ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

ఎంజి మోటార్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీ బుకింగ్ కోసం డిసెంబర్ 21దాకా ఎదురుచూడక తప్పదు. డిసెంబర్ 21 నుండి ఫ్రీ బుకింగ్ ను స్వీకరిస్తున్నట్లు నిర్వహణ వర్గాలు వెల్లడించాయి. ఎంజి జెడ్ఎస్ ఇవి ని ఈ నెల మొదటివారంలో ఆవిష్కరించారు కానీ ఫ్రీ బుకింగ్ కోసం కొన్నిరోజులు ఎదురు చూడాల్సి ఉంది. ఎంజి జెడ్ఎస్ ఇవి అనేది ఎంజి యొక్క రెండవ మోడల్. ఇది దాదాపు యుకె-స్పెక్ మోడల్‌ కి సమానంగా ఉంటుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

ఎంజి లో ఒకటైన జెడ్ఎస్ ఇవి అనేది హ్యుండాయ్ క్రెటా వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీ. పొజిషనింగ్ పరంగా చూసినట్లయితే హెక్టార్ లాగా ఉంటుంది. ఇంకా ఎంజి వాహనం యొక్క కొలతల విషయానికి వస్తే దీని పొడవు 4314 మి.మీ, వెడల్పు 1809 మి.మీ ఉంటుంది. వీస్ బేస్ లో అయితే 2579 మిమీ ,1620 పొడవు ఉంటాయి. దీని మొత్తం ఆకారం మరియు సిల్హౌట్‌ను చూస్తే ఎస్‌యూవీ కంటే క్రాస్ఓవర్‌గా ఉంటుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

ముందు భాగంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు వెనుక వైపున ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ తో కూడి విస్తృత క్రోమ్ స్టడ్ గ్రిల్‌ ఉంటుంది. క్యాబిన్ మొత్తం నలుపురంగులో ఉంటుంది. ఇంకా డాష్, డోర్ ప్యాడ్ లు మరియు చివర వృత్తాకార ఎయిర్-కాన్ వెంట్స్ పై వెండి ఇన్సెర్ట్ లు అమర్చబడి ఉంటాయి. ఎంజి జెడ్ఎస్ ఇవి ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

ఫ్లాట్- బాటంలో స్టీరింగ్ వీల్, ముందు భాగంలో యుఎస్బి మొబైల్ ఛార్జింగ్, బ్లూటూత్ మరియు వీటితో పాటు వెనుక వైపు చూడటానికి కెమెరా వంటి సదుపాయాలుకూడా ఇందులో ఉన్నాయి. ఇందులో సన్‌రూఫ్ 90 శాతం పైకప్పును కలిగి ఉంటుంది. ఐ స్మార్ట్ ఇవి 2.0 టెక్నాలజీతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. వాహనంలోని చేడు గాలిని కేవలం 35 నిముషాల్లో బయటకి పంపి సాధారణ స్థాయికి తీసుకు వచ్చే ఒక ప్రత్యేక టెక్నాలజీ ఇందులో ఉంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

ఈ వాహనంలో శక్తివంతమయిన 44.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలదు. ఇది ఒకసారి ఛార్జ్ వేసుకుంటే దాదాపు 340 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇందులో ఉన్న లిథియం అయాన్ యూనిట్ కి 50 కిలోవాట్ల డిసి ఛార్జర్‌తో 40 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయగల శక్తీని కలిగి ఉంది. ఇది కాకుండా 7.4 కిలోవాట్ల ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి ఏడు గంటల సమయం పడుతుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

బ్యాటరీతో నడిచే ఈ వాహనం యొక్క సింక్రోనస్ మోటారు 141 బిహెచ్‌పి మరియు 353 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. అంతే కాకుండా ఓవర్-ది-ఎయిర్ (ఒటిఎ) టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఈ కారు కేవలం 8 సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్ప్రింట్ చేయగలదు.

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

కొత్త జెడ్ఎస్ ఇవి లో ఉపయోగించిన బ్యాటరీ వ్యవస్థ IP67 తో సర్టిఫైడ్ చేయబడి ఉంటుంది. ఇది నీరు మరియు డస్ట్ ని తొలగించగలదు. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే భారతదేశంలో జెడ్‌ఎస్ ఇవి ని 1 లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించినట్లు కంపెనీ వర్గాలు తెలియజేశాయి.

Read More:క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను సాధించిన హ్యుండాయ్ వెన్యూ

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

ఇప్పుడు నూతనంగా వెలువడుతున్న చాలా వాహనాలలో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. కానీ వాటికంటే భిన్నంగా ఎంజి జెడ్ఎస్ ఇవి లో కొన్ని అమర్చబడ్డాయి. ఇది ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు. ఇందులో ఉన్న బ్యాటరీ చాల వరకు వినియోగదారునికి అనుకూలంగా ఉంటుంది.

Read More:2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న బజాజ్ చేతక్ డెలివరీలు

ఎంజి జెడ్ఎస్ ఇవి యొక్క ప్రీ-బుకింగ్స్ ఇక డిసెంబర్ 21 నుండి...

ఇది బ్యాటరీతో నడిచే కారు కాబట్టి వినియోగదారులకు ఒక సందేహం రావచ్చు. ఒకవేళ ప్రయాణం మధ్యలో ఛార్జ్ అయిపోతే ఎలా అని, కానీ ఎంజి మోటార్ జెడ్ఎస్ ఇవి కోసం రోడ్ సైడ్ ఛార్జింగ్ సహాయంతో సహా బహుళ ఛార్జింగ్ పరిష్కారాలను అందిస్తోంది. ఇటువంటి సదుపాయాలన్నీ వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా మార్కెట్ లో ప్రత్యర్థులకు ప్రత్యర్థిగా గట్టి పోటీని ఇవ్వడానికి కల్పిస్తుంది. ఇన్ని సదుపాయాలను కల్పించిన జెడ్ఎస్ ఇవి ధర ఇండియాలో దాదాపుగా 22 లక్షలు వరకు ఉండవచ్చు.

Source: NDTV Auto

Most Read Articles

English summary
MG ZS EV Pre-Bookings To Begin From December 21-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X