Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విపణిలోకి సరికొత్త టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల ధర ఎంతంటే?
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా మోటార్స్ విపణిలోకి సరికొత్త యారిస్ 2019 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. 2019 టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ప్రారంభ ధర రూ. 8.65 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు ప్రకటించారు. యారిస్ ఫేస్‌లిఫ్ట్ జె-ఆప్షనల్ మరియు వి-ఆప్షనల్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది.

టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ కారులో సాంకేతికంగా అదే మునుపటి శక్తివంతమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 106బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా తాజాగా విడుదల చేసిన యారిస్ ఫేస్‌లిఫ్ట్‌లోని జె-ఆప్షనల్ వేరియంట్ మ్యాన్యువల్ మరియు సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ ధర రూ. 8.65 లక్షలు మరియు ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 9.35 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

టయోటా యారిస్ వి-ఆప్షనల్ వేరియంట్ విషయానికి వస్తే.. ఇది కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తోంది. కానీ డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్ మరియు కొత్తగా డిజైన్ చేయబడిన డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అదనంగా వచ్చాయి. వి-ఆప్షనల్ మ్యాన్యువల్ ధర రూ. 11.97 లక్షలు మరియు సీవీటీ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 13.17 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఇవ్వబడ్డాయి.

రెండు విభిన్న అదనపు వేరియంట్లతో పాటు ఇంకా ఎన్నో నూతన ఫీచర్లు ఇందులో పరిచయం అయ్యాయి. డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్, పియానో బ్లాక్ ఫినిషింగ్ గల ఫ్రంట్ గ్రిల్, సైడ్ మిర్రర్లు మరియు ఫాగ్ ల్యాంప్ ఫినిషింగ్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ లైట్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ సిగ్నల్స్ గల సైడ్ మిర్రర్లు మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్‌లో కూడా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి. ప్రీమియం లెథర్ సీట్లు, అప్‌హోల్‌స్ట్రే, లెథర్ ఫినిషింగ్ గల స్టీరింగ్ వీల్, గేర్ షాప్ట్, డ్యూయల్ వాటర్ ఫాల్ డిజైన్‌లో ఉన్న ఇంస్ట్రుమెంట్ ప్యానల్ గల డ్యూయల్-టోన్ క్యాబిన్, 7.0-ఇంచుల టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రూఫ్ ఆధారిత ఏసీ వెంట్స్ మరియు 8-రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ పరంగా 2019 టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్‌లో 7-ఎయిర్ బ్యాగులు, హిల్-స్టార్ట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టయోటా ఆథరైజ్డ్ విక్రయ కేంద్రాలలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో పాటు గతంలో లభించే అన్ని సింగల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. వైల్డ్-ఫైర్ రెడ్, ఫాంటమ్ బ్రౌన్, పర్ల్ వైట్, సూపర్ వైట్, సిల్వర్ మరియు గ్రే రంగుల్లో దీన్ని ఎంచుకోవచ్చు.

టయోటా యారిస్ కారును గత ఏడాది తొలిసారిగా విడుదల చేశారు. దానికి కొనసాగింపుగా పలు అప్‌డేట్స్, మార్పులు చేర్పులతో 2019 వెర్షన్‌లో లాంచ్ చేశారు. టయోటా ఇండియా లైనప్‌లో ఉన్న ఎటియోస్ మరియు కరోలా ఆల్టిస్ మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. సరికొత్త 2019 టయోటా యారిస్ విపణిలో ఉన్న మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ మరియు స్కోడా ర్యాపిడ్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.