలో తొలి ఇంటర్నెట్ కనెక్టెడ్ కారు కావడంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీ తన లుక్, డిజైన్‌తో వాహన ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ కారు కేవలం బయటి నుంచే కాదు.. లోపల కూడా అదిరిపోయింది.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఇది ఇలా ఉంటె ఎంజి మరో కారును విడుదల చేయనున్నది, అది కూడా ఎలక్ట్రిక్ విభాగంలో దీని తయారీ మొదలుపెట్టేసింది. హెక్టార్ దీనిని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ గా భారత మార్కెట్లో విదుదల చేయనుంది, మరి ఈ ఎంజి ఎలక్ట్రిక్ కార్ గురించి తెలుసుకొందామా.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఎంజి మోటార్ ఇటీవల భారత మార్కెట్లో తమ మొదటి ఉత్పత్తిని ప్రారంభించింది, మిడ్-సైజ్ హెక్టర్ ఎస్‌యూవీ. ఇప్పుడు ఈ సంస్థ ఇప్పటికే తన రెండో ఉత్పత్తి అయిన ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో లాంచ్ చేసే పనిలో ఉంది. కొత్త ఎంజి ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే సంవత్సరంలో విడుదల చేయనుంది.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఎంజి దేశంలో దశలవారీగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ని లాంచ్ చేయనున్నట్లు నివేదించింది. ఈ ఎంజి ఈజెడ్ఎస్ ప్రాథమికంగా ఢిల్లీ-ఎన్ సిఆర్, ముంబై, హైద్రాబాద్, బెంగళూరు మరియు అహ్మదాబాద్ వంటి ఈ ఐదు నగరాల్లో ప్రారంభం చేయనుంది.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఎంపిక చేయబడ్డ నగరాలలో ఈ ఎలక్ట్రిక్ కార్ కొరకు అవసరమైన ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా పొందుతాయని, దీని యొక్క లాంచ్ కు ముందు ఎంజి ఈ ఐదు నగరాల్లోని అన్ని డీలర్ షిప్ లలో దేశీయంగా మొదటి 50 కిలో.వాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ ను నెలకొల్పడానికి సహాయంగా ఫోర్టమ్-ఎ ఫిన్నిష్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం చేసుకొంది.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఈ ఫాస్ట్ చార్జర్లను ఈజెడ్ఎస్ ప్రయోగానికి ముందు ఏర్పాటు చేయాలని, సెప్టెంబర్ నెల నాటికి ఇవి పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. కంపెనీ డీలర్ షిప్ ల్లో వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ తో పాటుగా, కస్టమర్ ల కొరకు హోమ్ ఛార్జింగ్ పాయింట్ లను సెటప్ చేయడం కొరకు ఎంజి ఒక దేశీయ భాగస్వామితో కలిసి పని చేయనుంది.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఈ హోమ్ ఛార్జింగ్ పాయింట్లను ఖాతాదారులకు అదనపు ఖర్చుతో ఎంజి ఏర్పాటు చేస్తారు. రాజీవ్ ఛాబా (ప్రెసిడెంట్ & ఎండి, ఎంజి మోటార్ ఇండియా) ఆటోకార్ తో ఇలా అన్నాడు: "మనం ఇప్పటికే మొదలుపెట్టి ఉండాల్సింది . మౌలిక సదుపాయాల కొరకు మేం వేచి ఉండలేం వీటి తరువాత కారును లాంచ్ చేస్తున్నాం.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

వినియోగదారుల స్థానంలో ఛార్జింగ్ అవస్థాపన మా ద్వారా జరిగేలా మేము నిర్ధారించుకుంటాం. "ఎంజి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పరంగా, కంపెనీ ఇంకా అధికారికంగా ఎలక్ట్రిక్ మోటార్ పొరింగ్ మోడల్ నుండి ఖచ్చితమైన గణాంకాలు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 300కి.మీ రేంజ్ లో ఉంటాయని చెప్పారు.

ఈజెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును తీసుకొస్తున్న ఎంజి మోటార్

ఎంజి ఎస్‌యూవీ బ్రాండ్ నుంచి రెండో ప్రొడక్ట్ మరియు భారతీయ మార్కెట్ లో మొదటి ఎలక్ట్రిక్ వేహికల్ గా ఉంటుంది. గుజరాత్ లోని హలల్ ప్లాంటులోకి ఇది రానుంది. ఇది భారతదేశంలో ప్రారంభించబడిన తరువాత, ఈ ఎంజి ఎలక్ట్రిక్ కార్ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లపై పోటీ పడనుంది, ఇది త్వరలో భారతదేశంలో అరంగేట్రం చేయనున్నట్లు చెప్పవచ్చు.

Most Read Articles

English summary
MG Motor recently launched their first product in the Indian market, with the mid-size Hector SUV. Read in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X