ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

ఎంజీ మోటార్ ఇండియా ఇప్పటికే మార్కెట్లో హెక్టర్ ని విడుదల చేసింది. ఇప్పడు తన రెండవ ఉత్పత్తిని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ బ్రాండ్ నుండి కొత్త ఉత్పత్తి అయిన జెడ్ఎస్అని పిలువబడే ఎలక్ట్రిక్ ఎస్‌యూవి ఇదే అవుతుంది. కొత్త MG eZS 2020 ప్రారంభంలో భారతదేశంలో ప్రవేశపెట్టబడుతుంది. ఎంజి దేశంలో జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవి ని ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

భారతదేశంలో ఎంజి జెడ్ఎస్ ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని సమావేశాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంలో ఎలక్ట్రిక్ వాహనాల గురించి తన అనుభవాలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ & ఎండి రాజీవ్ చాబా కూడా పాల్గొన్నారు.

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

నితిన్ గడ్కరీ ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ల గురించి వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా చెప్పారు. భారతదేశం నిరంతరం ప్రగతి సాధిస్తూనే ఉంది. ఇందులో భాగంగా జెడ్ఎస్ యొక్క ఆవిర్భావం ఒక నవ శకానికి దారితీస్తుంది అన్నారు. ఈ రకమైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడం వల్ల భవిష్యత్ లో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టవచ్చు. అలాగే నిరంతర తగ్గిపోతూవున్న శిలాజ ఇంధనాలపై ఇక ఆధారపడటం తగ్గుతుంది. దేశంలో ఇలాంటి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కావలసిన చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఎంజి మోటార్ ఇండియా వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడం సంతోషకరమైన విషయం అని చెప్పారు.

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ & ఎండి రాజీవ్ చాబా మాటాడుతూ FAME-II మరియు BS-VI ప్రమాణాలను ప్రారంభించడం వంటి అనేక అభివృద్ధి చర్యల జరుగుతున్నాయి. క్లీనర్ టెక్నాలజీలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అన్నారు. ఎంజి మోటార్ ఇండియా సంస్థ యొక్క సుస్థిరత మరియు హరిత చైతన్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రశంసించారు. ఛార్జింగ్ సదుపాయాల కోసం ఇతర సంస్థలతో మా అనుబంధాలను కొనసాగిస్తున్నాము. పర్యావరణం యొక్క అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం సహకరిస్తుంది అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు.

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

ఎంజి ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ధరల గురించి ఎండి రాజీవ్ చాబా మాట్లాడుతూ ఈ ఎలక్ట్రిక్ వాహనం యొక్క నిర్దిష్టమైన ధర లాంచ్ చేసే సమయంలో వెల్లడిస్తామని ప్రకటించారు. కానీ వీటి ధర సుమారుగా రూ. 20 నుండి 25 లక్షల వరకు ఉండవచ్చని ఒక అంచనా.

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుతం దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి బహుళ ఛార్జింగ్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ సంస్థ ఇటీవలే గురుగ్రామ్‌లో తన మొదటి 50 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఫోర్టమ్‌తో కలిసి ఏర్పాటు చేసింది.

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

ఎంజి జెడ్‌ఎస్ యొక్క ఎలెక్ట్రిక్ కారు భారతదేశంలో వచ్చే సంవత్సరం జనవరిలో విక్రయించడానికి సిద్ధంగా ఉంది. ఈ కంపెనీ ఎండి రాజీవ్ చాబా కూడా జనవరి 2020 లో అమ్మకాలు చేపడతామని ప్రకటించారు. ఎంజి జెడ్‌ఎస్ లాంచ్ అయినా తరువాత ఇది ఇప్పటికే మార్కెట్ లో ఉన్న హ్యుండాయ్ కోనా మరియు టాటా నెక్సాన్ వంటి వాహనాలకు పోటీగా నిలవాల్సి ఉంటుంది.

Read More:భర్తకు జావా క్లాసిక్ బైక్ ని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన భార్య

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

భారతదేశంలో ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆలోచనలు:

జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనం హెక్టర్ తరువాత ఇండియాలో విడుదలైన ఎంజి యొక్క రెండవ ఉత్పత్తి. ఎంజి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో విక్రయించబడటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి త్వరలో బుకింగ్ కూడా ప్రారంభించనున్నారు. మొదట ఈ ఎలెక్ట్రి కారుని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే అమ్మకాలు చేప్పట్టబోతోంది. తరువాత దశలో భారతదేశం అంతటా వీటి అమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు కేవలం 5 నగరాలలో మాత్రమే జెడ్ఎస్ వాహనాలు లభిస్తాయని ఇంజి ఒక ప్రకటనలో తెలియజేసింది.

Read More:ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారుగురించి నితిన్ గడ్కరి ఏం చెప్పారో తెలుసా..?

రాబోయే తరంలో దాదాపు చాల వరకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండబోతాయి. ఈ ఎలెక్ట్రిక్ వాహనాలు ప్రారంభించడం వాళ్ళ చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు శిలాజాల అవసరం ఉండదు కావున పర్యావరణం కాలుష్యరహితంగా ఉంటుంది. ఈ రకమైన కాలుష్యరహిత వాతావరం కావాలనుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విస్తృతంగా జరగాలి, దీనికి ప్రభుత్వాలుకూడా కృషి చేయాలి.

Most Read Articles

English summary
Nitin Gadkari Experiences The Upcoming MG eZS SUV Ahead Of Launch: Expected Price Range Confirmed-Read in Telugu
Story first published: Friday, December 20, 2019, 12:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X