Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విపణిలోకి సరికొత్త ఆడి ఏ6: ధర రూ. 54.20 లక్షలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి.. ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2019 ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2019 ఆడి ఏ6 ప్రారంభ ధర రూ. 54.20 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్, ఫీచర్లు మరియు డిజైన్ పరంగా ఆడి ఏ6 లేటెస్ట్ వెర్షన్ పూర్తిగా మారిపోయింది. మరిన్ని వివరాలు మరియు ఫోటోలు చూద్దాం రండి..

సరికొత్త ఆడి ఏ6 కారు ఓల్డ్ వెర్షన్ కంటే పదునైన డిజైన్ మరియు స్పోర్టివ్ శైలిలో వచ్చింది. న్యూ లుక్‌లో వచ్చిన స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌కు మధ్యలో వచ్చిన అధునాతన ఫ్రంట్ గ్రిల్, బానెట్ మీదున్న షార్ప్ అండ్ స్ట్రాంగ్ లైన్స్ కారు ముందు భాగానికి కండలు తిరిగిన రూపాన్నిచ్చాయి.

అంతే కాకుండా నూతన ఆడి ఏ6 లగ్జరీ సెడాన్‌లో లేటెస్ట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం ఫీల్ కలిగించే పొడవైన వీల్ బేస్, రియర్ డిజైన్‌లో ఇరువైపులా ఉన్నా స్టైలిష్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కనెక్ట్ చేసే ఆకర్షణీయమైన క్రోమ్ పట్టీ కలదు.

సరికొత్త 8వ జనరేషన్ ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ కారు క్యాబిన్ పూర్తిగా మారిపోయింది. కొత్త ఏ6 ఇంటీరియర్‌లో ట్విన్-టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వర్చువల్ కాక్‌పిట్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియంట్ లైటింగ్ ప్యాకేజ్, అత్యాధునిక మల్టీ మీడియా ఇన్ఫర్మేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు పానొరమిక్ సన్‌రూఫ్ వంటి విలాసవంతమైన ఫీచర్లు వచ్చాయి.

కొత్త ఆడి ఏ6 సెడాన్‌లోని సీట్లను అత్యంత ఖరీదైన ప్రీమియం లెథర్‌తో తయారు చేశారు. ఇంటీరియర్‌లో పియానో బ్లాక్, కలపతో చేసిన మరియు పలు అల్యూమినియం డిజైన్ ఎలిమెంట్లను అందించారు. వీటన్నింటి మేళవింపుతో లగ్జరీ విషయంలో ఏ6 కారును మరో లెవల్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.

సేఫ్టీలో ఏ మాత్రం రాజీపడకుండా.. ఆడి తమ ఏ6 సెడాన్ కారులో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించింది. అందులో, 8 ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్-హోల్డ్-ఫంక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి.

2019 8వ జనరేషన్ ఆడి ఏ6 కారు సింగల్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇందులోని 2.0-లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 240బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్‌ను జోడించిన 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

ఏప్రిల్ 2020 అమల్లోకి రానున్న బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త ఆడి ఏ6 సెడాన్‌లోని ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఆడి ఏ6 గరిష్ట వేగం గంటకు 250కిమీలుగా ఉంది. అయితే 0-100కిమీ వేగాన్ని కేవలం 6.8 సెకండ్లలోనే అందుకుంటుంది. ఇందులోని బిఎస్6 ఇంజన్ లీటర్‌కు 14.11కిమీల మైలేజ్ ఇస్తుందని ఆడి పేర్కొంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఆడి ఇండియా ఎట్టకేలకు 8వ జనరేషన్ ఏ6 సెడాన్ కారును దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పూర్తిగా మారిపోయిన ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు ఫీచర్లతో పాటు సాంకేతికంగా ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సరికొత్త 2019 ఆడి ఏ6 లగ్జరీ సెడాన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.