ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

ఎంజీ మోటార్ ఇండియా తమ మొట్టమొదటి కారును దేశీయ విపణిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. బ్రిటీష్ బ్రాండ్ ఎంజీ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి ఉత్పత్తిగా ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీని ఖరారు చేసింది. తాజాగా అందిన సమాచారం మేరకు జూన్ 27న హెక్టార్ ఎస్‌యూవీని విక్రయాలకు సిద్దంగా పూర్తిస్థాయిలో లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.

ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ భారతదేశపు మొట్టమొదటి "ఇంటర్నెట్ కారు" మరియు ఇందులో ఎన్నో అత్యాధునిక సాంకేతిక ఫీచర్లున్నాయి. ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ మీద రూ. 50,000 లతో ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న 120 ఎంజీ మోటార్ విక్రయ కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ రోడ్డు మీద చూడటానికి భారీ పరిమాణంలో ఉంటుంది. ఎంజీ హెక్టార్ పొడవు 4,655ఎమ్ఎమ్, వెడల్పు 1,835ఎమ్ఎమ్, ఎత్తు 1,760ఎమ్ఎమ్ అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ 198ఎమ్ఎమ్‌గా ఉంది. కొలతల పరంగా చూస్తే ఇది ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వస్తుంది.

ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

డిజైన్ పరంగా ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీలో ముందువైపున పగటి పూట వెలిగే ఎల్ఈడై లైట్ల (DRL's) జోడింపుతో కూడిన డ్యూయల్ హెడ్ ల్యాంప్ ఉంది, ఇందులో సింగల్ యూనిట్ ఇండికేటర్లుగా పనిచేస్తాయి. DRL's క్రింద ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి.

ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

ఎంజీ హెక్టార్ సైడ్ ప్రొఫైల్ భారీ ఆకారంలో ఉన్న ఎస్‌యూవీనే తలపిస్తుంది. చతుర్భుజాకారంలో ఉన్న వీల్ ఆర్చెస్‌తో బాడీ మొత్తం బాక్స్ ఆకారంలో ఉంటుంది. ఎస్‌యూవీకి స్పోర్టివ్ ఫీలింగ్‌ కల్పించే పదునైన షోల్డర్ లైన్స్, క్రీస్ లైన్స్ మరియు 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

ఎంజీ హెక్టార్ ఇంటీరియర్‌లో ప్రీమియం లుక్ అందించే బ్లాక్ ఇంటీరియర్ ఫినిషింగ్ చూడవచ్చు. ఇంటీరియర్‌లో అందరి దృష్టిని ఆకర్షించే వాటిలో ఎంజీ ఐ-స్మార్ట్ టెక్నాలజీతో వచ్చిన 10.4-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఒకటి. ఇండియన్ మార్కెట్‌కు అత్యంత అవసరమైన ఎన్నో అదనపు ఫీచర్లు దీని సొంతం.

ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇందులోని 1.5-లీటర్ టుర్బో-పెట్రోల్ ఇంజన్ 143బిహెచ్‌పి-250ఎన్ఎమ్ అదే విధంగా 2.0-లీటర్ డీజల్ ఇంజన్ 173బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్ వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు పెట్రోల్ వెర్షన్‌ను డీసీటీ గేర్‌బాక్స్ (ఆటోమేటిక్)తో ఎంచుకోవచ్చు.

ఎంజీ హెక్టార్ విడుదల తేదీ ఖరారు: టాటా హ్యారియర్, జీప్ కంపాస్‌కు చుక్కలే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంజీ హెక్టార్ భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ కారు మరియు చైనా కార్ల తయారీ దిగ్గజం సొంతం చేసుకున్న బ్రిటీష్ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ నుండి దేశీయ విపణిలోకి వస్తున్న తొలి కారు కూడా ఇదే. ఎంజీ హెక్టార్ రూ. 14 లక్షల నుండి రూ. 19 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న టాటా హ్యారియర్ మరియు జీప్ కంపాస్ మిడ్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీలకు సరాసరి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
MG Hector Launch Date Confirmed — To Rival The Likes Of The Jeep Compass. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X