రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

రెనో ట్రైబర్ ఎంపీవీ కారు సరిగ్గా రెండు నెలల క్రితం ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. ఫ్రెంచ్ దిగ్గజం రెనో ట్రైబర్ ఎంపీవీ కారును ఒక కొత్త మోడల్‌గా విపణిలోకి తీసుకొచ్చింది. సబ్-4 మీటర్ కెటగిరీలో 6&7-సీటర్ ఎంపీవీగా రావడంతో కంపెనీ సైతం ఊహించని డిమాండ్ ఈ మోడల్‌కు లభిస్తోంది.

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

ట్రైబర్ ఎంపీవీ విడుదలైన రెండు వారాల తర్వాత ట్రైబర్ ఒక కొత్త రికార్డు సాధించినట్లు రెనో ప్రకటించింది. తొలి రెండు నెలల్లోపే 10 వేలకు పైగా ట్రైబర్ కార్లు అమ్ముడైనట్లు రెనో పేర్కొంది. చాలా కాలం తర్వాత రెనో ఇలాంటి సక్సెస్ అందుకుంది.

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

గత ఏడాదితో పోల్చుకుంటే అక్టోబర్ 2019 నెలలో రెనో ఇండియా 63% శాతం వృద్దిని నమోదు చేసుకుంది. అది కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో రెనో ఈ గణనీయమైన వృద్దిని సాధించింది.

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

అత్యంత పోటీతత్వం కూడిన ధరల శ్రేణిలో, అత్యాధునిక లేటెస్ట్ ఫీచర్లతో రావడం రెనో ట్రైబర్ సక్సెస్‌కు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ఒక సాధారణ హ్యాచ్‌బ్యాక్ కారు లభించే రూ. 4.95 లక్షల ప్రారంభ ధరతోనే 7 మంది వరకు ప్రయాణించే సీటింగ్ కెపాసిటీతో రెనో ట్రైబర్ ఎంపీవీ రావడంతో భారీ హిట్టు కొట్టింది.

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

ధరకు తగ్గ విలువలతో మార్కెట్లో లభించే ఎన్నో హ్యాచ్‌బ్యాక్ కార్లకు రెనో ట్రైబర్ ఎంపీవీ గట్టి పోటీనిచ్చింది. అందులో మారుతి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లు ఉన్నాయి. ఒక రకంగా వీటి సేల్స్ రెనో ట్రైబర్ తినేసిందనే చెప్పాలి.

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

ధరకు విలువలతోనే కస్టమర్లను ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా ఎన్నో కార్లలో లభించే అత్యాధునిక ఫీచర్లను తప్పనిసరిగా అందించింది, అందులో...

ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్స్ సపోర్ట్ చేసే 8-ఇంచుల టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఎసీ ఎంట్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

సాంకేతికంగా రెనో ట్రైబర్ ఎంపీవీలో రెనో క్విడ్ నుండి సేకరించిన 1.0-లీటర్ కెపాసిటీ గల బిఎస్-4 పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2020 ప్రారంభం నాటికల్లా దీనిని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

రెనో ట్రైబర్ ఎంపీవీ కారును స్వయంగా నడిపి టెస్ట్ డ్రైవ్ చేశాము. రెనో ట్రైబర్ కారును కొనచ్చా..? కొనడకూడదా..? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంతో పాటు రెనో ట్రైబర్ ఎంత వరకు మంచిది వంటి ఎన్నో అంశాలను రివ్యూలో వివరించాము.. "పూర్తి వివరాల కోసం ట్రైబర్ ఎంపీవీ రివ్యూ ఇప్పుడే చదవండి"

రికార్డులు ధ్వంసం చేసిన ట్రైబర్ కారు.. రెనో ఖాతాలో అరుదైన మైలురాయి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫ్రెంచ్ దిగ్గజం రెనో దేశీయంగా ఆశించిన మార్కెట్ సాధించలేకపోతోంది. డస్టర్ మరియు క్విడ్ కార్లు మాత్రమే ఓ రకమైన సేల్స్ సాధించిపెట్టేవి. కానీ ఇటీవల విడుదలైన రెనో ట్రైబర్ ఎంపీవీ అంచనాలను తారుమారు చేసింది. విడుదలైన రెండు నెలలకే భారీ సేల్స్ సాధించింది పాత రికార్డులు చెరిపేసింది. మరో నాలుగైదు నెలలపాటు రెనో ట్రైబర్ ఇదే తరహా ఫలితాలు కనబరిచే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Triber Sales Crosses 10,000 Units Mark: New Sales Milestone Achieved Within 2 Months. Read in Telugu.
Story first published: Monday, November 11, 2019, 11:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X